2014-07-27

ద్వాదశ రాశులు - ప్రమాణములు


ద్వాదశ రాశులను 12 లగ్నములుగా సూచించి లగ్న ప్రమాణములు చెప్పినారు . ఇవి భూమిపై నున్న అక్షాంశ రేఖాంశ ములను బట్టి కొద్ది మార్పులు వచ్చును . సుమారుగా భారత దేశములో రాజమండ్రికి లగ్న ప్రమాణములు ఈ విధంగా ఉన్నవి .

మేష రాశి ప్రమాణము 1 గం .   45 ని . లు  00 సెకన్లు
వృషభ రాశి ప్రమాణము 2 గం . 01 ని . లు 39 సెకన్లు
మిధున రాశి ప్రమాణము 2 గం .11 ని . లు 12 సెకన్లు
కర్కాటక ప్రమాణము 2 గం .11 ని . లు 51సెకన్లు
సింహ రాశి ప్రమాణము 2 గం . 06ని . లు19 సెకన్లు
కన్య రాశి ప్రమాణము 2 గం .04 ని . లు 59సెకన్లు
తులరాశి ప్రమాణము 2 గం . 09 ని . లు39 సెకన్లు
వృశ్చిక రాశి ప్రమాణము 2గం .13ని . లు 24సెకన్లు
ధనుస్సు రాశి ప్రమాణము 2 గం .07ని. లు 26సెకన్లు
మకర రాశి ప్రమాణము 1 గం . 54 ని . లు48 సెకన్లు
కుంభ రాశి ప్రమాణము 1 గం .  38 ని . లు28 సెకన్లు
మీన రాశి  ప్రమాణము 1 గం .  36 ని . లు 15సెకన్లు

ఈ విధంగా పన్నెండు రాశుల ప్రమాణము కలిపితే 23 గంటల 56 నిమిషములు వచ్చును . తిరిగి అవే లగ్నములు వచ్చు చున్నవి రోజుకు 24 గంటలు అయినపుడు ఒక రోజులో 23గంటల 56 నిముషాలు గతించి తర్వాత లగ్నములో సుమారు 4 నిమిషములు భూ గమనము జరుగుతుంది , దీనినే జ్యోతిష్యులు లగ్నభుక్తి గా సూచిస్తున్నారు .

ఉదా : ఏప్రిల్ నెలలో  13నుండి 16 వతేదీ లోపల మేష సంక్రమణము జరుగుతున్నది . మేష లగ్న ప్రమాణమును 1గంట 45 ని. లను 30 భాగాలు గా విభజిస్తే మేష సంక్రమణము జరిగిన నాటినుండి రోజుకు 3 నిమిషముల 30సెకన్లు లగ్న భుక్తి జరిగి 30రోజుల తరువాత భూమి 31వ డిగ్రీకి వస్తుంది . దీనినే వృషభ సంక్రమణం అంటారు . ఈ విధంగా భుక్తి జరుగుచు సంవత్సరములో 12 సంక్రమనములు వచ్చును

27 నక్షత్రములను  దేవ రాక్షస మానుష గణములుగా విభజించిరి
అశ్విని ,మృగశిర ,పునర్వసు , పుష్యమి , హస్త  స్వాతి , అనూరాధ శ్రవణం రేవతి  ఈ తొమ్మిది నక్షత్రములు : దేవగణమునకు చెందినవి 
కృత్తిక ,ఆశ్రేష , మఖ చిత్త , విశాఖ , జ్యేష్ట , మూల ,ధనిష్ఠ, శతభిషం  ఈ తొమ్మిది నక్షత్రములు : రాక్షస గణమునకు చెందినవి
భరణి ,రోహిణి , ఆరుద్ర ,పుబ్బ, ఉత్తర ,పూర్వాషాడ, ఉత్తరాషాడ, పూర్వాబాద్ర, ఉత్తరాభాద్ర ఈ తొమ్మిది నక్షత్రములు : మనుష్యగణమునకు చెందినవి.

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...