2015-02-15

కర్కాటక రాశి

కర్కాటక రాశి :  ఈ రాశికి అధిపతి చంద్రుడు . ఇది జలతత్వము కలిగిన రాశి . ఈ రాశి యందు జన్మించిన వారు సున్నితమైన మనస్తత్వము కల్గి యుందురు . వీరికి ఇతరుల పట్ల అభిమానము ఎక్కువగా ఉండును . దయ కలవారు . ప్రేమ కలవారు . సాధారణంగా వీరు ఎవరికీ హాని తలపెట్టరు. అందమైన రూపము కలవారు . వీరు వర్తమాన విషయముల గురించి పెద్దగా ఆలోచించరు . భవిష్యత్తును గురించి ఎక్కువగా ఆలోచిస్తారు .

ధనమును పొదుపు చేయుటలో చాలా ఖచ్చితమైన ప్రణాళికతో ఉంటారు . ఎంత ధనము దాచిననూ తృప్తి చెందరు . ఒక విధంగా చెప్పాలంటే వీరు అత్యాశ పరులని అనుకోవచ్చు . ఇతరుల వలన  జరిగిన కష్ట , నష్టములను ఎక్కువ కాలము మనస్సులో ఉంచుకోరు . వీరు సాదా సీదాగా  ఉంటారు. ఆడంబరములకు దూరంగా ఉంటారు . ఏదైనా సాధించాలి అనుకొంటే మాత్రము పట్టు బట్టి మరీ అనుకొన్నది సాధించడము వీరికున్న ప్రత్యేక లక్షణం .

వీరు శాంత స్వభావులు , వీరికి సాధారణముగా కోపము రాదు . కొంచెము చపల చిత్త మనస్సు కలిగియుందురు. అత్యవసర పరిస్తితులలోనూ , జీవితములో కలుగు క్లిష్ట పరిస్థితులలోనూ కుటుంబ సభ్యులు వీరికి అండగా ఉంటారు . ఈ రాశి వారికి భార్యా భర్తల మధ్య అన్యోన్యత కొంచెం తక్కువనే చెప్పాలి .ఎలా అంటే భార్య భర్తల ఇరువురి లో ఈ రాశికి చెందిన వారు రెండవ వారికి లోబడి ఉంటారు . ఇతరుల వలన అవమానము జరిగితే మాత్రము సహించలేరు . ఏదో విధంగా ప్రతీకారము తీర్చుకొంటారు .

 వీరు మనస్సులో ఏది దాచుకోరు ,తమ శ్రేయస్సు కోరేవారు, ఆప్తులు ,స్నేహితులతో మనసులోని భావాలను పంచుకొంటారు . ఏ విషయము నందైనా దీర్గముగా ఆలోచించి గానీ నిర్ణయము తీసుకోరు . విద్యా సంబంధ విషయములలో వీరు మంచి ప్రావీణ్యతను కనబరుస్తారు .   

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...