2013-07-21

జన్మ నక్షత్రము – జనన దోషములు 19 – 27

19. మూల నక్షత్రము ఈ నక్షత్రము ప్రారంభమున 24 నిమిషములు సంధి ఉండును . ఈ నక్షత్రములో 1 వ పాదమున జనన మయిన వారి తండ్రికి, 2 వ పాదము తల్లికి, ౩ వ పాదము ధనమునకు నాశనము కల్గించును 4 వ పాదమున జననము జరిగిన దోషము లేదు . ఈ మూలా నక్షత్రమున జన్మించిన వారి గురించి ఇంకా విశేషముగా చెప్పితిరి .

మూలా నక్షత్ర సమయమును మొత్తం 12 భాగాలుగా విభజించి దోషమును తెలుసు కోవాలి .పన్నెండు భాగాలలో 1 వ భాగము తండ్రికి దోషము 2 తల్లికి ౩ అన్నలకు 4 భాగస్వాములకు 5 పిల్లనిచ్చిన మామగారికి 6 చిన్నాన్న, పెద్ద నాన్నలకు 7 పిన్నమ్మ , పెద్దమ్మ లకు మరియు మేనమామలకు 8 ధనమునకు 9 జీవన నాశనము 10 దరిద్రమును కల్గిస్తుంది 11 భ్రుత్యులు 12 జాతకునికి నాశనము కలుగ చేయును .

జ్యేష్ట ,మూలా నక్షత్రము లలో జన్మించిన వారి దోషము వివాహ కాలము వరకు ఉండును . దోష నివారణ కొరకు ఎద్దు ను దానమివ్వడము . నవ గ్రహ శాంతి , జప , తప , దానములు ఇచ్చుట వలన దోషములు తొలగును .

20 పూర్వాషాడ నక్షత్రము పగటి వేళలో కుమారుడు జన్మించినపుడు తండ్రికి ఆపదలు కలుగును .2  ౩ వ పాదములలో  స్త్రీ గానీ పురుషుడు గానీ ఎవరు పుట్టిననూ తల్లి తండ్రి ఇద్దరికీ గండము . 4 వ పాదమున జననము దోషము లేదు .

21 ఉత్తరాషాడ నక్షత్రము 1  2  ౩  4 పాదములలో జననము దోషము లేదు .
22 శ్రవణం నక్షత్రము 1  2  ౩  4 పాదములలో జననము దోషము లేదు .
23 ధనిష్ట నక్షత్రము 1  2  ౩  4 పాదములలో జననము దోషము లేదు .
24 శతభిషం నక్షత్రము 1  2  ౩  4 పాదములలో జననము దోషము లేదు .
25 పూర్వాబాద్ర నక్షత్రము 1  2  ౩  పాదములలో జననము దోషము లేదు . నాల్గవ పాదము సామాన్య దోషము .
26 ఉత్తరాభాద్ర నక్షత్రము 1  2  ౩  4 పాదములలో జననము దోషము లేదు .

27 రేవతి నక్షత్రము 1  2  ౩  పాదములలో జననము దోషము లేదు .  4 వ పాదమున దోషము . ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన వారికి అల్ప ఆయుర్దాయము కలుగును . మృత్యుంజయ జపములు రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి . .

ఈ నక్షత్రములనే కాక దుష్ట తిధి దోషము , వర్జ్యము , దుర్ముహూర్త కాలముల యందునూ . గ్రహణ సమయములలోనూ జన్మించిన వారికి శాంతి చేయించుట ముఖ్యము .



No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...