2013-07-11

మానవుడు – ఫలితములు



ఈ భూమిపై పుట్టిన మానవులు అందరూ ఒకేలా ఉండుట లేదు . శారీరక ఎదుగుదలలో తేడా ఉంటుంది . మానసిక స్థితిలో , ఆలోచనలో తేడా ఉంటుంది , ఆరోగ్యం , రూపము , తెలివితేటలు , జ్ఞాపక శక్తి ఇలా అనుకుంటూ పొతే ప్రతి విషయములోనూ మనిషి మనిషికి తేడా ఉంటుంది . ఎందుకు ? 

కొంత మందిలో మానసిక ఎదుగుదల లో తేడా ఉంటుంది . కొంతమందిలో శారీరక ఎదుగుదల లో తేడా ఉంటుంది వీటికి కారణము ఏమిటి అని అంటే ఈనాడు మన విజ్ఞాన శాస్త్రవేత్తలు హార్మోనులు లోపమని చెప్పు చున్నారు .
ఈ విషయములను జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పినారు . 

ఉదా : జాతకము ప్రకారము ఫలితమును తెలుసుకొనుటకు మొదట జాతకము తయారు చేయించుకోవాలి . దీనిలో రాశి , నవాంశ , హోర , ద్రేక్కానము , ద్వాదశాంశ , షోడశాంశ , త్రింశాంశ , షష్ట్యంశ , నాడ్యంశ  ఇలా అనేక రకముల గ్రహ చక్రములను వేసుకొని వాటి ద్వారా ఫలిత నిర్ధారణ చేయ వచ్చునని చెప్పారు .

జాతకులు సూర్యుని అంశలో జన్మిస్తే శారీరక దృడత్వము కలిగి ఉంటారు. ధైర్యవంతులు ,పట్టుదల ఎక్కువ ఉంటుంది . గర్వము , అహంకారము కలిగి ఉంటారు . మొండిగా వ్యవహరిస్తారు.

చంద్రుని అంశలో పుట్టిన మానవులు సభల యందు మాటలాడలేరు . సభా పిరికి . క్షణ క్షణము ఆలోచనలను మార్చు కొంటారు . ధైర్య సాహసములు తక్కువ , సిగ్గు , బిడియము కలవారు తొందర తొందరగా మాట్లాడతారు . స్పష్టత ఉండదు .

కుజుని అంశలో జన్మించిన వారికి పగ ప్రతీకారములు ఎక్కువగా ఉంటాయి , ఓర్పు సహనము తక్కువ . వీరు ఎప్పుడు తమకు అనుకూలముగా ఆలోచిస్తూ ఉంటారు . 

బుధుని అంశలో పుట్టిన వారు శాంత స్వభావము కలిగి ఉంటారు .తొందర పడరు .నవ యవ్వనముగా ఉంటారు . మంచి విశాల హృదయము కలిగి ఉంటారు . ప్రతి పనిని ఒక పద్ధతి ప్రకారము చేస్తూంటారు . 

గురుని అంశలో జన్మించిన వారు చూచుటకు హుందాగా పెద్దవారివలె కన్పిస్తారు . మంచి ఆలోచన స్వభావము కలిగి ఉంటారు . జ్ఞాపక శక్తి అధికముగా ఉంటుంది .ఆకర్షణీయమైన రూపము కలిగి ఉంటారు . దైవ భక్తీ ఎక్కువగా ఉంటుంది . పురాతన ఆచార సాంప్రదాయము లపై మక్కువ ఎక్కవ .

శుక్రుని అంశలో పుట్టిన మానవులు అందాన్ని కోరుకొంటారు . స్త్రీల పట్ల ప్రత్యేక దృష్టి తో ఉంటారు . అందమైన రూపము, ఎదుటి వారిని ఆకర్షించే స్వభావము వీరిలో ఉంటుంది . కోపము , చిరాకు ఎక్కువగా ఉంటాయి .

శనిగ్రహము అంశలో జన్మించిన మానవులు బలహీన శరీరము కలవారు. శరీరముపై నరములు కనబడును . బద్ధకము ఎక్కువ . మందబుద్ది కలవారు . నిద్రమత్తు ఎక్కువగా ఉంటుంది . 

రాహువు గ్రహము అంశలో పుట్టిన మానవులు అన్నివిధాల వ్యతిరేక ఆలోచనలను కలిగి ఉంటారు . జ్ఞాపక శక్తి తక్కువ , మతి మరుపు , సంఘ వ్యతిరేక కార్యక్రమములకు పాల్పడతారు .

కేతువు గ్రహము అంశలో పుట్టిన వారు మోక్ష చింతన ఎక్కువ భాద్యతలను విస్మరిస్తారు . లక్ష్య సాధన ఉండదు. అంతా దేవుని వలెనే జరుగు తుందని గట్టి నమ్మకము కలిగి ఉంటారు.        

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...