2013-07-13

గోచారము – శుక్రుడు



గోచారములో శుక్రుడు పన్నెండు రాశులలో  సంచరించునపుడు కలుగు ఫలితములు

శ్లోకం :   అర్ధలాభ శ్చిత్తసౌఖ్యం పరస్త్రీ సంగమస్తదా
          యత్న కార్యార్ధ లాభాస్సాత్ జన్మగే భ్రుగునందనే
శుక్రుడు జన్మరాశిలో సంచరించు నపుడు మనసు ఆనందముగా ఉంటుంది . కోరిన కోర్కెలు నెరవేరతాయి . పర స్త్రీల సంగమము కలుగును . .ధన లాభము కలుగుతుంది . పయత్నించిన పనులు సఫలము అగుటయే కాక ధన లాభము కల్గుతుంది .

శ్లోకం :   కుటుంబ సౌఖ్యమారోగ్యం స్త్రీసల్లాపమ్ యశస్కరం
          దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయస్తో భ్రుగుర్దిశేత్
రెండవ రాశిలో భ్రుగుని సంచారము జరుగు చున్నప్పుడు భార్య భర్తల మధ్య మంచి అనురాగము , ప్రేమా , ఆప్యాయతలు నిండి ఉంటాయి . శారీరక ఆరోగ్యము బావుంటుంది . కుటుంబ సౌఖ్యము , శరీర సౌఖ్యము , ఆహ్లాదకరము గా ఉంటుంది .

శ్లోకం :   వాణిజ్య ధన నాశంచ శత్రువృద్ది: ధన క్షయః
          గతం జీవన రాహిత్యం భార్గావేచ తృతీయగే
మూడవ రాశిని పొందిన శుక్రుడు వ్యాపార వ్యవహారములలో నష్టములను కలిగించును . ధనమునకు నాశనము ఏర్పడును . శత్రువులు పెరుగుతారు . ఓటమి కలుగుతుంది . అన్ని విధాల కష్టంగా ఉంటుంది . గత వైభవమును కోల్పోతారు . బ్రతుకు భారముగా మారుతుంది .

శ్లోకం :   దాసీ భ్రుత్య జనాలాభః నిత్య మృష్టాన్న భోజనం
          ధన ధాన్య మభీస్టార్ధం పంచ మస్తే భవేత్ శుక్రః
పంచమ రాశిలో శుక్రుడు గోచారము లో ఉన్నప్పుడు దాస దాసీలు కలిగి ఉంటారు . ఆదాయము విరివిగా లభిస్తుంది . మంచి భోజన సౌఖ్యము కలుగును . ఇష్టమైన వన్నియు లభిస్తాయి .

శ్లోకం :   విరోధశ్చ తృపీడాచ జ్ఞాతీనాంచ విరోధతః
          ఆయాసో దారపుత్రా ద్యై: షష్ఠగే భ్రుగునందనే
ఆరవ రాశిలో శుక్ర సంచార వేళలో విరోధము , శత్రువులతో ఇబ్బందులు ఏర్పడటము . భార్యతో గొడవలు , జీవిత భాగాస్వామికి అనారోగ్యము కలగడము , సంతాన మూలకముగా సమస్యలు ఏర్పడడ ము జరుగుతుంది .

శ్లోకం :   తాపః కోప స్తదా భీతి: సర్వదా క్లేశ జీవనం
          స్త్రీ జాడ్యం మేహరోగాది భ్రుగౌ సప్తమగే ఫలం
ఎడవ రాశిలో శుక్రడు గోచారములో ఉన్నప్పుడు జ్వర సంభంద రోగములతో భాదపడతారు . కోపము , చిరాకు పెరుతాయి . కష్టమైన జీవనము . స్త్రీలకు రోగములు .మొదలగునవి కలుగును .

శ్లోకం :   దుఃఖనాశో మహా సౌఖ్యం బంధుమిత్ర సమాగమః
          రాజదర్శన మర్దాప్తి రష్టమే భ్రుగు నందనే
ఎనిమిదవ రాశీ సంచారము చేయుచున్న శుక్రుని వలన భాధలు తొలగి పోతాయి . బంధువుల తో మంచి సంభంద భాంధవ్యములు ఏర్పడతాయి.  ప్రభుత్వ పెద్దల అనుగ్రహము కలుగుతుంది . ధన లాభము కలుగును .

శ్లోకం :   వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి: స్వధర్మకృత్
          చిత్త శుద్ది రాభీష్టార్ధ: నవమస్తే శుక్రః
తోమ్మిదవరాశిలో గోచారములో శుక్రుని సంచారము జరుగుచున్నప్పుడు మంచి వస్త్ర లాభము కలుగును . ఆరోగ్యము బాగుంటుంది . కులాచార సాంప్రదాయములను పాటిస్తారు . గురువులను పూజిస్తారు . అనుకోన్నవన్నీ కలసి వస్తాయి .
శ్లోకం :   వ్యాకులం చైవ నిస్సత్వ మర్ధనాశం రిపోర్భయం
          స్త్రీ సౌఖ్య హానీ మాప్నోతి దశ మస్తే భ్రుగో స్సుతే
దశమ రాశిలో శుక్రుడు సంచారము జేయుచున్నప్పుడు మనసు అంతా కల్లోలముగా ఉంటుంది . శరీరమున నిస్సత్తువ , నీరసము ఆవహిస్తుంది . ధనము నశించును . స్త్రీ ఎడబాటు కలుగును .సౌఖ్యము తక్కువ .

శ్లోకం :   పుష్టకాంతిం తధాకీర్తి మిష్టకార్యార్ధ సాధకం
          క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రస్స్వైకా దశేఫలం
పదకొండవ రాశిలో శుక్రుని సంచారము జరిగేటపుడు పుష్కలమగు కాంతిని కలవారు . ఇష్ట కార్యములు నేరవేర్చుకొంటారు . కీర్తిని పెంచుకొంటారు . ధన లాభము కలుగుతుంది . పాలు పెరుగు తో కూడిన భోజన సౌఖ్యము కలుగుతుంది .

శ్లోకం :   శస్త్రపీడా చోరభాధా చాతిక్లేశో మహాద్భయం
          కృష్యాది సర్వ విఘ్నం స్యాద్ ద్వాదశ స్తానగే భ్రుగౌ
పన్నెండవ రాశిలో గోచార రీత్యా శుక్రుడు ఉన్నప్పుడు ఆయుధములవలన దెబ్బలు తగులును . దొంగతనములు జరుగును . భయముగా ఉంటుంది . కష్టములు ఏర్పడతాయి . అన్ని విధాల ఆటంకములు కలుగుతాయి .    
       
 

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...