2013-07-15

కేంద్రములు – కోణములు

కేంద్రాధిపత్య దోషస్తు బలవాన్ గురు శుక్రయో
అనగా శుభ గ్రహములు అయిన గురు, శుక్ర, బుధ ,చంద్ర గ్రహములు కేంద్రాధిపతులు అయితే పాప ఫలితములను కలుగ జేతురు . పాప గ్రహములు అయిన సూర్య , కుజ, శనిగ్రహములు కోణ అధిపతులు కాకూడదు .

జ్యోతిష్య శాస్త్రమును గురించి కొంచెం కూడా తెలియని వారికి కేంద్ర కోణ అధిపతులను తెలుసు కోవడము ఎలా ? అను సందేహము కలుగుతుంది . చిన్న ఉదాహరణ :

లగ్నం నుండి ప్రారంభించి 1  4 7 10 స్థానములను కలుపుచూ ఒక చతుర్భుజం గీయగా 1 , 4 , 7, 10 స్థానములలో నాలుగు మూలలు  ఏర్పడతాయి . వీటినే  కేంద్రములు అంటారు .
లగ్నము నుండి 1, 5 , 9 స్థానములను కలుపుచూ ఒక త్రిభుజమును గీస్తే 1 , 5 , 9 , స్థానములలో మూడు మూలలు ఏర్పడతాయి . వీటినే కోణములు అంటారు . ఈ విధముగా కేంద్ర కోణములు తెలుసు కోవచ్చు . తరువాత ఆయా స్థానముల అధిపతులను తెలుసు కోవాలి . పైన ఉదాహరించిన కర్కాటక లగ్నమును సూచించాను .

లగ్నాధిపతి కేంద్రమునకు , కోణమునకు కూడా అధిపతి అగును . 4 వ కేంద్రమునకు అధిపతి శుక్రుడు అగును . నైసర్గికము గా శుభుడై కేంద్రమునకు అధిపతి అగుట వలన శుక్రుడు పాప ఫలితములను కలుగ జేయును .
7 వ స్థానమునకు శనిగ్రహము అధిపతి , 10 వ స్థానమునకు కుజుడు అధిపతి . ఈ రెండు గ్రహములు కేంద్రములకు అధిపతులు అగుట వలన కర్కాటక లగ్నములో జన్మంచిన వారికి శుభములను కలుగ జేయుదురు.

తదుపరి కోణ అధిపతులు 5 వ స్థానమునకు కుజుడు 9 వ స్థానమునకు గురుడు అధిపతులు ఇక్కడ కుజుడు కన్నా కోణ ఆధిపత్యము శుభ గ్రహమునకు వచ్చుట వలన గురుడు శుభములను కలుగ జేయ గలడు .

‘’కేంద్ర కోణాధిప సంయోగ మాత్రేణ రాజయోగం నరో భవేత్’’
ఏ లగ్నములో జన్మించిన వారికైనా కేంద్ర కోణ అధిపతులు కలసి ఉంటే రాజయోగము కలుగ చేస్తారని అర్ధము .

ఈ లగ్నములో జన్మంచిన వారికి గురు కుజ గ్రహములు కలసి మీన , మేషములలో ఎక్కడ ఉన్నా రాజయోగము కలుగ చేస్తారు .  

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...