2013-07-24

జన్మ నక్షత్ర ఫలితము _ రోహిణి



రోహిణి నక్షత్రము లో జన్మించిన వారు బంధువుల పట్ల మంచి ఆదరణ కలవారు . ప్రియముగా మాటలాడుతారు . ధనము విషయములో చాలా జాగ్రత్త కలవారు . సౌఖ్యమును అనుభవిస్తారు . తల్లిదండ్రుల పట్ల ప్రేమ , అభిమానములు కలిగి ఉంటారు . అందమైన వారు . శాంతముగా ఉంటారు . ఏ విషయము నందైనా ఆచి తూచి స్పందిస్తారు .

వీరు నెమ్మదిగా నిదానముగా ఆలోచించి నిర్ణయములు తీసుకొంటారు . ఎప్పుడూ ఆనందముగా ఉంటారు . సున్నితమైన మనస్తత్వము కలిగి ఉంటారు . ఇతరుల విషయములలో జోక్యం చేసుకోరు . అనవసరముగా మాట పడరు. కుటుంబము వృద్ధికి పాటు పడతారు .వీరికి దైవము పట్ల నమ్మకము ఎక్కువ . ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువగా పాల్గొంటారు .

తీర్ధ యాత్రలు చేయుదురు . ధర్మముగా వ్యవహరిస్తారు . దాన ధర్మములు చేయుదురు . ఇతరులను ఆకర్షించు కొంటారు . సందర్భమును బట్టి సమయోచితముగా నడచుకొంటారు . పరిస్థితుల ప్రభావమును తట్టుకొనగలరు . వీరు ఆరోగ్య విషయములో ఎక్కువగా భాద పడుతూ ఉంటారు . ఏ మాత్రము నీరసము వచ్చినా ఏదో అయిపోతుంది అని లోలోన కంగారు పడుతుంటారు . దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ భాద పడుతుంటారు . ఎప్పుడూ ఆరోగ్యముగా ఉండాలని కోరుకుంటారు .

ఎప్పుడూ ఏదో చదువుతూ ఉంటారు . భోగ భాగ్యములను అనుభవిస్తారు . కుటుంబ సభ్యులు, భార్య , పిల్లలు , ఎవరికీ ఏ కష్టము వచ్చినా తట్టుకోలేరు .. అందరూ సంతోషముగా ఆనందముగా ఉండాలని అనుకొంటారు . ఆర్ధిక విషయములలో చాలా జాగ్రత్త కలవారు . ప్రతి పనిని ప్రణాలికా బద్దంగా నిర్వహిస్తారు . మానసికముగా దృడముగా ఉంటారు . మనో ధైర్యము ఎక్కువ . జాలి , దయ కలవారు . కష్టములలో ఉన్న వారిని ఆదుకొంటారు .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...