2013-07-14

వాహన యోగము .

వాహన యోగమును గురించి  తెలుసు కోవాలంటే జన్మ లగ్నము నుండి నాలగవ స్థానమును ,నాల్గవ స్థానాధిపతి అయిన గ్రహమును, వాహన కారకుడైన శుక్రుని పరిశీలించ వలసి ఉంటుంది .నాల్గవ స్థానాధిపతి ఆధిపత్య శుభుడు అయి, లాభ స్థానమున ఉండిన వారికి తప్పక వాహన యోగము కలుగుతుంది .

శుక్ర గ్రహము అనుకూలముగా ఉండాలి . శుక్రుడు మంచి స్థానములో ఉండి అంటే స్వక్షేత్రము లో గానీ ఉచ్చ స్థానములో గానీ ఉండి నట్లైతే మంచి వాహనము ( ఫోర్ వీలర్ ) ప్రాప్తించును . అట్లు లేకున్న టూ వీలర్ యోగము ప్రాప్త మగును .

చతుర్ధ స్థానము నందు నైసర్గిక పాప గ్రహము శని ఉన్నా , వాహానాధిపతి , శుక్ర గ్రహముల మధ్య శని దృష్టి ఉన్నా సెకండ్ హ్యాండ్ వాహనము సంప్రాప్తమగును . పన్నెండవ స్థానాధిపతి అయిన గ్రహ సంభందము ఏర్పడితే ఎక్కువగా రిపేర్లు వచ్చు చుండును . నష్టము వాటిల్లును .

ఆరవ స్థానము యొక్క అధిపతి అయిన గ్రహము అవరోధములను , యాక్సిడెంటు లను కలుగచేస్తుంది .నాలుగు ఆరు స్థాన అధిపతులైన గ్రహములు పరస్పరము సంభందము పొందినచో వాహన ప్రమాదములు జరుగును .నాల్గవస్థాన అధిపతి అయిన గ్రహము ఆరవ స్థానములో ఉన్నప్పుడు అప్పు చేసి వాహనము కొంటారు . అప్పును తీర్చ లేరు .  

వాహన అధిపతి 6  8 12 స్థానములలో ఉన్న జాతకులు ప్రయాణములలో జాగ్రత్త వహించుట మంచిది . అనుకోని ప్రమాదములు ఏర్పడతాయి .వాహన స్థానాధిపతి రెండవ ఇంటనున్న జాతకులకు వాహనముల  మూలకముగా ధన యోగము కలుగును .

నాల్గవ అధిపతి పదకొండవ స్థానములకు సంభందించిన గ్రహములకు , దశమ స్థానమునకు సంభందించిన గ్రహమునకు సంభందము ఉన్నచో వాహనములకు సంభందించిన వ్యాపారములు చేస్తారు . వీరికి అన్ని విధములా కలసి వస్తుంది . పెద్ద పెద్ద షో రూమ్స్ నడుపుతారు . పన్నెండవ స్థానము { వ్యయ భావము } నకు సంభందించిన గ్రహము తో పరస్పర సంభందము ఏర్పడితే వ్యాపార రంగములో నష్టపోయి మధ్యలో వ్యాపారము మానేస్తారు .  

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...