2013-08-26

పంచభూతములు - అవినాభావ సంబంధం

ఇంతకుముందు మనము పంచభూతాలు గురించి తెలుసుకొన్నాము. ఈ పంచభూతములన్నియు ఒకదానికి ఒకటి అవినాభావ సంభంధమున్నది. ఏలననగా
1.       అగ్ని జలం .  అగ్ని స్వరూపము అధికమగుట వలన నీరు ఆవిరిగా మారును
2.       జలం - వాయువు ఆవిరిగా మారిన జలము  వాయు రూపములో చేరును.
3.       వాయు ఆకాశము. వాయు రూపమునుండి ఆకాశ తత్వమునకు మారును
4.       ఆకాశము జలము . ఆకాశతత్వములో మేఘముగామారి తిరిగి జలతత్వమునకు మారుచున్నది.  
5.       జలము భూమి . జలతత్వముగా మారి తిరిగి భూమికి చేరుచున్నది. ఈ ప్రక్రియ జరుగుటకుమూలము అగ్ని దీనికి ఆధారభూతుడు సూర్యుడు . అందుచేతనే విశ్వం అనే రాజ్యమంతటిని పరిపాలించే సూర్యగ్రహమును రాజుగా అభివర్ణించినారు. .
6.       నీటి ప్రభావముచే అగ్ని ఆర్పివేయబడుచున్నది. బూడిదగా మారి భూతత్వములో కలియుచున్నది.
7.       అగ్ని స్వరూపము అధికమైనప్పుడు వాయువు తోడైతే అగ్ని ప్రళయమును సృష్టించును.
8.       అగ్నిస్వరూపము తక్కువైనప్పుడు అదే వాయువు అగ్నిని అర్పివేయును.
9.       ఈవిధంగా పంచభూతములన్నియు ఒకదానికొకటి అవినాభావ సంభందము కలిగి యున్నవి.      

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...