2013-09-14

నీలము (blue)

నీలం ఆయుష్కారకుడు శని గ్రహ ప్రతి రూపము నీలము.
నీలము నాలుగు రకములుగా లభ్యమగు చున్నది.
ఇంద్ర నీలం 2. మహా నీలం ౩. మయూర నీలం 4. నీల మణి
ఇంద్ర నీలం తల వెంట్రుకను పోలిన నల్లని రంగు లో ఉండును . దీనిని ధరించిన వారు రాజ సమాన భోగములను అనుభ వింతురు

మహా నీలము 75 శాతం నీలము రంగు కలిగి తేజస్సు తో ప్రకాశము కలిగి యుండును . దీనిని ధరిం చుట వలన ఆయుర్వుద్ది కలిగి శరీరము లోని నరముల నిస్సత్తువ,  వాత సంబంధ వ్యాధులు నయమగును. మంచి ఆరోగ్యము కలుగును 

మయూర నీలము నెమలి కంఠం రంగులో ఉండుట వలన దీనికి ఆ పేరు వచ్చినది . దీనిని ధరించుట వలన జడత్వ బుద్ది నశించును ఉత్సాహము కలుగును

నీలం ను భూమి పై పెట్టి నపుడు కొంచెం  పచ్చ రంగు మాదిరి కనపడును . ఇది దొరకుట  అరుదు .
ఇదియే నీలమణి .

నీలమును ధరించుట వలన శని గ్రహము వలన కలిగే దోషములు పోవుటయే కాక సకల సంపదలు సిద్ధించును .
శ్రేష్ట మైన నీలమును ఆవు పాలలో ఉంచి నపుడు పాలు నీల వర్ణము గా కనపడును .దీనినే క్షీర గ్రాహి అని అంటారు .
వరి ఊక గానీ , తవుడు గానీ , గసగసాల పొట్టు గానీ తీసుకొని మధ్యలో మంచి నీలమును ఉంచిన ఆయస్కాంతము వలె ఆకర్షించును . దీనిని తృణగ్రాహి అంటారు . ఇట్టి రత్నము ఉత్తమ మైనది .

సంఖ్యా శాస్త్రములో శని గ్రహ సంఖ్య 8

8, 17, 26, తేదీలలో పుట్టిన వారు పుష్యమి , అనూరాధ , రేవతి నక్షత్రములలోనూ , మకర రాశి , కుంభ రాశి లోనూ , మకర , కుంభ లగ్నముల లోనూ పుట్టిన వారు నీలమును ధరించుట వలన కష్టములు తొలగి సుఖములు అనుభ వించెదరు  

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...