2013-09-05

గ్రహములు -వృత్తులు



ఏ గ్రహముల వలన ఏ ఏ వృత్తులను ప్రసాదిస్తాయి .

సూర్యుడు : రాజ్యాధికారము , పరిపాలనా విభాగాములకు అధికారి , ఆఫీస్ మేనేజ్ మెంట్ , అధ్యక్ష పదవులు,  ధార్మిక సంస్థలు , సంఘములకు గౌరవ అధ్యక్షులు  మొదలగు అనేక విధముల యజమాని హోదా పొందగలరు. చట్ట సభలలో అధికారము, శాసన నిర్మాణ కర్తలు , ప్రజా పరిపాలకులు . ఆర్డర్స్ జారీ చేయు అధికారము , హోదా , గౌరవము కలిగిన వృత్తులను ప్రసాదించును .

చంద్రుడు : నీటికి సంబంధించిన శాఖలు , ద్రవ పదార్దములకు సంబంధించినవి . తెలుపు వర్ణమునకు చెందినవి .
అనగా కూల్ డ్రింక్స్ , పాలు , పాల ఉత్పత్తులు , పంచదార , బియ్యము వ్యాపారములు , రైస్ మిల్స్ , హోటల్స్ , టిఫిన్ సెంటర్స్ , మిల్క్ పార్లర్స్ , వస్త్ర వ్యాపారములు , వాటర్ ప్లాంట్స్ ,  నీరు , చేపల ఉత్పత్తులు , బావులు త్రవ్వడం , బోరింగ్స్ , సముద్రపు ఉత్పత్తులు , జలాంత ర్గామి, నావికా దళ ఉద్యోగములు , దూది వ్యాపారము , దూది ఉత్పత్తులు, పుడ్ ప్రొడక్ట్స్ , వెండి వస్తువులు తయారీ  మొదలగు వృత్తులను ప్రసాదించును .
‘’ ఇక్కడ మనం ఒక విషయమును గ్రహించాలి . గ్రహములు అన్నింటిలో చంద్రుడు గమనము చాలా వేగంగా ఉంటుంది . అందువలన తొందరగా పాడయ్యే వస్తువులు ఆహార పదార్దములు ఈ గ్రహమునకు సంబంధించినవే .

కుజుడు : వ్యవసాయము , వ్యవసాయ ఉత్పత్తులు , మాంసపు ఉత్పత్తులు , కోళ్ల పరిశ్రమలు , యంత్రములు, పనిముట్లు తయారీ , వడ్రంగి పనులు , భవన నిర్మాణములు , కనస్ట్రక్షన్స్ , కాంట్రాక్టులు , బిల్డింగ్ మెటీరియల్ , విద్యుత్తు శక్తి  శాఖలు , విద్యుత్ ప్లాంట్స్ , మిలటరీ , పోలీస్ తదితర రక్షణ శాఖలు , సైన్యమునకు సంబంధించిన ఉద్యోగాలు , మోటార్స్ , మెకానికల్ , భూ పరిశోధన, అటవీ ఉత్పత్తులు , అటవీ శాఖ కు చెందిన ఉద్యోగాలు ఇలాంటి వృత్తులు కుజుడు ఆధీనము లో ఉంటాయి .

బుధుడు : బ్రోకర్స్ , బ్యాంకులు , పైనాన్సియల్ సెక్షన్స్ , చిట్ ఫండ్ వ్యాపారములు , ట్రెజరీ డిపార్టమెంట్లు , బడ్జెట్ తయారీ చేయువారు , పత్రికలు , పత్రికా సంపాదకులు , ముద్రణా రంగములు , పుస్తక పరిశ్రమలు , రచయితలు  చార్టెడ్ ఎకౌంట్స్ , విలేఖర్లు ,జర్నలిజం , గుమస్తా ఉద్యోగాలు ,సాప్ట్ వేర్ , కంప్యూటర్ , టెక్నాలజీ సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు పచ్చళ్ళు పరిశ్రమలు , , ,  ,   

గురుడు : విద్యా సంస్థలు , ఉపాధ్యాయులు, లెక్చరర్స్ , భోధనా సంబంధ ఉద్యోగములు , పురోహితులు , పూజార్లు , పూజ గది , పూజా ద్రవ్యములు , దేవాలయ సిబ్బంది , దేవాదాయ శాఖలలో ఉద్యోగాలు , పరిశోధనా రంగములు , విశ్లేషకులు , మత ప్రచారకులు , మేధావి వర్గమునకు చెందినవారు . సంస్కృతి , సంప్రదాయములను వివరించు స్వామీజీలు వీరందరూ గురుడు కు సంబంధించిన వారు . గురుడు ఆకాశ తత్వమునకు చెందిన వాడు కాబట్టి విమానయాన రంగములు , శాటిలైట్ లు మొదలగునవి .

శుక్రుడు : ఆభరణ తయారీలు , ఆర్నమెంట్ నగల వ్యాపారము , బంగారు వ్యాపారము , అలంకరణ సామాగ్రి , ఇంటీరియర్ డిజైనింగ్ , ఫాన్సీ దుకాణాలు , మసాజ్ సెంటర్స్ , రెడీమేడ్ వస్త్రములు , వస్తువులు , స్త్రీలకు సంబంధించిన వస్తువులు , సుగంధ ద్రవ్యములు , అగరబత్తీ పరిశ్రమలు, నూతన వస్తువులు, కళలు , సినిమా రంగము , కళాకారులు , ఎలక్టానిక్ మీడియా , గాయకులు , సంగీత సాహిత్య రంగములు ,  

శనిగ్రహము : రాజకీయ నాయకులు , నామినేటెడ్ పోస్టులు పొందేవారు . న్యాయవాదులు , జడ్జీలు , న్యాయశాఖకు సంబంధించి ఉద్యోగులు , గాలికి సంబంధించిన రంగములు అనగా టెలీ ఫోన్ , కమ్యునికేషన్ , బట్వాడా కార్మికులు , తపాలా శాఖ , సేవకులు , కూలీలు , వ్యవసాయ కార్మికులు , కష్టముచే జీవించువారు , ఇనుము , ఉక్కు పరిశ్రమలు , ఇనుము ఉత్పత్తులు , బొగ్గు సంబంధిత శాఖలలో పనిచేయువారు , బరువులు మోయువారు , ఇన్సూరెన్స్ సంబందిత రంగములలో పని చేయువారు, సంచార జీవులు, నూనె కర్మాగారములు , పెట్రోల్ , డీసెల్ , గ్యాస్ సంబంధిత పరిశ్రమలలో ఉద్యోగ, వ్యాపారములు , సెకండ్ హ్యాండిల్ వస్తువుల వ్యాపారము మొదలగు వృత్తులు శనిగ్రహము వలన కలుగును . కంప్యూటర్ హార్డ్ వేర్ , అసెంబ్లింగ్ యూనిట్స్  మొదలగునవి .

రాహువు : ఈ గ్రహ ప్రభావము వలన  డాక్టర్స్ , మత్తు పానీయముల వ్యాపారము చేయువారు , మందుల దుకాణములు, కెమికల్ ఇండస్ట్రీస్ , రసాయన శాస్త్రవేత్తలు , చెత్త వ్యాపారము ఈ గ్రహమునకు సంబంధించిన వారు .
కేతువు : చర్మపు ఉత్పత్తులు , జోళ్ళు , రబ్బరు పరిశ్రమలు , రబ్బరు ఉత్పత్తులు మొదలగు వృత్తులను కలిగించును .   

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...