2013-08-31

గ్రహములు- జాతులు 4



నవ గ్రహము లలో సూర్యుడు అత్యంత శక్తి కలిగిన గ్రహము . ఈ గ్రహము యొక్క ప్రభావము చేతనే మానవుడు సమాజము లో రాజ్య అధికారము లను పొందును . ఇంతకుముందు మనము గ్రహముల యొక్క జాతులను గురించి తెలుసుకొన్నాం . అయితే ఈ జాతులు ( కులములు ) ఇప్పుడు మన సమాజములో ఉన్న కులములు కాదని గ్రహించాలి.

ఎందుకంటే మొత్తం మానవ సమాజమును ఐదు వర్గములు గా విభజించారు . ప్రతి మనిషి జీవించుట కొరకు ఏదో ఒక వృత్తిని చేపట్టాలి . అయితే మనిషి చేపట్టబోయే వృత్తిని అనుసరించి జాతులుగా విభజించారు . గ్రహ శాస్త్రమున చెప్పిన జాతులు ఈ విధముగా ఉన్నాయి .

ప్రభుత్వము ను పరిపాలించు వారిని పాలకులు లేక క్షత్రియులు అని , సమాజమున ప్రజలకు మేలు కలిగించే విధంగా సలహాలు , సూచనలు ,అందిస్తూ సమ సమాజ నిర్మాణము కొరకు పాటు పడేవారిని బ్రాహ్మణులు అని,
వ్యాపారము వృత్తి గా చేపట్టు వారిని వైశ్యులు అని , శ్రామిక వర్గము నకు చెందిన వారిని శూద్రులు అని , అధర్మ బద్దముగా వ్యవహరించు వారిని మ్లేచ్చులు అని ఈ విధంగా ఐదు రకములుగా విభజించారు .

మానవులు అందరూ ఒకేలా పుడతారు . కానీ పెరిగి పెద్దవారు అయిన తరువాత ఒక్కొక్కరికి ఒక్కో విధమైన మనస్తత్వము , బుద్ది , ఆలోచనలు ఉంటాయి . బ్రతుకుదెరువు కూడా ఒక్కొక్కరికి ఒక్కోవిధముగా ఉంటుంది .
‘’ కొందరికి వద్దంటే డబ్బు . మరి కొందరికేమో ఆకలి జబ్బు ‘’  ఇది సామెత మాత్రమే కాదు యుగ యుగాల నుండి మానవులలో అంతరము కనబడుచునే ఉన్నది. దీనికి కారణము మహర్షులు ఇలా చెప్పారు .
మానవుడు జన్మాంతర కృత పాప పుణ్య ఫలములచే తను అనుభవిస్తాడు ..

ఈ సమాజమున ఈ జన్మలో మనిషి పొందు హోదా , గౌరవము , అధికారము సూర్యుడు యొక్క బలముపై ఆధారపడి ఉండును . ఎవరి జాతకము లో సూర్యుడు బలవంతుడు అయి ఉంటాడో అతడు లేక ఆమె గొప్ప అధికారములను పొందును అని శాస్త్రముల ద్వారా మనకు తెలియు చున్నది .

ఇట్టి అధికారములు కూడా కొందరికి సునాయాసముగా లభించును . కొందరికి ఎంతో కష్టపడితే గానీ రావు . కొందరు అవకాశములు వచ్చిననూ చేజార్చు కొంటారు . మరికొందరికి వారసత్వముగా వచ్చు చున్నవి . వీటన్నిటికి గ్రహము ల బలములే ఆధారము . సూర్యుడు బలము కలిగి ఉన్నా నైసర్గిక పాపగ్రముల ప్రభావమునకు లోనైతే అవకాశములు వచ్చినట్లే వచ్చి తృటిలో తప్పి పోతాయి .     

జ్యోతిష్యశాస్త్రము - పరిశోధన


గ్రహములకు వర్ణించిన రంగులన్ని  సూర్య కాంతిలో ఐక్యమై యున్నవి. వీటిని మనము ఆకాశములో అప్పుడప్పుడు కనపడే ఇంద్రధనుస్సులో చూడగలుగు చున్నాము.  సైన్స్ ప్రకారము సూర్యుని చుట్టూ గ్రహములన్నియు తిరుగుచున్నట్లు మన సైంటిస్టులు నిరుపించినారు. ఈ పద్దతి ప్రకారము విశ్వమంతటికీ సూర్యుడే ఆధారము.

భూమి స్తిరంగా ఉన్నదని అనుకొని మిగతా గ్రహములు నక్షత్రములు అన్నియు వాటి వాటి కక్ష్యలలో తిరుగుచున్నాయని అనుకొన్నప్పుడు విశ్వమంతటిని 27 నక్షత్రములు గావిభజించినారు.
కాని ఈ విశ్వములో అనంతమైన గ్రహములు నక్షత్రములను మనము చూడగలుగు చున్నాము. మరియు అనేక రకములుగా ఈ సృష్టిరహస్యం పై పరిశోధనలు జరుపుచునే యున్నాము.
.
భూమి చుట్టురా  గ్రహములన్నియు తిరుగు చున్నవని జ్యోతిష్యశాస్త్రవేత్తలు  తెలిపియున్నారు. భూమి చుట్టూ చంద్రుడు మాత్రమె తిరుగు చున్నాడని భూమితో పాటు మిగతా గ్రహములన్నియు సూర్యునిచుట్టే తిరుగుచున్నవని విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపియున్నారు.

*భూమి తన చుట్టూ తాను తిరుగుటవలన పగలు రాత్రి ఏర్పడు చున్నవి.  చంద్రుడు భూమిచుట్టూ తిరుగుట వలన అమావాస్య పౌర్ణమి ఏర్పడుచున్నవి. ఈరెండు విషయములలో విజ్ఞానశాస్త్రవేత్తలకు, జ్యోతిష్యశాస్త్రవేత్తలకు పోలికయున్నది. *

గ్రహములన్నియు తమతమ కక్ష్యలలో సూర్యునిచుట్టూ { రాశి చక్రము చుట్టూ} తిరుగు చున్నవని మనకు తెలియును .కానీ ఆయా గ్రహములయొక్క  వేగము వివిధరకములుగాయున్నది
చంద్రుడు భూమిని చుట్టి వచ్చుటకు సుమారు 28 రోజులు భూమితో పాటు సూర్యుని చుట్టి వచ్చుటకు ఒక సంవత్సరం.
సూర్యుడు ఒక సంవత్సరము  { 1. ఇక్కడ జ్యోతిష్యశాస్త్రజ్ఞులు చెప్పిన విధముగా 2 .  విజ్ఞాన శాస్త్రజ్ఞులు చెప్పిన విధముగా భూమి సూర్యుని చుట్టి వచ్చుటకు )  
కుజుడు ఒక సంవత్సరం ఆరునెలలు
బుధుడు సుమారు ఒక సంవత్సరము
శుక్రుడు సుమారు ఒక సంవత్సరము
గురుడు పన్నెండు సంవత్సరములు
శని ముప్పై సంవత్సరములు.
రాహు , కేతు గ్రహములు పద్దెనిమిది సంవత్సరములు

2013-08-30

గ్రహములు - జాతులు 3



జాతకము లో సూర్యుడు , బుధుడు ఈ రెండు గ్రహముల మధ్య మంచి సంబంధము ఏర్పడి పదవ స్థాన అధిపతి కూడా మంచి స్థితి కలిగి ఉన్నవారు వ్యాపారములో సమర్ధులు కాగలరు . డబ్బు సంపాదించుట లో నేర్పరులై ఉందురు . సమయస్పూర్తి కలవారు . మేధావులు . ఆడాయమును , ఖర్చులను బేరీజు వేసుకొంటారు .

వీరు ఆర్ధిక వ్యవహారములు నడుపుట యందు చాలా తెలివిగా ఉంటారు . ఈ కాంబినేషన్ ఉన్నవారు పెద్ద ఆర్ధిక సంస్థలలో ఉన్నత పదవులను పొందుతారు . మనీ మార్కెట్ , ట్రేడింగ్ సంబంధిత రంగములలో , షేర్ మార్కెట్ , బ్యాంకులు మొదలగు వాటిలో స్థిరపడతారు .

ప్రతి విషయమును వ్యాపార దృష్టితో చూస్తారు. ట్రెజరీ విభాగములు , ఆర్ధిక మంత్రులు , చిట్ ఫండ్స్ , పోస్టల్ ఏజంట్లు , మార్కెటింగ్ శాఖలు , రియల్ ఎస్టేట్ బ్రోకర్లు , ఎస్టిమేటర్స్ , మొదలగు వృత్తులను చేపట్టు వారు అందరూ ఈ గ్రహముల ఆధిపత్యము వారే . ఈ గ్రహముల ఆధిపత్యము , బలముల ప్రభావము ఎక్కువగా ఉన్నవారు . ఉన్నత స్థితులను , గ్రహ బలము లేనివారు సాధారణ స్థాయి కలిగిన జీవనమును పొందుతారు .

సూర్యుడు గురుడు . ఈ కాంబినేషన్ లో కర్మ భావ అధిపతి సంబంధము కలిగి ఉన్న జాతకులు ఆధ్యాత్మిక , సంస్థలలో , దేవాలయాలలో, ఉన్నత పదవులను పొందుతారు . ఆచార సంప్రదాయముల పట్ల ప్రగాఢ నమ్మకము కలిగి ఉంటారు . సమాజము లో గౌరవ మర్యాదలు పొందుటయే కాక వీరు ప్రత్యేకత కలిగి ఉంటారు.
దేవాదాయ , ధర్మాదాయ శాఖలలో, విద్యా సంస్థలలో ఉన్నత ఉద్యోగము కలవారు . ప్రచార కార్యకర్తలు ,

ప్రసంగము చేయు వృత్తులలో అనగా న్యూస్ రీడర్స్ , వార్తా పత్రికలు , జర్నలిస్టులు , మొదలగు సమాచార శాఖల యందు గొప్ప అధికారములను చేపట్ట గలరు . వీరు పదిమందికి ఆదర్శము గా ఉంటారు .ఈ కాంబినేషన్ బలముగా ఉన్నవారు మాట వలన బ్రతుకు జీవనము కలిగి ఉందురు . అనగా ఉపాధ్యాయులు , లెక్చరర్స్ , మొదలగు వృత్తులలో విశేషముగా రాణించగలరు . పెద్ద పెద్ద విద్యా సంస్థలను స్థాపించడం . విద్యకొరకు ఎక్కువగా కృషి చేయడం , జ్ఞాన భోధ చేయడం లాంటి అనేక విషయములలో ముందుంటారు .

చరిత్ర సృష్టించ గలరు . మత ప్రచార కర్తలుగా రాణిస్తారు . వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది . భారీ సంస్థలలో సలహాదారులుగా అధికారములను పొందగలరు . న్యాయ బద్దంగా నడుచుకొంటారు . ప్రభుత్వ సంబంధ శాఖలలో నామినేట్ చేయబడతారు . గొప్ప గొప్ప సన్మానములను, బిరుదులు పొందుతారు .

ఈ గ్రహముల స్థితి ఉత్తమము గా ఉన్నవారు . డబ్బు కు ఎక్కువ విలువ ఇవ్వరు . సంఘ సంస్కర్తలు కాగలరు . తాము బ్రతుకుచూ ఇతరులకు బ్రతుకు చూపించ గల మేధాశక్తి వీరి సొంతము. గ్రహము బలము తక్కువగా ఉన్నవారు పైన తెలిపిన సంస్థలలో సాధారణ ఉద్యోగమును పొందుట గానీ సాధారణ జీవితము గడుపుట గానీ కలుగును . వీరి జీవితము మొత్తం మీద ఎప్పుడూ హుందాగా . గౌరవముగా సాగుతుంది .    

2013-08-29

అక్షరాభ్యాసము



విద్యావంతుడు అనగా జ్ఞానము కలవాడు . మంచి విద్యావంతుడైన మానవుడు సమాజములో గానీ లేక దేశములో గానీ గొప్ప గౌరవ మర్యాదలు పొందుచూ ఉన్నతమైన జీవితమును గడుపును .

అన్ని ధనముల కన్నా విద్యా ధనము గొప్పది . విద్య అనునది అనన్య మైనది . అంతులేనిది . మానవుని జీవితమునకు దిశానిర్దేశము చేసేది విద్య. విద్య వెలకట్టలేని తరగని సంపద వంటిది . అట్టి ‘’విద్య లేనివాడు వింత పశువు’’ అని పెద్దలు చెప్పినారు . 

విద్యారంభమునకు మూలము అక్షర స్వీకారము ( అక్షరాభ్యాసం ) గ్రహాలలో బుధ గురు శుక్ర గ్రహములు శుభ గ్రహములు . మరియు బృహస్పతి దేవతలకు గురువని, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువని మన పురాణాలు ద్వారా తెలియుచున్నది . గురుడు  జ్ఞానమునకు కారకుడని గురు బలము బాగున్న విద్యార్ధులు ఏక సంధాగ్రాహులు అవుతారని జ్యోతిష్య శాస్త్రము ద్వారా తెలియు చున్నది .   

అక్షరాభ్యాసము ౩ లేక 5 వ సంవత్సరములలో జరిపించ వలెను హస్త , పునర్వసు , స్వాతి , అనూరాధ , రేవతి , అశ్విని , చిత్త , శ్రవణం నక్షత్రములలో , సోమ , బుధ , గురు , శుక్ర వారముల యందు తదియ , పంచమి , సప్తమి , దశమి , ఏకాదశి , ద్వాదశి , త్రయోదశి   తిధులలో శుభ గ్రహ లగ్నముల యందు 4 8 9 భావములు శుద్ది కలిగిన జరిపించాలి .

గురు మూడమి, శుక్ర మూడమి ఉన్న కాలములలో అక్షరాభ్యాసం చేయించ కూడదు .
శ్రీ పంచమి( వసంత పంచమి , మాఘ పంచమి ) , విజయ దశమి తిధుల యందు అక్షరాభ్యాసము చేయించ వచ్చును .ఉత్తరాయణములో మాఘ , పాల్గుణ , వైశాఖ మాసములలో  అక్షరాభ్యాసము చేయించుట ప్రశస్తమని చెప్పితిరి కానీ దక్షిణాయనము శ్రావణ , ఆశ్వీయుజ , కార్తీక మార్గశిర మాసములలో కూడా చేయించ వచ్చును .    

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...