2013-10-31

కేశ ఖండన

పుట్టిన పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడమే కేశ ఖండన
 ఈ కార్య క్రమాలను ఎప్పుడు చెయ్యాలి .
పుట్టిన పిల్లలకు కేశఖండన చేయుటకు ఈ దిగువ తెలిపిన విధంగా చెయ్యాలి .
విదియ , తదియ , పంచమి , సప్తమి , దశమి , ఏకాదశీ , త్రయోదశి , తిధుల యందును అశ్విని , రోహిణి , మృగశిర , పునర్వసు, పుష్యమి , ఉత్తర ఫల్గుని , హస్త చితత, అనూరాధ , ఉత్తరాషాడ , శ్రవణం, శతభిషం , ఉత్తరాభాద్ర , రేవతి నక్షత్రముల యందును ,
సోమ , బుధ , గురు , శుక్ర వారముల యందును ,
శుభ గ్రహ లగ్నములలోనూ , లగ్న శుద్ది , అష్టమ శుద్ది కలిగిన దినముల యందును సూర్యోదయము తర్వాత నుండి మధ్యాహ్నము లోపల జరిపించాలి

స్త్రీ శిశువులకు బేసి నెలలయందు , మగ శిశువులకు సరి నెలల లోనూ జరిపించాలి . సంవత్సరము దాటి పోయినచో మూడవ సంవత్సరములో  జరిపించాలి .


దీనిలో ప్రాంతీయ ఆచారములు , కులాచారములు కూడా ఉన్నవి . అయితే వారి వారి ఆచారములను బట్టి కొంత మంది దేవాలయములలోనూ , కొంతమంది ఇంటి వద్దనే ఈ కార్య క్రమములను జరిపించు చున్నారు . ఎవరు ఎలా జరిపించిననూ  పైన తెలిపిన విషయములను పాటిస్తూ మంచి శుభ ముహూర్తమును నిర్ణయించుకొని శాస్త్రాచారము ప్రకారము జరిపించు కొనవలెను .

గ్రహములు – వర్ణన

ఈనాడు ప్రపంచములో వివిధ దేశముల మధ్య ఉన్న సమాచార వ్యవస్థ మరియు రవాణా వ్యవస్థలు లేని కాలంలో జ్యోతిష్య శాస్త్ర పరిశోధన భారతదేశములో జరిగిఉండవచ్చు .

ఎందుచేత అని మనం ప్రశ్నించుకొంటే గ్రహములకు మరియు రాశులకు  చెప్పిన వర్ణన అంతా భారతీయ ధర్మములలోని హిందూ ధర్మమునకు చెందినవే అయి ఉన్నవి.   సూర్యునితో సహా నవగ్రహములను దైవాంశచే ఏర్పడినవని గ్రహములు దైవ స్వరూపమని. చెప్పితిరి. మరియు గ్రహ సంజ్ఞలను గ్రహ గుణములను గ్రహములకున్న నైసర్గిక మిత్రులు , శత్రువులు , సములు అని అనేకరకములుగా గ్రహ వర్ణన గురించి తెలపడం జరిగినది.

సకల జగత్తుకు ఆధారభూతుడైన సూర్యుని ఈశ్వర స్వరూపమని
చంద్రుని  జగన్మాతయగు  పార్వతీ మాత స్వరూపమని
కుజుని సుబ్రహ్మణ్యస్వామీ  స్వరూపమని
బుధ , గురులు  విష్ణు స్వరూపమని
శుక్రుని శ్రీ మహలక్ష్మి స్వరూపమని
శని  శనీశ్వర స్వరూపమని
రాహువు  దుర్గా స్వరూపమనియు
కేతువు విఘ్ననాయకుడైన వినాయక స్వరూపమనియు
ఆయా దేవతలు ఆయా గ్రహములకు అధిదేవతలని చెప్పితిరి.

మరియు
గురు శుక్రులు బ్రాహ్మనులనియు
రవి కుజులు   క్షత్రియులనియు
చంద్ర బుధులు  వైశ్యులనియు
శని శూద్రులు అని గ్రహ వర్ణన చేసినారు
ఇక్కడ గమనించవలసిన విషయము మన భారత దేశములో ఉన్న వ్యవస్థలను బట్టి పై విధంగా వర్ణించియుండవచ్చు. 

అయితే ప్రస్తుత సమాజమును బట్టి మనం దీనిని విశదీకరిస్తే
గురు శుక్రులు బ్రాహ్మనులనియు {అనగా మేధావులు లేక జ్ఞానులు }
రవి కుజులు   క్షత్రియులనియు  { అనగా రాజసము కలిగిన వారు , ప్రభుత్వ పాలకులు }
చంద్ర బుధులు  వైశ్యులనియు  { అనగా వర్తకము తెలిసిన వారు , వ్యాపారస్తులు }
శని  శూద్రులు  అని { అనగా సేవకా వృత్తి వలన జీవించువారు లేక పనివారు } అని  అర్ధము కలుగుచున్నది..

2013-10-26

ఆలోచనపై గ్రహముల ప్రభావము

చంద్ర కుజ గ్రహముల ప్రభావమును గురుంచి ఇంతకూ ముందు శీర్షికలో కొంత తెలుసు కొన్నాము . అయితే ఈ రెండు గ్రహములు విరుద్ధ  స్వభావము కలిగినవి . ఒకటి జల తత్వము కలిగినది . మరొకటి అగ్నితత్వము కలిగినది . ఈ రెండింటి ప్రభావము సమానముగా ఉన్నప్పుడు జీవితమూ ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగి పోతుంది . మరి ఒక గ్రహము యొక్క బలము ఎక్కువగా మరొక గ్రహము యొక్క బలము తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితములు కలుగుతాయి అనే విషయమును కూడా ఇంతకూ ముందర శీర్షికలలో కొంత వరకు తెలుసుకొన్నాము . అది ఎలాగంటే  ఈ గ్రహముల  ప్రభావముచే మానవుడు అందలము ఎక్కుటయో  లేక అధః పాతాళానికి చేరుట యో జరుగు చున్నది . 

అదెలాగో చూద్దాం . ఈ రెండు గ్రహముల ప్రభావము వలన మానవుని మెదడులో నిత్యమూ సంఘర్షణ జరుగును .

ఈ రెండింటికి ఒక గ్రహము (చంద్రుడు )మరియొక (కుజుడు ) గ్రహము యొక్క స్వరూపమును మార్చివేయగల  శక్తి సంపన్నులు .
చిన్న ఉదాహరణ  ఒక లీటరు నీటిని తీసుకొని అధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేస్తూ ఉంటే  అది తన సహజమైన స్వరూపమును కోల్పోయి వాయురూపములోకి  మారుతుంది . పాత్రలో ఉన్న నీటిని కోల్పోవడం జరుగుతుంది .

అదే విధముగా కొంత అగ్నిలో ఎక్కువ వాటర్ ని వేసి నపుడు అది బూడిదగా మారుతుంది . భూతత్వములోకి మారుతుంది . దీనివలన మనకు అర్ధమయ్యే విషయము ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటె ఒక గ్రహము యొక్క ప్రభావము మిగతా గ్రహముల వలన కలిగే శుభ అశుభములను తారు మారు చెయ్యగల శక్తిని కలిగి ఉంటుంది .

మనిషి తన మెదడులో కలిగి ఒక చిన్న ఆలోచనతో తన జీవితమును బ్రహ్మాండముగా తయారు చేసుకోలడు . అదే ఆలోచన భిన్నముగా ఉంటే కోలుకోలేని స్థితికి దిగజార గలడు .  మానవుని మెదడులో కలిగే ప్రతి ఆలోచనపైనా చంద్ర , కుజ గ్రహముల ప్రభావము ఉంటుంది .
అందుకే జాతకమును పరిశీలించేటప్పుడు  ఆ జాతకములో  ఒకే చోట చేరిన గ్రహములు ఏమైనా ఉన్నాయా ?  ఉంటే వాటివలన కలిగే ప్రభావము జాతకుని జీవితముపై ఎలా ఉంటుంది అనీ విషయములను పరిశీలించాల్సిన అవసరము ఉన్నది .

జాతకమునండు  ద్వి గ్రహ కూటమి , త్రి గ్రహ కూటమి , చాతుర్గ్రహ కూటమి , పంచ గ్రహ కూటమి , షష్ఠ గ్రహ కూటమి , సప్త గ్రహ కూటమి , అష్ట గ్రహ కూటమి మొదలగు అన్ని విషయములను క్షుణముగా చూడవలసిన  అవసరము ఎంతైనా ఉన్నది .   


ఈ విషయములను గురించి తెలుసు కొనుటకే  గ్రహములకు గతులను , అవస్థలను , మొదలగు విషయములను మహర్షులు ఏర్పాటు చేసి ఉన్నారు .  

గ్రహములు- మానవ సంభంధాలు

గ్రహములు - మానవ సంభంధాలు  జ్యోతిష్య శాస్త్రము ద్వారా మానవుని జీవితమునకు  సంభందించిన అనేక విషయములను తెలుసుకొనవచ్చును . బాల్యము,విద్య,ధనము,ఆరోగ్యము ,సోదరులు ,కుటుంబము ,భార్య , పిల్లలు ,గృహము,హోదా ,గౌరవము ,అధికారము ,ఉద్యోగము ,వ్యాపారము మరియు మానవుని జీవన విధానమునకు సంభందించిన అనేక విషయములను తెలుసుకొనవచ్చును. 

 జ్యోతిష్య శాస్త్రము ద్వారా ఫలితములు తెలుసుకొనుటకు అనేకరకముల విధానములున్నప్పటికి పరాశర మహర్షి వారిచే చెప్పబడిన వింశోత్తరి దశా పద్దతి ఎక్కువ ఆచరణలో ఉన్నది. ఈ పద్దతి  ననుసరించి ఖచ్చితమైన ఫలితములు తెలుసుకొనవచ్చును.   జ్యోతిష్యము ద్వారా ఫలితములు తెలుసుకొనుటకు ముఖ్యముగా వ్యక్తి  జన్మించిన తేది ,సమయము ,మరియు ,జన్మించిన స్తలము తప్పని సరిగా అవసరము .

 కావున ప్రతి ఒక్కరు తమ యొక్క జనన వివరములను  బట్టి  మొదట జనన కాల గ్రహస్తితిని ఒక చార్టు రూపములో జాతక చక్రమును తయారు చేయించాలి . ఈ  జాతక చక్రమును బట్టి అందున్న గ్రహముల యొక్క స్తితిననుసరించి జాతకుని జీవితములో కలుగు ప్రతి విషయమును తెలుసుకొనవచ్చును .

2013-10-25

చంద్ర , కుజ గ్రహ ప్రభావము

చంద్రుడు కుజుడు ఈ రెండు గ్రహములు ఒకే స్థానములో ఉన్న జాతకులపై  ఎలాంటి ప్రభావము ఉంటుంది అనే విషయమును గురుంచి తెలుసుకొందాం .

చంద్రుడు కుజునితో కూడితే జరుగు ఫలితములు తెలుసుకొనే ముందు ఈ రెండు గ్రహముల యొక్క తత్వములను తెలుసు కోవడం మంచిది . అదే విధముగా ఈ రండు గ్రహములు స్థితి పొందిన రాశి స్వభావము పై కూడా గ్రహముల వలన కలుగు ఫలితములు ఆధారపడి ఉండును . చంద్రుని తత్వము ఈ గ్రహము జల తత్వము కలిగినది . ద్రవరూప స్వభావము కలిగి ఉంటుంది . నీటిలో కరిగే  ప్రతి వస్తువు ఈ గ్రహము యొక్క తత్వమును కలిగి ఉంటుంది . ఉదా : పంచదార , ఉప్పు , గ్లూకోజ్ , మొదలగునవి .

దీని అర్ధం ఏమిటి అంటే తొందరగా తన సహజమైన స్వభావమును కోల్పోయేవన్నీ  ఈ గ్రహ పరిధి లో ఉంటాయి . అందుకేనేమో చంద్రుడు మనస్సుకు కారకుడని మహర్షులు తెలిపితిరి . మనస్సులోని ఆలోచనలు కూడా క్షణ క్షణము మారిపోతూ ఉంటాయి కదా ?

 కుజుడు ఈ గ్రహము అగ్ని తత్వము కలది. అగ్ని వెలుగునివ్వ గలదు. తేడా వస్తే ప్రచండమై దహించి వేయగలదు . కుజుడు ప్రభావము కూడా మానవునిపై  ఇలాగే ఉంటుంది . చంద్రుడు మనస్సు కు కారకుడు అని తెలుసుకొన్నాం కదా . ఈ చంద్ర కుజ గ్రహముల సమాన బలము కలిగి ఉండిన వారు దూర దృష్టితో ఆలోచించ గలరు . మంచి ప్రణాళిక తయారు చేసుకొని తదనుగుణముగా జీవితములో హాయిగా ఆనందముగా జీవించగలరు .
   రెండు గ్రహముల  కాంబినేషన్ ఉన్నవారి జీవితము సజావుగా ఉండదు . కష్ట సుఖములు , సుఖ దుఖములను సమానముగా అనుభవించ వలసిన  పరిస్థితి ఉంటుంది . ఎందుకంటే  చిన్న ఉదాహరణ : చంద్రుడు  జల కారకుడు , కుజుడు అగ్ని కారకుడు . నీటి ప్రభావము ఎక్కువైనపుడు అగ్నిని  ఆర్పి వేస్తుంది .
అదే అగ్ని ప్రభావము ఎక్కువైనపుడు  నీరు ఆవిరిగా  మారుతుంది . ఈ విషయములను చాలా జాగ్రత్తగా గమనించ వలసిన అవసరము న్నది .

ఈ రెండు గ్రహముల  కలయిక గానీ స్థితి గానీ ఉన్నటువంటి  జాతకులు జీవితమున  ప్రతి విషయములోనూ ఆప్రమత్తముగా  ఉండాలి . అదృష్ట వశమున  భాగ్య వంతులైనా , గొప్ప గొప్ప  అధికారములను పొందినా  ఉన్నత స్థానములలో ఉన్న వారైనా గానీ వాటిని కాపాడు కొనుట చాలా అవసరము .

చంద్రుడు మనస్సు  కుజుడు దానిని ఆపరేట్ చేయువాడు. కుజ శక్తి బలహీన మైతే  పరాజయములు ఎదురగుచుండును . మానసిక ప్రశాంతత ఉండదు . పిరికి వారు . తొందర పది నిర్ణయములు తీసుకొని నష్ట పోవుదురు  . ముప్పు  అనునది పొంచి ఉంటంది . ఎదో విధముగా  నష్ట పోవుటకు అవకాశము ఉన్నది .

కుజుడు బలవంతుడు అయితే దార్శనికులు , ముందు చూపు కలవారు , శౌర్య పరాక్రమములు కలవారు , ధైర్య వంతులు అగుదురు . వీరి లైఫ్ లో ఆకస్మిక ధనయోగములు కలుగును ఉన్నత శిఖరములను అధిరోహింతురు . గొప్ప గొప్ప పదవులను పొందగలరు . తీసుకున్న నిర్ణయములను ఖచ్చితముగా  అమలుచేయుదురు . ఎంత కష్ట సాధ్యమైన పనులైనా పట్టుదలతో సాధించ గలరు .       

2013-10-22

చంద్ర గ్రహ ప్రభావము

చంద్ర గ్రహ ప్రభావము

 జాతక చక్రములో చంద్రుడు ఏ  గ్రహాములతో  కలసి నపుడు ఎలాంటి ఫలితములు  అను విషయమును గురించి తెలుసు కొందాము.

చంద్రుడు సూర్యునితో  కలసి నపుడు  శారీరక దుర్బలత్వము , భయము , మనో ధైర్యము లేకుండా ఉండడము , ప్రత్రి పనిలోనూ వెనుక బడి ఉండడము లాంటి  స్వభావమును కలిగి ఉంటారు .. చంద్రుడు మనస్సు కు కారకత్వము వహించు చున్నాడు . అందువలన వీరికి మనసు ఆందోళనతో నిండి ఉంటుంది  . ఇట్టి వారు తాము ఆలోచించి  చేయు ప్రతి విషయములోనూ వ్యతిరేక ఫలితములు కలుగును . వీరు తొందరగా  నిరాశ పడతారు , మనో భీతి ఎక్కువ . సాహించి ముందడుగు వేయలేరు .

ఈ విధముగా సూర్య చంద్ర గ్రహముల ప్రభావము ఉన్నవారు అమావాస్య  ఘడియలలో జన్మించిన వారి ఉంటారు . ఎందుకంటే  సూర్య చంద్రులు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు అమావాస్య ఏర్పడు చున్నది గదా ?  పైన తెలిపిన ఫలితములు  జాతక చక్రములో సూర్యునికి చంద్రునికి మధ్య ఉన్న దూరమును బట్టి  కొందరికి అత్యంత ఎక్కువగానూ , మరికొందరికి చాలా తక్కువగానూ కలుగుతూ ఉంటాయి .   

సుర్ర్యునితో కలసిన  ఏ గ్రహమైనా  అస్తన్గత దోషము పొందును . అస్తన్గత దోషము అంటే  ఆ గ్రహమునకు ఉన్న  బలమును కోల్పోయి  శూన్యత పొందును . గ్రహము వలన కలిగే శుభ ఫలితములను జాతకుడు పొందలేదని భావము . ఎలా అంటే సూర్య  చంద్రులు  గగనములో ఉన్నారు . కానీ  అమావాస్య రోజున  చంద్రుని వలన వెలువడు కాంతి  (వెన్నెల ) ని  భూమిపై నున్న మానవుడు చూడలేదు కదా ?

అంటే కాకుండా అమ్మావాస్య  సమయములో  మానసిక స్థితి భాగా లేనివారికి, పిచ్చి వారికి , మతి స్థిమితము లేనివారికి వారి యొక్క  మానసిక  స్థితిలో ఎక్కువగా మార్పులు కలుగుతాయని  విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడా నిరూపించి ఉన్నారు . దీనికి కారణము ఏమిటంటే  అమావాస్య రోజున చంద్రుని కిరణాలు ( చంద్రకాంతి  ) భూమిపై  ప్రసరించక పోవడమే .


పుట్టినపుడు జాతక చక్రము ప్రకారము ఇలాంటి గ్రహ స్థితి ఉల్లవారి లో ఎక్కువగా  మానసిక సంఘర్షణకు లోనగుదురు . వీరి జీవితములో  చంద్ర మహా దశ జరుగు చున్న సమయములో ఎక్కువగా ఇబ్బంది పడతారు . జాతక చక్రములో  సూర్యునికి చంద్రునికి  మధ్య  సుమారు 15 డిగ్రీ ల కన్నా దూరము ఎక్కువగా ఉంటె  పైన తెలిపిన  వ్యతిరేక ఫలితములు  వీరికి వర్తించవు 

సంవత్సరము

భూమి సూర్యుని చుట్టి వచ్చుటకు 364.75  రోజులు పట్టుచున్నది . ఈ సంవత్సర కాలమును  ౩ భాగములుగా విభజించ బడినది . 1  వేసవికాలము 2  వర్షాకాలము ౩ శీతాకాలము  
 జూన్21 వ తేది సమయములో కర్కాటకరేఖపైన సూర్యకిరణములు ఉచ్చముగా ఉండుట వలన భూమి ఉత్తరార్ధ గోళమున వేసవిగాను దక్షిణార్ధ గోళమున శీతాకాలము  డిశంబరు 22 వ తేది సమయములో  మకరరేఖపై  సూర్యకిరణములు ఉచ్చముగా ఉండుట వలన దక్షిణార్ధ గోళమున వేసవిగాను ఉత్తరార్ధ గోళమున శీతాకలము ఏర్పడుచున్నవి .

భ చక్రము 360డిగ్రీలు అనుకొన్నప్పుడు మొత్తం 12 రాశులు. ఒక్కొక్క రాశిని ౩౦ డిగ్రీలుగా చేసి వాటికి మన మహర్షులు పేర్లు పెట్టారు . అవి  మేషము , వృషభము, మిధునము , కర్కాటకము , సింహము , కన్య , తుల, వృశ్చికము , ధనుస్సు , మకరము , కుంభము , మీనం.

భారత దేశములో  జనవరి 14 న సూర్యుడు మకరరాశిలో  ప్రవేశించు సమయ మకర సంక్రమణమని ఈసమయమునే ఉత్తరాయణ పుణ్యకాల మనియు అందురు . సూర్యుడు రాశి ప్రవేశము జరుగుట కాదు. భూమి తన కక్ష్యలో 27౦వ డిగ్రీ నుండి 90 వ డిగ్రి వరకు ఉత్తరమునుండి దక్షిణదిశగా వెళ్ళుచున్నది . ఈకాలములో ఆకా ములో సూర్యుడు దక్షిణము నుండి ప్రతి రోజు కొంత భాగము ఉత్తరమునకు వెళ్ళు చున్నట్లు కనబడును . దీనినే ఉత్తరాయణ పుణ్యకాలమని అందురు .   
అదే విధంగా జులై14 కర్కాటక రాశిలో  భూమి 90 వ డిగ్రీలో ప్రవేసిస్తుంది .దీనిని దక్షిణాయన మనియు దక్షిణాయన పుణ్య కాలమనియు అందురు . ఈ కాలములో సూర్యుడు ఆకాశములోఉత్తరమునుండి దక్షిణ దిశకు వెళ్లినట్లు కనబడును . ఈ విధంగా సంవత్సరమునకు రెండు ఆయనములు ఏర్పడుచున్నవి.   

2013-10-21

నక్షత్రము



చంద్రుని గమనమునుబట్టి చంద్రుడు 13.20 డిగ్రీల {చారమును  } నడిచేసమయమును  నక్షత్రముగా పరిగణించిరని అనుకొన్నాము . అయితే ఈ సృష్టిలోఉన్న గ్రహములన్నియు ఒకేప్రాంతములో ఒకేకక్ష్యలో లేవు . ఒకగ్రహమునకు మరొకగ్రహమునకు కొన్నివేల లక్షలకిలోమీటర్ల దూరమున్నది. ప్రతిగ్రహము ఒకదానికొకటి సంభందము లేకుండా తమతమ కక్ష్యలలో భ్రమణము కలిగియున్నవి . ఆలోచించిచూస్తే అవిసంచరించే నక్షత్రముల సముదాయము ఒక్కటికాదు.  కాని గ్రహచక్రములో మనకు జాతకుని జన్మలగ్న కుండలిని తయారు చేసేటప్పుడు లగ్నము, చంద్రరాశి, రవిరాశి మరియు మిగతా గ్రహములకు కూడా  నవగ్రహముల నక్షత్ర సంచారము వేయుట జరుగుచున్నది. అంతేకాక గ్రహములన్నియు 27 నక్షత్రములలోనే పరిభ్రమించుచున్నవని చెప్పినారు . . వివిధరకముల వేగముతో వివిధరకముల కక్ష్యలలో నున్న గ్రహములు అనేకనక్షత్ర మండలములలో కలియుచు సూర్యుని అనుసరించుచున్నవి కదా ?  అందువలననే ఇప్పుడు మనముచూస్తున్న నక్షత్రములకు జ్యోతిర్విదులు చెప్పిన నక్షత్రములకు పొంతన కుదురుటలేదు . .మరి ఈనవగ్రహముల నక్షత్ర సంచారము జన్మకుండలిని వేసే విధానమును బట్టి పరిశిలిస్తే అర్ధమయ్యే విషయమేమిటంటే ., సమస్త మైన ఈ నవగ్రహమండలమును 27 నక్షత్రమండలములుగా విభజించినారని తెలియుచున్నది. మరియు ఒక్కొక్క నక్షత్రమండలమునకు ఒక్కొక్క నక్షత్రనామమును సూచించినారు. గ్రహము సంచరించే ప్రాంతమును ప్లేస్ ను మనము డిగ్రీలలో సైంటిఫిక్ గా అంచనా వేయుచున్నాము . అయితే సామాన్యునికి అర్ధమయ్యే విధంగా ఉండుటకు మనమహర్షులు ఈ విధమైన నక్షత్రవిధానమును ఎన్నుకొనిఉండవచ్చును .

2013-10-18

`కొత్త సంవత్సరం – వేడుకలు



ఉగాది తెలుగువారి పండుగలలో విశిష్టమైనది . ఉగాదిని పర్వదినం అని కూడా అంటారు .
ఉగాది అనగా సంవత్సరాది అని అర్ధము ( సంవత్సరానికి ప్రారంభము ) ఈ సంవత్సరములకు ప్రభవ , విభవ , శుక్ల ప్రమోదూత , ప్రజోత్పత్తి , అంగీరస ,శ్రీముఖ , భావ , యువ , ధాత, ఈశ్వర , బహుధాన్య , ప్రమోది , విక్రమ , వృష , చిత్రభాను , స్వభాను , తారణ , పార్ధివ , వ్యయ , సర్వజిత్తు , సర్వధారి , విరోధి , వికృతి , ఖర , నందన , విజయ , జయ , మన్మధ , దుర్ముఖి ,హేవలంబి , విళంబి, వికారి , శార్వారి, ప్లవ , శుభకృతు, శోభకృతు , క్రోధి ,  విశ్వావసు, పరాభవ , ప్లవంగ , కీలక , సౌమ్య , సాధారణ , విరోధికృతు , పరీధావి , ప్రమోదీశ , ఆనంది , రాక్షస , నల , పింగళ, కాళయుక్తి , సిద్ధాద్రి , రౌద్రి , దుర్మతి , దుందుభి , రుదిరోద్గారి , రక్తాక్షి , శ్రోధన , అక్షయ అని 60 పేర్లు పెట్టారు. 

అరవై సంవత్సరములు పూర్తైన తరువాత అవే తిరిగి వచ్చును .
ప్రస్తుతము 2013 లో విజయ అను పేరు గల సంవత్సరము నడచుచున్నది .
తిదులను తేదీలు గా ఉపయోగించే కాలములో చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది వేడుకలు జరుపు కొనుట ప్రారంభ మైనది . ఉగాది పర్వదినమున గ్రహములకు చెప్పబడిన రుచులు (ఆరు రుచులు ) కారము , పులుపు , తీపి , వగరు , ఉప్పు , చేదు, లను కలిపి ఉగాది పచ్చడి ని తయారు చేసుకొని పండుగ జరుపుకొనే పధ్ధతి భారత దేశము లో ఆచారముగా ఉన్నది . కొన్ని (యుగాల నుండి) వేల సంవత్సరము లకు పూర్వమే ఈ సాంప్రదాయము ప్రారంభమైనది.

కాల క్రమేణా భూ గోళము పై ఉన్న అన్ని దేశముల మధ్య  సంబంధము లు ఏర్పడుట వలన వ్యాపార వ్యవహారము ల కొరకు వివిధ దేశముల మధ్య రాయబారములు నడచుటకు ఇంకా అనేక విషయము లలో కలసి మెలసి ఉండుట కొరకు ఇప్పుడు మనము అనుసరిస్తున్న ఇంగ్లీషు నెలలు , తేదీలు ప్రపంచము అంతా అనుసరించడం వలన పూర్వులు అనుసరించిన తిధులు మరుగున పడిపోయాయి .

 ప్రస్తుత కాలములో డిశంబరు 31 వ తేదీ న నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటున్నారు .ఈ వేడుకలు జరుపుకొనే విధానము , సమయము లలో తేడా ఉన్నప్పటికీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకొనే పద్ధతిని భారతీయులే ప్రపంచమునకు చాటి చెప్పితిరి .     

2013-10-16

పగలు – రాత్రి



విజ్ఞానశాస్త్రజ్ఞులు సౌరకుటుంబములో సూర్యుడు నిశ్చలముగా ఉన్నాడని   గ్రహములన్ని సూర్యుని చుట్టే తిరుగుచున్నవని  చెప్పినారు . కానీ జ్యోతిష్య శాస్త్రవేత్తలు భూమి చుట్టూ గ్రహములన్ని తిరుగుచున్నవని చెప్పినారు.  ఈ ఇరువురు వాదనలు వేరుగా ఉన్నవి . అయితే ఫలితములు నిర్ణయించుటకు మాత్రమె భూమిని కేంద్రముగా తీసుకొని ఉంటారు . 

ఉదా : ఒక ఖాళీ ప్రదేశమును తీసుకొందాము . ఆ ప్రదేశమునకు దీర్గ వృత్తాకారములో {భూ కక్ష్య } చుట్టూ ఒక గీతను ఏర్పాటుచేద్దాం . వృత్తమునకు మధ్యలో ఒక పిల్లర్ను ఏర్పాటు చేద్దాము . ఇప్పుడు పిల్లరుకు పైభాగములో ఒక పవర్ పుల్ కాంతి కలిగిన లైటును ఏర్పాటు చేద్దాం. దీనినే సూర్యుడు అనుకొందాం. ముందుగా మనము మార్కింగు వేసుకొన్న వృత్తము యొక్క పరిధి అంతా కాంతి ప్రసరించే విధంగా ఏర్పాటు చేద్దాం .

 మనము ఏర్పాటు చేసుకొన్న వృత్తాకారము గానున్న గీతను  భూ కక్ష్యగా భావించి దీనిని 12 భాగాలుగా విభజించి 12 భాగములకు రాశుల పేర్లు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గ్లోబు తీసుకొని దానికి చుట్టూ అక్షాంశ రేఖాంశములను ఏర్పాటు చేద్దాం . ఈ గీత గుండా ఒక క్రమ పద్దతిలో గ్లోబును పడమర నుండి తూర్పునకు తిరిగేలా ఏర్పాటు చేసుకొంటే గ్లోబుకు ఎదురుగా ఉన్నసగ భాగములో కాంతి పడుతుంది.  

 దీనినే పగలు అని , కాంతి పడని భాగమును రాత్రి గా తెలుసుకొవచ్చు . మరియు ఈ గ్లోబు తన చుట్టూ తానుతిరుగుటకు 24 గంటలు సమయము పట్టేటట్లు ఏర్పాటు చేస్తే కాంతి తూర్పు భాగములో ఉదయిస్తూ పడమర భాగములో తొలగి పోతూ ఉంటుంది . 

ఈ విధముగా భూమిపై వివిధ ప్రాంతములలో ఉన్న ప్రదేశముల మధ్య సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో తేడా వచ్చు చున్నది . ఇప్పటి వరకు చెప్పినది భూమి ఒక రోజులో జరిపే భ్రమణము వలన ఏర్పడే పగలు , రాత్రి , మరియు వివిధ ప్రదేశములలో వచ్చే సూర్యోదయ సుర్యాస్తమయములలో వచ్చే తేడాల గురించి       

2013-10-11

మనీ మార్కెట్


మనీ మార్కెట్ , ఫైనాన్స్ రంగములకు బుధుడు ఆధిపత్యము వహించును. అలాగే చంద్రుడు స్థితిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది .

షేర్ మార్కెట్ లో కొన్ని వేల కంపెనీల షేర్లు ఉంటాయి . అన్ని కంపెనీలూ రాణించవు . కొన్ని కంపెనీలలో పెట్టుబడి పెట్టినపుడు మంచి ప్రతిఫలం వస్తుంది . మరికొన్ని కంపెనీలలో పెట్టుబడి పెడితే అసలు సొమ్మును కూడా నష్టపోవలసి వస్తుంది. దీనికి కారణం ఏమిటి . ఎవరు ఏ ఏ కంపెనీలలో పెట్టుబడి పెడితే మంచిది .

జాతకచక్రము ప్రకారము జన్మ లగ్నము నుండి రెండవ స్థానము ధన స్థానము . ధనము , సంపాదన , రాబడి ఏవిధంగా వస్తుంది, ఏ ఏ వస్తువుల మూలమున ధన వృద్ది కలుగుతుంది అను విషయములను 2 వ స్థానము నుండి చూడాలి . 2 వ స్థానము ఏ గ్రహము నకు సంబంధించినది . ఈ స్థానము నందు ఉన్న గ్రహములు , రెండవ స్థానమును, స్థానాధిపతిని చూస్తున గ్రహములను పరిశీలించి ఆ గ్రహాల మధ్య ఉన్న సంబంధము తెలుసుకోవాలి . షేర్ మార్కెట్ లో రాణించాలి అంటే బుధుని అనుగ్రహము ఉండాలి .

గ్రహముల మధ్య ఉండే చతుర్విధ సంబంధము లను పరిశీలించాలి.
చతుర్విధ సంబంధము అంటే ఏమిటి .
1 ఏ భావము ను గురించి చూస్తున్నామో ఆ భావమునకు సంబంధించిన గ్రహము , 2 భావము లో ఉన్న గ్రహములు , ౩ భావము ను చూస్తున్న గ్రహములు భావ అధిపతి తో కలసి ఉన్న గ్రహములు , పరివర్తన యోగములు ఇలా అన్ని విధములా పరిశీలించాలి .

జన్మ లగ్నము నుండి రెండవ ఇంట ఉన్న గ్రహములు , రెండవ స్థానమునకు అధిపతి అయిన గ్రహము , రెండవ ఇంటిని చూస్తున్న గ్రహములు ,వాటి మధ్య ఉన్న సంబంధము ఆధారముగా ఎవరికీ ఏ ఏ కంపెనీల షేర్లు కొంటె లాభం వస్తుంది . ఎవరెవరు ఏ కంపెనీల షేర్లు కొనాలి ?  అనే విషయమును పరిశీలిద్దాం ?   
అన్నిటికి మించి లాభ స్థానమును( 11 స్థానము ) కూడా పరిశీలించాలి . లాభ స్థాన అధిపతి బలంగా ఉంటే సంపూర్ణమైన లాభాలను అందుకొంటారు . 6 8 12 స్థాన అధిపతులతో సంబంధము కలిగినా చేతికి వచ్చిన లాభాలను అనుభవించలేరు .  ఎందు కంటే లాభం వచ్చినా గానీ కొందరు షేర్ ధరలు పెరిగినపుడు ఇంకా పెరుగుతాయి అని అమ్మకుండా ఉంటారు . ఈ లోగ  పెరగక పోగా పతనం అవుతుంది .

ఎవరికి ఏ ఏ కంపెనీల షేర్లు కొంటె లాభం వస్తుంది  తరువాత శీర్షికలో .........

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...