2014-01-29

మూడమి , గోదూలికా ముహూర్తం



మౌడ్యమి
మూడమి లేక మౌడ్యం : గురుడు మరియు శుక్ర గ్రహములు సూర్యునితో కలసి నప్పుడు మూడమి ఏర్పడుతుంది . అనగా గురు గ్రహము సూర్యునకు దగ్గరగా ఉన్నప్పుడు గురు మౌడ్యమి ఏర్పడును . శుక్ర గ్రహము సూర్యునకు దగ్గరగా ఉన్నప్పుడు శుక్ర మూడమి ఏర్పడును . గురుడు మరియు శుక్ర గ్రహములు నైసర్గికముగా శుభ గ్రహములు . ఇవి సూర్యునకు దగ్గరగా ఉన్నప్పుడు అస్తంగతము పొందును . అందు వలన తమ శక్తిని కోల్పోతాయి . శుభ ఫలితములను ఇవ్వలేవు . 

ఉదా : 100౦ వాట్స్ బల్బు ను తీసుకుందాం . అది సూర్యుడని అనుకుందాం .
 దాని ప్రక్కన రెండు 50 వాట్స్ బల్బులను ఉంచితే వాటి కాంతి  1000 వాట్స్ బల్బు కాంతిలో కలసి పోతుంది కదా . అలాగే సూర్యునకు దగ్గరలో ఉన్న ఏ గ్రహములైన తమ శక్తిని కోల్పోతాయి .

అందువలన ఈ మౌడ్యమి ఉన్న కాలములో శుభ కార్యములు జరుపకూడదు . ముఖ్యముగా వివాహము , గృహారంభము , గృహ ప్రవేశము మొదలగు సమస్త శుభకార్యములు చేయరాదు . నక్షత్ర శాంతి , నవగ్రహ దోష పరిహారములు , హోమము , జపములు , అభిషేకములు వంటివి చేయవచ్చును .

గోదూలికా ముహూర్తము
సూర్యుడున్న ముహూర్తమునుండి ఏడవది గోదూలికా ముహూర్తమని అనబడును . విపులంగా చెప్పాలి అని అంతే పూర్వము పశువులు ఎక్కువగా ఉండేవి . ఉదయాన్నే  ఊరి బయటకు మేతకోరకు పశువులను తోలుకు పోయేవారు. తిరిగి సాయంకాలము సూర్యాస్తమయమునకు ముందుగా ఇంటికి తోలుకు వచ్చేవారు . అలా వచ్చే సమయములో పశువుల మంద వచ్చేటప్పుడు ధూళి రేగేది .

 అలాంటి సమయమును గోదూలికా ముహూర్తముగా వివరించితిరి .  క్లుప్తంగా చెప్పాలంటే సాయంకాలం 4 . ౩౦ నిమషముల నుండి సుమారు 06 గంటల వరకు ఈ సమయము ఉండును. దీనినే గోదూలికా ముహూర్తము అని అంటారు . ఈ ముహూర్తమును సకల శుభాలకు ఉపయోగించ వచ్చును . వర్జ్యము , దుర్మూహర్తములతో పనిలేదు .

2014-01-24

గృహ నిర్మాణ గ్రామార్వణము

మనకు వాస్తు శాస్త్ర పండితులు గ్రామార్వణము గురించి చెప్పియున్నారు . గ్రామార్వణము గురించి ఈ విధముగా చెప్పితిరి . 

ఏ గ్రామము నందు గృహము నిర్మించుటకు స్థలము కొనదలచినారో ఆ గ్రామము యొక్క నక్షత్రము కనుగొనాలి
( గ్రామము పేరులో ఉన్న మొదటి అక్షరమును బట్టి నక్షత్రము తెలుయును .)  
ఆ గ్రామనక్షత్రమునుండి  స్థలము కొనదలచిన వ్యక్తీ యొక్క నక్షత్రము వరకు లెక్కించగా వచ్చు సంఖ్యను బట్టి ఫలితములు తెలుసుకోవచ్చు . దీనినే నరాకార చక్రమందురు . నరాకార చక్రమునందున్న నక్షత్రముల ఫలితములు ఈ విధముగా ఉన్నాయి

శ్లోకం  :  శిరః పంచార్ధ లాభం , ముఖేత్రీ అర్ధ నాశనం , బాణరో
ధన దాన్యంచ పాదయో షట్ దరిద్రః  ప్రుష్టేకం ప్రాణ సందేహం
చతుర్నాభి శుభావహం,నేత్రే ద్వి ప్రీతి లాభంచ ,
సవ్యహస్తేన సంపదా , వామ హస్తనే దరిద్రః

తాత్పర్యము ; శిరస్సు నందు 5 నక్షత్రములు ధన లాభము కలుగజేయును , .ముఖము నందు ౩ నక్షత్రములు ధన నష్టమును , .గర్భమునందు 5 నక్షత్రములు ధన, ధాన్య సమృద్ధిని , పాదముల యందు 6 నక్షత్రములు దరిద్రమును  కల్గించును, పృష్టం నందు 1 నక్షత్రము ప్రాణ నష్టము సూచించును .నాభి యందు 4 నక్షత్రములు శుభమును నేత్రముల యందు 2 నక్షత్రములు ప్రీతిని కలుగ జేయును, కుడి చేతి యందు 1 నక్షతము సంపదను , ఎడమ చేతియందు 1 నక్షత్రము దరిద్రమును అనుభవింప చేయును .

ఉదా : విజయ్  అను వ్యక్తీ గాంధీనగర్ అను గ్రామములో గృహ స్థలము కొనాలని అనుకొన్నాడు . ఇది అతనికి అనుకూలమా ?  గాంధీనగర్ నక్షత్రము ధనిష్ఠ అవుతుంది . విజయ్ నక్షత్రము రోహిణి . నరాకార చక్రము ప్రకారము లెక్క వేయగా 9 వ నక్షత్రము కావున శుభ ప్రదము .

ఈ అర్వణము గ్రామములకు చెప్పబడినది కదా . మరి పెద్ద నగరముల యందు నివసించే వారికి ఎలా అని సందేహము కలుగక మానదు . వేల , లక్షల జనాభాతో పట్టణాలు పెరిగి పోతున్నాయి . పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద వెంచర్స్ వేసి గృహాలను అమ్ముతున్నాయి . వీటికి అర్వణము ఎలా చూడాలి .
మీరు నివసించ బోయే వీధి ని గానీ, రియల్ ఎస్టేట్ సంస్థలలో అయితే ప్రాంతము పేరును బట్టి అర్వణము చేసుకొని వచ్చే ఫలితమును బట్టి గృహ నిర్మాణము చేసుకోవాలి .  .


జన్మ నక్షత్ర ఫలితము _ కృత్తిక

నక్షత్ర ఫలితము _ కృత్తిక
కృత్తిక నక్షత్రము లో జన్మించిన వారు న్యాయ వాదులుగా రాణిస్తారు . గంభీరముగా ఉంటారు . సమర్ధముగా వ్యవహరించువారు . గ్రామ పెద్దలుగానూ , సమాజమున పెద్ద మనుషులుగా చెలామణి ఆగుతారు . సాధారణముగా వీరు ఇంటిలో పెద్ద కుమారుడై జన్మిస్తారు . అట్లు కాకున్నా అత్త గారింటిలో పెద్ద అల్లుడవుతారు .

కుటుంబ భాధ్యతలను ఎంతో సమర్ధవంతముగా నిర్వహించ గలరు . గానీ కొంచెం అహంకారము ఉంటుంది..వీరికి మంచి విద్య అబ్బును . తెలివి కలవారు . ఇతరులకు ఉపకారము చేయుదురు . వీరికి పెద్దలయందు గౌరవము ఉంటుంది . రాజకీయముల యందు ఆసక్తి ఎక్కువ . ఎప్పుడు తనకు పదిమందిలో ప్రత్యేక గౌరవము కలగాలనీ కోరు కొంటారు .

సాహసవంతులు . చుట్టములతో విరోధములు ఏర్పడతాయి . స్నేహితుల పట్ల ప్రత్యేక అభిమానము ఉంటుంది . తనను నమ్మిన వారికి కష్ట నష్టములు కలిగినపుడు ఆదుకొనుటలో ముందుంటారు .వేదాంత జ్ఞానము , దైవభక్తీ ఎక్కువగా ఉంటుంది . తీక్షణమైన దృష్టి కలవారు . పౌరుష వంతులు .మాట పడనివారు , పట్టుదల కలవారు . వీరు అనుకొన్నది సాధించే వరకు నిద్రపోరు .

వీరు అనుభవము పెరిగే కొలది లోకమునందు జరుగు వ్యవహారముల గురించి తెలుసుకొంటారు .పరిష్టితులను తమకు అనుకూలముగా మార్చుకొంటారు . క్రమేణా సంపదను , గౌరవమును పెంచుకొని భాగ్యవంతులవుతారు . వీరికి ప్రభుత్వఅధికారులతో గానీ , రాజకీయ నాయకులతో గానీ మంచి సంభంధములు ఉంటాయి . ఇతరులకు ఉపకారము చేయుదురు . మాట వలన గానీ చేత వలన గానీ ఏదో విధముగా సహాయము చేయుదురు . నమ్మి వచ్చిన వారిని ఆదుకొంటారు .


జన్మ నక్షత్ర ఫలితము _ అశ్విని

నక్షత్ర ఫలితము _ అశ్విని
అశ్విని నక్షత్రము నందు జన్మించిన వారు శక్తి సామర్ధ్య ములు కలిగి ఉంటారు . వీరు జన్మించిన నాటి నుండి కుటుంబము ఆర్ధికముగా , సామాజికముగా గౌరవ మర్యాదలు పెరిగి వృద్ధి పొందును . సాధారణముగా ఈ నక్షత్రమున జన్మించిన వారు చాలా తక్కువ స్థితి నుండి జీవితమును ప్రారంభించి ఉన్నత స్థితికి చేరుతారు . అలంకారములన్న వీరికి ఇష్టము . జీవిత భాగస్వామి వలన , సంతానము వలన వీరికి సంతోషము కలుగుతుంది .

ఏ విషయము పట్ల నైనా త్వరితముగా స్పందిన్తురు . వీరికి స్త్రీ వాంఛ అధికము . నిదానముగా మాటలాడుతారు . వీరు ఉద్యోగ సంభందము గా గానీ , వ్యాపార సంభందముగా గానీ , లేక బ్రతుకు దెరువు నిమిత్తము తన స్వస్తానమును విడచి వేరే ప్రాంతమునకు వలస పోవుదురు . తన స్వస్తానమున గాక ఇతర ప్రాంతములో గృహ నిర్మాణము చేయుదురు . వీరికి దక్షిణ దిశ లేక తూర్పు దిశలో గృహము అనుకూలము .

వీరు సామాన్యముగా కుటుంబమునందు పెద్దరికము వహింతురు . శరీరము వేడి తత్వము కలిగి ఉండును . పొడి బారిన చర్మము . సమమైన ఎత్తు కలవారు . దీర్గాయుస్సు కలవారు . వీరికి చిన్న తనమున మాటలు ఆలస్యముగా వచ్చును . విద్యా విఘ్నములు కలుగు చుండును . వీరితో స్నేహము చేసిన వారు బాగుపడతారు . వీరికి బంధువుల వలన మరియు స్నేహితుల మూలమున అపవాదులు , నిందలు కలుగును . వీరు సుమారు పూర్వార్జితమును ఆశించక స్వార్జితముగా సంపాదించుకొందురు .

నడి వయస్సు దాటిన తరువాత జీవిత భాగస్వామి వలన గానీ , పిల్లల వలన గానీ కొంత సమస్యలను ఎదుర్కొంటారు . కొంత ఆందోళన చెందుతారు . ఇతరులకు లోబడి ఉండ వలసి వచ్చును . వీరి జీవితము సుఖముగా ఉండును .


జన్మ నక్షత్ర ఫలితము _ పుష్యమి



పుష్యమి నక్షత్రములో జన్మించిన వారు మంచి చతురత కలవారు . హాస్యముగా మాట్లాడతారు . దైవభక్తి ఎక్కువగా ఉంటుంది . శారీరకముగా బలముగా ఉంటారు . మానసికముగా పిరికివారు . పైకి మేకపోతు గాంభీర్యము ప్రకటిస్తారు . చంచల మనస్సు కలవారు .ప్రియముగా మాటలాడుదురు . విద్య యందు అభిలాష ఎక్కువగా ఉంటుంది . తెలివైన వారు . మేధావి . చదువులో రాణిస్తారు .

ఐశ్వర్యము కలవారు . చాలా ఉత్సాహముగా ఉంటారు . వీరికి జీర్ణ వ్యవస్థ కు సంభందించిన రోగములు ఏర్పడును . దాంపత్య జీవితములో కొంత అన్యోన్యత లోపించును . నిర్మల మనస్సు కలవారు . సదా సంచారము చేయు చుందురు .
ఎప్పుడు ఏదో పని కల్పించుకొని తిరుగుతూ ఉంటారు . వీరు మనసున ఏది దాచుకోరు . అంతా ఓపెన్ గా ఉండాలని అనుకొంటారు . కల్మషము లేనివారు .

వీరికి వివాహ అనంతరము జీవితము గాడిలో పడుతుంది . మంచి అభివృద్ధిని సాధిస్తారు . సమాజమున గొప్ప వారవుతారు . స్వార్జితముగా వృద్ధిలోకి రాగలరు . కుటుంబ విషయములో ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహము తక్కువగా ఉంటుంది . స్నేహితులు మరియు సన్నిహితుల ప్రోత్సాహము , సహకారము వలన వీరు జీవితమున అత్యున్నత స్థాయికి చేరుకొంటారు .

గురువులను , పెద్దవారిని గౌరవిస్తారు . చేసిన మేలును మరువరు . విశ్వాసముగా ఉంటారు . ఉపకార బుద్ది కలవారు ఆపదలో ఉన్నవారికి సహాయ పడతారు . వీరి మనస్సు చాలా సున్నితమైనది. చిన్న చిన్న కష్టములను కూడా తట్టుకోలేరు. వీరు అనుకొన్నది అనుకొన్నట్లు జరిగితే ఎంతో సంతోషిస్తారు . ఆనందమును పొందుతారు . వీరు ఆరోగ్యమును జాగ్రత్తగా కాపాడుకొనుట మంచిది .

తీపి వస్తువులపై ఇష్టము ఉంటుంది . తిండి విషయములో అతిగా తినకూడదు . ఎక్కువగా తినడము మంచిది కాదు . జాగ్రత్త పాటించుట మంచిది .వీరు చిన్న తనమున సన్నముగా ఉండి తరువాత లావుగా అవుతారు . ఊబకాయులు గా తయారవుతారు .  వాత సంభంద నొప్పులతో భాదపడతారు.

ఆర్ధిక విషయములలో తమకు తోచిన విధముగా సమయానుకూల నిర్ణయములు తీసుకొంటారు . దీని వలన ఇబ్బందులు కలుగుతాయి .ఆపదకాల సమయములలో ధనము కొరకు సమస్యలను ఎదుర్కొన వలసి ఉంటుంది . చాలా ప్రణాలికా బద్దముగా వ్యవహరించుట మంచిది .,  

జన్మ నక్షత్రము _ చిత్త

చిత్త నక్షత్రమున జన్మించిన వారు కర్కశ మనసు కలిగిఉంటారు . చిరాకు , కోపము ఎక్కువగా ఉంటాయి . పట్టుదల ఎక్కువగా ఉంటుంది . లౌక్యముగా వ్యవహారములు నడుపుచుందురు . అహంకారము , గర్వము కలవారు. మొండివారు . ఎవరికీ లోబడి యుండరు . పౌరుషము ఎక్కువ . వీరు ఒక పంధాను ఎంచు కొంటారు . ఇతరులు చెప్పినట్లు వినరు . తనకు తెలిసినదే నిజమని నమ్ముతారు .

మంచి చెడులను గురుంచి ఆలోచించరు . తాము అనుకొన్నది సాధించుకొనుటకు ఎంతకైనా తెగిస్తారు . తొందరపాటుగా నిర్ణయములు తీసుకొంటారు. తద్వారా చిక్కులు , సమస్యలను ఎదుర్కొంటారు . ఇతరులను గురించి పట్టించుకోరు. ఆత్మవిశ్వాసము ఎక్కువగా ఉంటుంది . బలిష్టమైన శరీరము కలిగి ఉంటారు . మానసికముగా ధైర్యముగా ఉంటారు . జీవితమున కలుగు కష్టనష్టములను పట్టించుకోరు .

హుందాగా కనిపింతురు . హంగు , ఆర్భాటములను ప్రదర్శింతురు . రహస్యములను కానీ తమ బలహీనతలను కానీ ఇతరులకు తెలియనివ్వరు . గోప్యతను పాటింతురు . సొంత కుటుంబ వ్యవహారములకన్నా ఇతర వ్యవహారముల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు . ఈర్ష్య , అసూయ , ద్వేషములను కలిగి ఉందురు. వీరు నిలకడలేని ఆలోచన కలిగి ఉందురు. మొదలు పెట్టిన పనిని పూర్తిచెయ్యరు . ప్రతిఫలము చేతికి అందే సమయమున దానిని విడచి పెడతారు . వీరు కొంతకాలము ధనవంతులుగాను , మరికొంతకాలము సామాన్యులు గాను జీవితమును గడిపెదరు .

ఆర్ధికపరమైన విషయములలో ఎక్కువగా ఒడిదుడుకులు ఏర్పడును . ఒక ప్రణాళిక లేకుండా నడచుకోవడం వలన ఎప్పటికప్పుడు సమస్యలతో సతమతమగు చుందురు. జీవితము ఎల్లప్పుడూ సాఫీగా సాగాలని కోరుకొంటారు. కానీ స్వయంకృతాపరాధము వలన చిక్కులు కలుగును . ఈ నక్షత్ర జాతకులకు కుజ గ్రహము అధిపతి అగుటవలన యుక్తవయస్సులో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తించెదరు .కామ వాంఛ ఎక్కువగా ఉంటుంది .
                       
సుగంధద్రవ్యములన్న ఇష్టము . ఈ జాతకులు ముందు చూపు కలిగి భవిష్యత్తును గురించి బాటలు వేసుకోవడము , సహనమును అలవాటు చేసుకోవడము , నిదానముగా ఆలోచించి నిర్ణయములు తీసుకోవడం మంచిది . లేని పక్ష మున ఇబ్బందులు , సమస్యలు తో జీవితము కష్ట నష్టముల పాలగును .   

జన్మ నక్షత్రము – అనూరాధ


అనూరాధ నక్షత్రములో జన్మించిన వారు తెలివైన వారు . .సున్నితమైన వారు . ప్రసన్న వదనము కలవారు . పుణ్యకార్యములు చేయుదురు .అనుకరణ చేయుదురు. స్వతంత్రముగా ముందడుగు వేయరు . ఇతరులు చెప్పినట్లు వింటారు . అనుసరించే స్వభావము ఎక్కువగా ఉంటుంది . వీరిని నమ్మించుట చాలా కష్టము . ఇతరులపై సదభిప్రాయము కలిగి ఉందురు . ఇతరులను నమ్ముతారు . పొరపాటున అనుమానము కలిగితే వారిని జీవితాంతము నమ్మరు .

ఎంత మంచిగా ఉన్నా సరే ఒకసారి వీరి దృష్టిలో చెడుగా అనిపిస్తే మాత్రం దగ్గరకు రానివ్వరు . ఇతరులవలన కలిగిన మేలును మరచి పోతారు . కీడును మాత్రము గుర్తించు కొంటారు . ఈ విధముగా వ్యవహరించుట వలన చులకన అవుతారు . నెమ్మది స్వభావము కలవారు . ఏ విషయమునైనా చాలా తేలిగ్గా తీసుకొంటారు . కొంత నిర్లక్ష్యముగా ఉంటారని అనవచ్చు . తనకు నచ్చని విషయములను తోసిపుచ్చెదరు .ఇతరులతో వాదము చేయరు .

వీరికి మిత్రుల కన్నా శత్రువులు ఎక్కువ . మాట పట్టుదల కలిగి ఉందురు . పట్టు విడుపులు ఉండవు . తాము ఏది అనుకొంటారో అలాగే ఆలోచిస్తారు . అలాగే జరగాలని అనుకొంటారు . కానీ జరిగే వన్నీ వీరి ఆలోచనలకు వ్యతిరేఖముగా జరుగుతాయి . అనవసర విషయములను గురుంచి ఎక్కువగా ఆలోచిస్తారు . భయము కలవారు . క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అసహనము తో ఉంటారు . మనోధైర్యమును కోల్పోతారు .


చిన్న చిన్న విషయములకు తమలో తామే మదన పడిపోతారు . జీవిత భాగస్వామికి కూడా ఏ విషయమును చెప్పరు.  గోప్యతను పాటిస్తారు . గుంభనంగా ఉంటారు . తమ మనోభావములను ఇతరులకు తెలియ నివ్వరు . స్త్రీ సౌఖ్యమును కోరుకొంటారు . వీరు నరముల బలహీనత కలిగి ఉందురు . బలహీనత , జాయింటు పెయిన్స్ తో భాద పడతారు . దైవముపై నమ్మకము కలవారు .కానీ ఏది పడితే అది గుడ్డిగా నమ్మరు . పురాతన సంప్రదాయములను గౌరవిస్తారు .   

అన్యాయాన్ని , అక్రమాలను సహించలేరు . అందరూ నిజాయితీ కలిగి ఉండాలని అనుకొంటారు . ఇతరులకు సహాయ సహకారములు అందిస్తారు . కానీ వీరి ప్రవర్తన మూలకముగా బంధువులు , స్నేహితులు కూడా దూరమవుతారు . ఆపద సమయములో  వీరికి ఎవరూ సాయము చెయ్యరు . అధిక ధన వ్యయము చేస్తారు . పొదుపును పాటించరు. అందువలన ధనమునకై ఇబ్బందులు పడతారు . జాగ్రత్త అవసరము .  

Planets Temporary Relation

గ్రహములకు శాశ్వత మిత్రులు శత్రువులను గురించి ఇంతకూ ముందు పోస్టులో తెలుసుకున్నాం .
ఇప్పుడు తాత్కాలిక మిత్రులు మరియు తాత్కాలిక శతృవులు గురించి తెలుసు కుందాం .
జన్మ లగ్నము నుండి గానీ లేక గ్రహము స్థితి పొందిన స్థానము నుండి గానీ 2 ౩ 4 మరియు 10  11  12 స్థానాల యందు ఉన్న గ్రహములు తాత్కాలిక మిత్రులు అగుదురు . 5 6 7 8 9 1 స్థానముల యందు ఉన్న గ్రహములు తాత్కాలిక శత్రువులు అవుతారు .

ఉదా >: సూర్యునకు గురుడు jupiter మిత్రుడు అని శాశ్వత చక్రము ద్వారా తెలియు చున్నది .
ఒక వ్యక్తీ జాతక చక్రములో సూర్యుడున్నsun స్థానము నుండి 2 ౩ 4 లేక 10 11 12 స్థానములలో గురుడు JUPITER ఉన్నట్లయితే సూర్యునకు గురుడు అధిమిత్రుడు అగును . దీని వలన సూర్య దశ SUN మరియు గురు దశ మరియు అంతర్దశ కాలములలో అత్యంత శుభ ఫలితములు కలుగును .BEST RESULT

ఒక వేళ సూర్యుని నుండి గురుడు 5 6 7 8 9 1 స్థానములలో ఉన్నప్పుడు మిత్రుడైన గురుడు సమ గ్రహము గా మారి పోవును అందుచేత శుభ మరియు అశుభ ఫలితములను సమానముగా కలుగ చేయును .
ఉదా : సూర్యునకు శని శత్రువు అని శాశ్వత చక్రము ద్వారా తెలుసుకున్నాం .

మరొక జాతకములో సూర్యునుండి శని గ్రహము 6 వ స్థానములో ఉన్నాడని అనుకొంటే ఆ శని గ్రహము అధిశత్రువు గా మారి పోవును , ( బలమైన శత్రువుగా ఉన్నాడు ) . దీని వలన శుభ ఫలితములు కలుగవు . కానీ అత్యంత ప్రభావంతమైన పాప ఫలితములను కలుగ చేయును . ఈ విధముగా ప్రతీ వ్యక్తీ జాతక చక్రములో ఉన్న గ్రహముల స్థితి ఆధారముగా గ్రహములకున్న బలము మార్పు చెందును . ఒక వ్యక్తీ జీవితములోLIFE జరుగు ఫలితములు మరొక వ్యక్తీ జీవితములో జరగక పోవడానికి కూడా ఇదియే కారణము .ప్రతి వ్యక్తికీ జరుగు పరినామములన్నియు గ్రహముల యొక్క బలాబలములను అనుసరించి మాత్రమే జరుగును ..

మనలో చాలా మందిని చూస్తున్నాము . మా అబ్బాయి ఫలానా నక్షత్రములో పుట్టాడు . వాడి జీవితనకు తిరుగులేదు. అని అంటూ ఉంటారు .కానీ అదే నక్షత్రములో పుట్టిన వారు సామాన్యులు ఉంటారు . గొప్పవాళ్ళు ఉంటారు . బిచ్చగాళ్ళుPOOR MENS ఉంటారు . ధన వంతులుCAPITALIST ఉంటారు . ఒకే నక్షత్రములో , ఒకే పాదములో పుట్టిన వారి మధ్య ఈ తేడా ఎందుకు వస్తుంది . అందరూ ఒకేలా ఉండాలి కదా ?


దీనికి కారణము ఏమిటంటే జాతకుడు జన్మించినప్పుడు ఉన్న గ్రహస్థితులు , ఆయా గ్రహములకు ఉన్న బలమును అనుసరించి మాత్రమే జీవనము ఆధారపడి ఉంటుంది . 

2014-01-21

Planets Relation

గ్రహములకు మిత్రులు శత్రువులు సములు అని గ్రహముల మధ్య ఉన్న భాంధవ్యమును శాస్త్రములలో నిర్వచించిరి . దీని ఉపయోగము మనిషి జీవితములో ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ముందు గ్రహముల మధ్య ఉన్న సంబంధమును గురించి తెలుసుకోవాలి .

దీనిలో కూడా శాశ్వతము , తాత్కాలికము అను రెండు విధానములు ఉన్నవి . శాశ్వత శత్రువు ఒకప్పుడు మిత్రుడుగానూ , శాశ్వత మిత్రుడు ఒక్కొక్కప్పుడు శత్రువుగాను జాతక చక్రమును బట్టి మారిపోవును . తదనుగుణముగా ఆ గ్రహములు ఇచ్చు ఫలితములు ఆధారపడి ఉంటాయి . ఇప్పుడు మొదట ఏ గ్రహమునకు ఏ గ్రహము శాశ్వత మిత్రుడు ఏ గ్రహములు శాశ్వత శత్రువులుగా ఉన్నాయో చూద్దాం . ఈ పట్టికను గురించి తెలుసు కోవడం వలన జాతక ప్రకారము మరియు సంఖ్యా శాస్త్రము ప్రకారము కూడా ఫలితములు నిర్ధారించుకోవడానికి ఉపయోగ పడుతుంది .

గ్రహముల మధ్య ఉండే శాశ్వత మిత్ర శత్రువుల చక్రము
గ్రహముల మధ్య ఉండే సంబంధము అయిదు రకాలుగా ఉంటుంది  .
1 అధిమిత్రుడు 2 మిత్రుడు ౩ సముడు 4 శత్రువు 5 అధిశత్రువు
1 . అధిమిత్రుడు : అత్యంత శుభ ఫలితములను లాభాలను కలుగ చేస్తాడు
2 . మిత్రుడు  :: శుభఫలితములను ప్రసాదించును
౩. సముడు :: సమ గ్రహము లాభ నష్టములను, సుఖ దుఃఖము లను సమానముగా ఉంచుతాడు
4 శత్రువు  : జరిగే పరిణామము లన్ని వ్యతిరేఖముగా ఉంటాయి .
5 అది శత్రువు : అత్యంత ప్రతి కూలములైన పరిస్థితులను కలుగ చేయును .

శాశ్వత చక్రము

 గ్రహము
మిత్రుడు
సముడు
శత్రువు
సూర్యుడు
చంద్ర  కుజ గురు
బుదుడు  
శుక్రుడు , శని
చంద్రుడు
సూర్యుడు బుధుడు
కుజ గురు శుక్ర శని

కుజుడు
సూర్య చంద్ర గురు
శుక్ర శని
బుధుడు
బుధుడు
సూర్య శుక్ర
కుజ గురు శని
చంద్రుడు
గురుడు
సూర్య చంద్ర కుజుడు
శని
బుధ శుక్ర
శుక్రుడు
బుధ శని
కుజ గురు
సూర్యుడు చంద్రుడు
శని
బుధ శుక్ర
గురు
సూర్య చంద్ర కుజ


మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...