2014-05-20

10 వ తరగతి తరువాత

రాబోయేది పరీక్షల కాలం . 10 వ తరగతి పరీక్ష రాసే విద్యార్ధుల తల్లి దండ్రులకు అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి ?

తమ పిల్లల భవిష్యత్తు కొరకు తరువాత ఏంచెయ్యాలి ? ఏ గ్రూపును తీసుకోవాలి . ఐ . టి. ఐ , పాలిటెక్నిక్ , ఇంటర్ మొదలగు వాటిలో ఏది చదివించాలి అనే సందేహం కలుగుతుంది . చాలా మంది ఎవరో ఏదో చెప్పారని తమ స్వంత ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించడం జరుగుతుంది . తమ స్నేహితుల పిల్లలో లేక తెలిసిన వారి పిల్లలో పలానా కాలేజీలో జాయిన్ అయ్యారనో , ఫలానా గ్రూపు తీసుకున్నారనో ఇతరులను అనుసరిస్తూ ఉంటారు . అలా చేయకూడదు .

విద్యార్ధికి ఏ ఏ సబ్జెక్ట్స్ పై అవగాహన ఉన్నది . వారికి ఏ రంగముల అభిరుచి ఉన్నది , విద్యార్ధి సామర్ధ్యమునకు సరిపోతుందా అనే విషయములను పరిగణన లోకి తీసుకోవాలి . విద్యార్ధి ఎంచుకునే కోర్సుకు భవిష్యత్తులో ఉన్న అవకాశములేమిటి . తదుపరి పై చదువులకు వెళ్ళడానికి ఉన్న అవకాశములు ఎలా ఉంటాయి . మన ఆర్ధిక స్తోమత ఎంత . ఇలా అన్ని విషయములను బేరీజు వేసుకొని ఖచ్చితమైన నిర్ణయము తీసుకోవాలి . ఎందుకంటే మీరు వేయబోయే అడుగు , తీసుకునే నిర్ణయము విద్యార్ధి భవిష్యత్తుకు పునాది లాంటిది .

Good News For Andhra pradesh Students
2014-2015 RGUKT IIIT   ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ వెలువడినది .
వివరములకు ఈ దిగువ వెబ్ సైటు లో చూడండి .

http://admissions2014.rgukt.in/

for Notification in Telugu Please click this Link
RGUKT IIIT NoTIFICATION

2014-05-10

త్రిశాంశ – ఫలితములు

జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ మేష వృశ్చిక రాశులు అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారి ప్రవర్తన సరిగా ఉండదు . శీలము చెడినవారు .
శని త్రిశాంశ యందు పుట్టినవారు దాసీ వృత్తి వలన జీవించెదరు .
గురు త్రిశాంశ లో జన్మించిన వారు మంచి సత్ప్రవరణ కలిగి ఉంటారు .స్త్రీ లైతే ప్రతివ్రత అగుదురు .
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు మాయోపాయములచే బ్రతుకుతారు .
శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు దురాచార సంప్రదాయములను కలిగి ఉంటారు .   

జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ వృషభ , తులా  రాశులు అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారు ఇతరులచే నిందలు పడువారు , దూషించ బడిన వారగుదురు ..
శని త్రిశాంశ యందు పుట్టినవారు రెండు వివాహములు జరుగును .
గురు త్రిశాంశ లో జన్మించిన వారు సద్గుణములు కలవారు  అగుదురు .
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు సమయానుకూల నిర్ణయములు చేయువారు , సంగీతాది విద్యలు తెలిసిన వారగుదురు. .శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు మంచి శీలము కలవారు.  గుణవంతులు , బుద్ది మంతులు అవుతారు.

జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ మిధున , కన్య రాశులు అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారు గౌరవ మర్యాదలు పొందువారు .
శని త్రిశాంశ యందు పుట్టినవారు నపుంసకులు అవుతారు .( అనగా సంసారమునకు పనికి రారు ).
గురు త్రిశాంశ లో జన్మించిన వారు మంచి సత్ప్రవరణ కలిగి ఉంటారు .స్త్రీ లైతే ప్రతివ్రత అగుదురు .
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు గుణవంతులు , విద్యా వినయ సంపన్నులై ఉంటారు . .
శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు కామ స్వభావము  ఎక్కువగా కలిగి ఉంటారు . దుష్ప్రవర్తన కలవారు .    

జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ ధనుస్సు , మీన రాశులు అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారు సద్గుణములు కలిగి , సదా సంచార వృత్తిని కలిగి ఉంటారు ..
శని త్రిశాంశ యందు పుట్టినవారు సంసార సుఖము పై విముఖత చూపిస్తారు , కోరికలు తక్కువగా ఉంటాయి . .
గురు త్రిశాంశ లో జన్మించిన వారు మంచి సత్ప్రవరణ కలిగి ఉంటారు .భార్య ,భర్తల ప్రేమాభిమానములు కలిగి ఉంటారు.
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు శాస్త్ర జ్ఞానము కలవారు. రచనా వృత్తి చే  బ్రతుకుతారు .
శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు భార్యా భర్తల మధ్య ఎడబాటు కలుగును  .   

జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ  మకర కుంభ రాశులు అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారు సేవకా వృత్తిచే జీవించువారు.  .
శని త్రిశాంశ యందు పుట్టినవారు నీచ జనుల సాంగత్యము కలుగుతుంది ..
గురు త్రిశాంశ లో జన్మించిన వారు మంచి సత్ప్రవరణ కలిగి ఉంటారు .స్త్రీ లైతే ప్రతివ్రత అగుదురు .
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు కోపము ఎక్కువ జీవిత భాగస్వామికి విలువ నివ్వరు . .
శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు చంచల మనస్సు కలవారు. సంతాన నష్టము కలుగును . .

జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ కర్కాటక రాశి  అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారు భార్యా భర్తలు ఇరువురకు ఒకరంటే ఒకరికి పడదు ..
శని త్రిశాంశ యందు పుట్టినవారు దంపతులలో ఒకరికి మరణము కలుగును. క్రూర మనస్సు కలవారు ..
గురు త్రిశాంశ లో జన్మించిన వారు మంచి సత్ప్రవరణ కలిగి ఉంటారు .పుత్ర సంతానము కలుగుతుంది.  .
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు కళా నైపుణ్యము కలవారు . కళా రంగమున రాణిస్తారు .
శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు కాముకులు , వ్యభిచారులు అవుతారు . దుష్ప్రవర్తన కలవారు .    


జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ సింహ రాశి  అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారు మాయా మోస స్వభావము కలవారు. శీలవంతులు కారు .
శని త్రిశాంశ యందు పుట్టినవారు వ్యభిచారము చేయువారు . చరిత్ర హీనులు ..
గురు త్రిశాంశ లో జన్మించిన వారు గొప్ప అధికారము చేపట్టువారు . రాజసమాన భోగములను అనుభవింతురు ..
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు భయము లేనివారు ,సంస్కార హీనులు ,చెడ్డ పనులు చేయుదురు .. .
శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు పెండ్లాడిన వారిని విడచి అన్యులను చేపడతారు .  

2014-05-08

ముఖ్యమైన పండుగలు

ఏ పండగ ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం .
ఉగాది : చైత్ర శుద్ధ పాడ్యమి
శ్రీ పంచమి : చైత్రశుద్ధ పంచమి
శ్రీ రామ నవమి : చైత్ర శుద్ధ నవమి
అక్షయ తదియ : వైశాఖ శుద్ధ తదియ
పరశురామ ద్వాదశి : వైశాఖ శుద్ధ ద్వాదశి
నృసింహ జయంతి : వైశాఖ శుద్ధ చతుర్దశి
శయన ఏకాదశి , తొలి ఏకాదశి  : ఆషాడ శుద్ధ ఏకాదశి
వ్యాస పూర్ణిమ : ఆషాడ శుద్ధ పూర్ణిమ
వరలక్ష్మి వ్రతం : శ్రావణ మాసంలో పున్నమికి ముందు వచ్చు శుక్రవారం
దామోదర ద్వాదశి : శ్రావణ శుద్ధ ద్వాదశి
జంధ్యాల పూర్ణిమ : శ్రావణ శుద్ధ పూర్ణిమ
చాతుర్మాస్య వ్రతం : ఆషాడ శుద్ధ ద్వాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు మాసములు చేయు వ్రతం
శ్రీ కృష్ణ అష్టమి : శ్రావణ బహుళ అష్టమి
వినాయక చవితి : బాద్రపద శుద్ధ చవితి
కేదార నవమి : బాద్రపద శుద్ధ నవమి
మహాలయ అమావాస్య : బాద్రపద అమావాస్య
దుర్గాష్టమి : ఆశ్వీయుజ శుద్ధ అష్టమి
మహర్నవమి : ఆశ్వీయుజ శుద్ధ నవమి
విజయ దశమి : ఆశ్వీయుజ శుద్ధ దశమి
గౌరీ పున్నము  : ఆశ్వీయుజ శుద్ధ పూర్ణిమ
నరక చతుర్దశి : ఆశ్వీయుజ బహుళ చతుర్దశి
దీపావళి : ఆశ్వీయుజ బహుళ అమావాస్య
నాగుల చవితి : కార్తీక శుద్ధ చవితి
నాగ పంచమి : కార్తీక శుద్ధ పంచమి
అక్షయ నవమి : కార్తీక శుద్ద నవమి
క్షీరాబ్ది ద్వాదశి : కార్తీక శుద్ధ ద్వాదశి
జ్వాలా పూర్ణిమ : కార్తీక శుద్ధ పూర్ణిమ
మధ్య నవమి : మార్గశిర శుద్ధ నవమి
సుబ్రహ్మణ్య షష్టి : మార్గశిర శుద్ధ షష్టి  
సంకట గణేష వ్రతం : మార్గశిర బహుళ చవితి
వైకుంట ఏకాదశి : పుష్య శుద్ధ ఏకాదశి
భోగి పండుగ : సంక్రాంతికి ముందురోజు
మకరసంక్రాంతి : సూర్యుడు మకర సంక్రణము జరిగే రోజు , జనవరి 14 లేక 15
కనుమ : సంక్రాంతి మరుసటి దినం
వసంత పంచమి : మాఘ శుద్ధ పంచమి
రధసప్తమి : మాఘ శుద్ధ సప్తమి
భీష్మ ఏకాదశి : మాఘ శుద్ధ ఏకాదశి
మహాశివరాత్రి : మాఘ బహుళ త్రయోదశి
నృసింహ ద్వాదశి : ఫాల్గుణ శుద్ధ ద్వాదశి
హొలీ పండగ : ఫాల్గుణ పూర్ణిమ , డోలా పూర్ణిమ

2014-05-06

మూర్తి నిర్ణయం చేయడం ఎలా ?

గ్రహములు నిత్యమూ పరి భ్రమణము చెందుతూనే ఉంటాయి .
ప్రతి గ్రహము తన కక్ష్య ను అనుసరించి ముందుకు కదులుతూ ఉంటుంది . అలా గ్రహములు ఒకరాశినుండి మరొక రాశిలోకి ప్రవేశించు సమయమును తెలుసుకొని మూర్తి నిర్ణయము చేయబడుతుంది .
ప్రతి సంవత్సరము మనం రాశీ ఫలితములను తెలుసుకోవడం అనేది అనాదిగా వస్తున్నా ఆచారము . దీనికి ప్రత్యేకించి  ఒక సమయాన్ని నిర్ణయించడం జరిగింది .

మన తెలుగు వారు ముఖ్యముగా ఉగాది నుండి సంవత్సరము ప్రారంభము అయినట్లుగా భావించి రాశీఫలితములను తెలుసుకోవడం జరుగుతుంది . ఉగాది సమయములో ఉన్న గ్రహముల స్థితి ప్రకారము మాత్రమే సంవత్సర ఫలితములు ఆధారపడి ఉండవు . గ్రహములలో నిత్యమూ జరుగు సంచారమును బట్టి మానవునకు కలుగు శుభ, అశుభములు ఆధారపడి ఉంటాయి . వీటిని సూక్ష్మముగా తెలుసుకొనుటకు వీలుగా ఉంటుందని మూర్తుల నిర్ణయము చేయడం జరిగింది .
ఏ ఏ మూర్తుల వలన ఏవిధమైన ఫలితములు కలుగుతాయి అను విషయములను మనం ఇంతకూ ముందర శీర్షికలలో తెలుసు కున్నాం .
ఇప్పుడు ఈ మూర్తులను ఎలా నిర్ణయించాలి అను విషయములను తెలుసుకుందాం .
చద్రుని గమనము వలన నక్షత్రములను తెలుసుకోవడం జరుగుతుంది . మనకు మన జన్మ నక్షత్రము తెలిస్తే జన్మరాశి తెలుస్తుంది . జన్మ నక్షత్రము తెలియని వారికి పేరు లో ఉన్న మొదటి అక్షరమును బట్టి నక్షత్రము తెలుసుకోవచ్చు . ఆ విధముగా పేరులో ఉన్న మొదటి అక్షరము ప్రకారము ఏ నక్షత్రము అవుతుందో గుర్తించి , ఆ నక్షత్రము ఏ రాశికి చెందినదో తెలుసు కొనుట చాలా సులభము

మీ పేరులోని మొదటి అక్షరము ప్రకారము మీది ఏ నక్షత్రము ఏ రాశి అను విషయము తెలుసు కోవాలంటే ఈ దిగువన ఉన్న లింకును క్లిక్ చెయ్యండి .

జన్మ లేక నామ నక్షత్రము తెలుసుకున్న తరువాత జన్మరాశిని  లేక నామ రాశిని తెలుసుకోవాలి .
ఏ గ్రహమునకు మూర్తి నిర్ణయము చేయవలెనో మొదట గుర్తించాలి . పిమ్మట ఆ గ్రహము ఏ రోజున ప్రవేశించు చున్నది . గ్రహము ప్రవేశించు రోజున ఉన్న నిత్య నక్షత్రము ఏమిటి ? ఆ నక్షత్రమునకు సంభందించిన రాశి ఏమిటి అను విషయమును జాగ్రత్తగా లెక్కించ వలెను . ఆ విధముగా లిక్కింపగా వచ్చిన రాశి సంఖ్యను బట్టి మూర్తి నిర్ణయము చేయాలి .
జన్మరాశి లేక నామ రాశి నుండి
1  6    11  రాశులలో ఉన్న గ్రహములు సువర్ణ మూర్తులు
2  5    9  రాశులలో ఉన్న గ్రహములు రజిత ( వెండి ) మూర్తులు.
3   7   10  రాశులలో ఉన్న గ్రహములు తామ్ర ( రాగి ) మూర్తులు
4   8   12   రాశులలో ఉన్న గ్రహములు లోహ ( ఇనుము ) మూర్తులు


ఈ విధముగా మూర్తి నిర్ణయము చేయాలి . పంచ లోహాలలో వాటికి ఉన్న విలువను ఆధారముగా చేసుకొని గ్రహములు ఇచ్చు శుభ ఫలితములను తెలుసుకొనుటకు వీలుగా ఉంటుందని ఈ మూర్తి నిర్ణయము చేయడం జరిగింది .

2014-05-05

వధూ వరుల రాశులు


వధూ వరులకు వివాహము చేయ నిశ్చయించి నపుడు షష్ఠ అష్టకములు , ద్విర్ద్వాదశములు లేకుండా చూడ వలెనని జ్యోతిర్విదులచే చెప్ప బడినది .
ద్విర్ద్వాదాశము వలన అంతగా చెడు ప్రభావము కనిపించుట లేదు . కావున వధూ వరుల ఇరువురి రాశులు ద్విర్ద్వాశము అయినప్పటికీ వివాహము చేయ వచ్చును .
షష్ఠ అష్టకములు అయినపుడు కూడా చేయ వచ్చునా అను సందేహము కలుగుతుంది .
కొన్ని రాశుల విషయములో షష్ఠ అష్టకములు అయినప్పటికినీ వివాహము చేయవచ్చు .

షష్ఠ అష్టకములు మూడు రకములుగా ఉన్నవి .
1 సమ షష్ఠ అష్టకములు 2 . మిత్ర షష్ఠ అష్టకములు ౩. శత్రు షష్ఠ అష్టకములు .

1,. సమ షష్ఠ అష్టకములు అనగా ఒకే గ్రహము ఆధిపత్యము వహించు రాశులని తెలుసుకోవాలి.
సమ షష్ఠ అష్టక రాశులలో పుట్టిన వారికి నిస్సందేహముగా వివాహము జరిపించవచ్చు .
ఉదా : వృషభ , తుల రాశులలో జన్మించిన వారికి వివాహము చేయవచ్చు .  ఈ రాశులకు శుక్ర గ్రహము అధిపతి .
మేష , వృశ్చిక రాశుల లో పుట్టిన వారికి వివాహము చేయవచ్చు . ఈ రాశులు రెంటికి కుజుడే అధిపతి .

2. మిత్ర షష్ఠ అష్టకములు అనగా ఒక రాశి కి చెందిన అధిపతి అయిన గ్రహమునకు మరొక రాశికి చెందిన అధిపతి అయిన గ్రహము మిత్రుడై ఉండాలి . ఆ విధముగా రెండు రాశుల మధ్య మిత్రత్వము కలిగియున్న రాశులను మిత్ర రాశులని అందురు .
ఉదా : కర్కాటక ధనుస్సు , సింహం మీనం , కన్య కుంభం , మిధునం మకరం ఈ రాశుల కు అధిపతులైన గ్రహములు పరస్పరము ఒకరికొకరు మిత్రులై ఉండుట వలన దంపతుల మధ్య కొంత అన్యోన్యత లోపము ఉన్నప్పటికినీ ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని సుఖముగా జీవింతురు .

౩. శత్రు షష్ఠ అష్టకములు . ఈ రకమైన రాశులకు చెందిన వారికి ఎట్టి పరిస్థితులలోనూ వివాహము చేయరాదు .

ఉదా : మేషం కన్య , తుల మీనం , వృషభం ధనుస్సు , మిధునం వృశ్చికం , కర్కాటక కుంభం , సింహం మకరం ఈ జంటలకు వివాహము జరిపించుట వలన సంసారమున అనేక ఇబ్బందులు కలుగుటయే కాక  పరస్పరము ఒకరికొకరు దూషించు కొందురు . వీరిలో చాలా మందికి విడాకులు తీసుకొనుట కూడా జరుగును .

కావున వివాహము నిశ్చయించు నపుడు అనేక విధములుగా ఆలోచించి పై విషయములన్ని క్షుణ్ణంగా పరిశీలించుట మంచిది .

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...