శ్లోకం
: యద్దినే పతతేశుక్రః మాతృ గర్భేణ
నిర్మితః
లలాటే
లిఖితే ధాతా లాభాలాభ శ్శుభాశుభః
తాత్పర్యము : ఏ దినమున శుక్లము పడినదో అప్పటి
నుండి తల్లి గర్భములో అండము పిండముగా మారి జీవి స్వరూపమును, నిర్మాణము జరిగే
సమయములోనే ఆ జీవియొక్క భవిష్యత్తును గురించి వ్రాయబడుతుంది . పుట్టిన తరువాత
జీవితమున కలుగు లాభము , నష్టము , శుభము , అశుభము మొదలగు సమస్త విషయములను సృష్టికర్త
యైన బ్రహ్మదేవుడు నుదిటిపై లిఖిస్తాడు .
,
జ్యోతిష్యము అనగా మార్గనిర్దేశనము చేసేది.
దీపం వెలుగుతూ ఉన్నప్పుడు చీకటిని పారద్రోలి
కాంతిని ప్రసరిస్తుంది.. అలాగే జ్యోతిష్యము కూడ మానవుని జీవన ప్రయాణములో ఏది మంచి
, ఏది చెడు అని తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఏ శాస్త్ర , సాంకేతికత లేని
రోజుల్లో కార్తెలను తెలుసుకొని ఆయా కాలానుగుణముగా పంటలు వేసేవారు . కార్తెలకు
అనుగుణముగా వేర్వేరు పంటలను పండించేవారు . మన భారతీయ సాంప్రదాయములను, ఆచారములను,
తెలియపరస్తుంది .పండుగలు మొదలగు వాటి గురించి తెలుసు కోవచ్చు . ఇలా అనేక విధములుగా
జ్యోతిష్య శాస్త్రము మనకు ఉపయోగ పడుతుంది .
ఈనాడు మానవుడు సృష్టికి ప్రతి సృష్టి
చేయుచున్నాడు . వాతావరణమును తనకు అనుకూలంగా మార్చుకొను చున్నాడు .:
1 వేసవి
కాలము : విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు ఉష్ణోగ్రత ప్రభావమును తట్టుకొనుటకు వీలుగా ఏ
సి కనుగొన్నాడు . చల్లని పదార్ధములు భుజించడం , చెవులకు గుడ్డలు కట్టుకోవడం ,
టోపీలు ధరించడం మొదలగు జాగ్రత్తలు తీసుకొంటున్నాడు
2 వర్షాకాలము : బాగా వర్షం కురుస్తుంది .
ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాలి .వర్షములో తడవకుండా ఉండడానికి గొడుగు కనిపెట్టాడు
. వైరల్ పీవర్స్ , అంటువ్యాధులు రాకుండా జాగ్రత్త పడుతున్నాము .
౩శీతాకాలము : విరీతమైన చలి కాలములో చలి నుండి
తట్టుకోడానికి హీటర్లు కని పెట్టాడు .రగ్గులను కప్పుకోవడం , కాటన్ బట్టలు వాడడం ,
ఇలా అనేక జాగ్రత్తలు తీసుకొంటున్నాం .
ఇక్కడ ఒక విషయమును మనం గమనించాలి . అది ఏమిటంటే మానవుడు
మొదట ప్రకృతికి అనుకూలముగా మారాడు . తరువాత ప్రకృతిని తనకు అనుకూలముగా
మార్చుకోసాగాడు . అయితే ఏది చేసినా ఎంత చేసినా ఈ ప్రకృతి ఒడిలో ప్రకృతికి లోబడే
చెయ్యాలి . మానవుడు ఒంటరివాడు కాదు. నలుగురితో కలసి బ్రతకాలి. సమాజములో తానొక్కడు
మాత్రమే . కష్ట సుఖములలో , శారీరకముగా , మానసికముగా ఒకరికి ఒకరు తోడుండే
వ్యవస్థలను ఏర్పాటు చేసుకొన్నాడు .
భగవంతుని పూజిస్తూ శాస్త్రమున తెలుపబడిన శాంతి కర్మలను తన ఆచార సంప్రదాయములకు అనుగుణముగా ఆచరించుట వలన కష్టములు తొలగి ఆయురారోగ్యము , ఐస్వర్యములను పొందుచున్నాడు .
భగవంతుని పూజిస్తూ శాస్త్రమున తెలుపబడిన శాంతి కర్మలను తన ఆచార సంప్రదాయములకు అనుగుణముగా ఆచరించుట వలన కష్టములు తొలగి ఆయురారోగ్యము , ఐస్వర్యములను పొందుచున్నాడు .
No comments:
Post a Comment