2017-11-13

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు .

మేషరాశి  : ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశి లో జన్మించిన వారు దూరాలోచన లేనివారు , తొందర స్వభావము కలవారు . కోప మెక్కువ , సహనము, ఓర్పు తక్కువ కలవారు , వీరికి మిత్రులు తక్కువగా ఉందురు . క్షణ క్షణము అభిప్రాయములను మార్చుకొను చుందురు . . కొద్ది అమాయకత్వము కలిగిన వారు . పట్టుదల తక్కువ . వీరికి ఏదైనా సాధించ వలెనను కోరిక యుండదు . 

అల్ప సంతోషులు , ధైర్య , సాహసములు తక్కువ . ఉన్నంతలో తృప్తి చెందుతారు . లేని దాని గురించి ఆరాట పడుదురు . నిరాశ , నిస్పృహలకు లోనగుదురు . వీరు సాధారణముగా మధ్యస్తమైన ఎత్తు కలిగి చూచుటకు అందముగా కన్పింతురు . వీరితో స్నేహము చేసిన ఎక్కువ కాలము ఉండదు . వీరు ఎ పని చేపట్టిననూ మధ్యలో విడచి పెడతారు .

 వీరి జీవితములో రెండు లేక మూడు రంగములలో ప్రవేశము పొందిననూ ఏ రంగములోనూ సంపూర్ణమైన నైపుణ్యమును సాధించలేరు. ఎదుటి వారి మనస్తత్వమును ఎరిగి నడచుకొనే స్వభావము వీరిలో తక్కువ .వీరు అందరికి ఉపయోగ పడతారు , కానీ వీరికి అవసరం వచ్చినపుడు ఎదుటి వారిని ఉపయోగించు కొనే లౌకికము వీరికి తెలియదు  . తద్వారా వీరు మధన పడుదురు .


బ్లాగు మిత్రులందరికీ నా మనవి . దయచేసి ఈ బ్లాగు పోస్టులను షేర్ చెయ్యండి .
 

2017-08-21

పంచ మహా పురుష యోగములు - 5 Lucky Yogasరుచక మహా పురుష యోగము
జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానము లలో  కుజుడు స్వక్షేత్రము న గానీ, ఉచ్చ స్థానము లో గానీ ఉన్నప్పుడు  రుచక యోగము ఏర్పడును . ఇటువంటి యోగములో పుట్టిన వారు ఉన్నత పదవులను పొందెదరు. అధికారులు అగుదురు , సైన్యాధ్యకులు గా సైన్యమునకు ఆధిపత్యము వహింతురు విద్యుత్తు రంగములో పెను మార్పులను తీసుకు రాగలరు . రక్షణ శాఖల యందు , ఇంజనీరింగు శాఖల లోను , ఉన్నత అధికారమును పొందుతారు .
పెద్ద , పెద్ద వైద్యులు గా పేరు పొందుటయే కాక శస్త్ర చికిత్స నిపుణులు గా పేరు గాంచెదరు .

భద్ర మహా పురుష యోగము
జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానము లలో బుధుడు  స్వక్షేత్రము న గానీ, ఉచ్చ స్థానము లో గానీ ఉన్నప్పుడు భద్ర యోగము ఏర్పడును .ఇట్టి యోగమున జన్మించిన మానవులు గణిత శాస్త్రము నందు మేధావులు , ఆర్ధిక శాస్త్ర నిపుణులు అగుదురు .వీరు బ్యాంకుల యందును , ఆర్ధిక సంస్థల లోనూ ఉన్నత పదవులు అలంకరింతురు. . పండితులుగా రాణింతురు. పూజ్యత , ధన సమృద్ధి కలిగినవారు  .

హంస మహా పురుష యోగము
జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానము లలో  గురుడు స్వక్షేత్రము న గానీ, ఉచ్చ స్థానము లో గానీ ఉన్నప్పుడు హంస యోగము ఏర్పడును . ఇలాంటి యోగమున  పుట్టిన మానవులు , దయా గుణము కలవారు, ధర్మ స్వభావము కలవారు , పండితులు , పరోపకారము చేయువారు . రాబోయే తరాల వారికి కలుగు మేలును గురించి నూతన విషయములను కనిపెట్టువారు , దైవత్వము కలవారు ,గొప్ప అధికారము కలిగి ఉన్నత స్థానములను పొందుదురు .

మాలవ్య మహా పురుష యోగము
జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానము లలో  శుక్రుడు స్వక్షేత్రము న గానీ, ఉచ్చ స్థానము లో గానీ ఉన్నప్పుడు  మాలవ్య యోగము ఏర్పడును . ఈ యోగములో పుట్టిన వారు కళా రంగమును అభి వృద్ది చేయువారు , గొప్ప కళాకారులుగా పేరు సంపాదింతురు. మంచి గృహ యోగము కలిగి సర్వ సుఖములు అనుభవింతురు . భోగములు అనుభవించు వారు ఆభరణ ప్రేమికులు , మృదు స్వభావి ,, సంగీత , సాహిత్య రంగములలో , నటనా రంగములలో విశేష గుర్తింపు పొందెదరు .

శశ మహా పురుష యోగము
జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానము లలో శని స్వక్షేత్రము న గానీ, ఉచ్చ స్థానము లో గానీ ఉన్నప్పుడు  శశ  యోగము ఏర్పడును .  ఇటువంటి యోగమున జన్మించిన మానవులు సాధారణ కుటుంబము లో జన్మించిన వారైనా జీవితములో అత్యునత స్థాయిని పొంద గలరు . వీరు స్వయం శక్తి తో ఉన్నత శిఖరము లను అధిరోహించెదరు .ఇట్టి వారు రాజకీయము లందు రాణింతురు. ఈ యోగ ప్రభావముచే ఉహించని విధంగా ఉన్నత పదవీ యోగము కలుగును . వీరు విశేష ధనమును పొంది భోగ భాగ్యములను అనుభవింతురు . పెద్ద పెద్ద పరిశ్రమలను స్థాపించి వ్యాపార వేత్తలుగానూ ,విశేష  కీర్తిని సంపాదిస్తారు.
  

2017-08-16

నవ రత్నములు – విశేషములు 1 ( కెంపు)

జాతకము నందున్న దోషము లను తెలుసు కొని రత్నము లు ధరించుట వలన గ్రహ దోషము లు తొలగి దీర్గాయు రారోగ్త్యములు ,అభివృద్ది , ధన సమృద్ధి కలిగి మానవుడు సుఖ సంతోషములను పొందును .
సూర్య భగవానుని ప్రతి రూపమే కెంపు . ఈ కెంపును ధరించుట వలన ధైర్య సాహసము లు పెరుగును . గట్టి పట్టుదల కలిగి అనుకొన్నది సాధించ గలరు . రాజకీయము లందు రాణించెదరు . సంఘం నందు గౌరవ మర్యాద లు పెరుగును . సాన పట్టిన కొలది కాంతి వంతము గా ఉండే కెంపు చాలా ప్రశస్త మైనది. శ్రీలంకలో దొరుకు కెంపు చాల ప్రశస్త  మైనదని అందురు .

ఈ కెంపు లలో మాణిక్యము,  పద్మ రాగము , సౌగందిక,ము , కురు విందము , మాంసగంధి, నీలగంధి, లాలు గంధి అను పేర్లు కలవు .ఇది ఎరుపు రంగులో ఉంటుంది . బీటలు , పగుళ్ళు లేని కెంపును ధరించుట మంచిది .
సరియైన కెంపును అగ్ని లో పెట్టి కాల్చి ననూ పగలదు. చల్ల బడగానే బూడిద రంగును పొందును . కొంత సేపటికి ఆకు పచ్చ రంగుతో కనపడును . పూర్తిగా చల్లబడి నపుడు . ఉదయించు సూర్యుని వలె ఎరుపు రంగును పొందును .
ఈ విధమైన కెంపు ప్రసిద్ధ మైనది.
రత్నములు ధరించుట కు వివిధ రకముల పద్దతుల ను అనుసరించు చున్నారు.
నవ గ్రహము లకు రాజు సూర్యుడు కనుక సంఖ్యా శాస్త్రము ప్రకారము 1 సూర్యుని సంఖ్య.
1 , 1 0, 19, 28 తేదీ లలో జన్మించిన వారు.,  కృత్తిక , ఉత్తర , ఉత్తరాషాడ , నక్షత్రము లలో జన్మించిన వారును , మరియు సింహ రాశి , సింహ లగ్నములలో జనించిన వారు ఈ రత్నమును ధరించుట మంచిదని మహర్షులు చెప్పితిరి           

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...