2013-12-28

భారతంలో ఒక కధ

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం-శ్రీ మహాభారతంలో కథలు

చాలా ఏళ్ల క్రితం మన దేశమంతా అరణ్యాలతో నిండి వుండేది. ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చెయ్యడమంటే చాలా కష్టంగా వుండేది. ఎందుచేతనంటే ఆ అరణ్యాలు రాక్షసులకు, క్రూరజంతువులకు పునికి పట్టుగా వుండేవి.

దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు, అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ వుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని, తన ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వనయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు.

వంట అయిపోయాకా అతిధుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్టిగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, " వాతాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా" అని పిలిచేవాడు. అతిధుల కడుపులో మాంసరూపంలొ వున్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు. పాపం! ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిధుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు.

చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు, ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగే వాడు. అగస్త్యడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.

మహర్షిని చూడగానే ఇల్వలుడు యధాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురు వెళ్ళి ఆ రోజుకు తన అతిధిగా వుండమని కోరాడు. అగస్త్యుడు వెంటనే అంగీకరించాడు. ఇల్వలుడు ఇల్లు చేరగానే వినయంగా చేతులు కట్టుకుని, " మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట చేస్తాను" అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.

తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలియకపోతే కదా! ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అనుకున్నాడు.

అది ఇల్వలుడికి వినపడలేదు.ఆయన చెయ్యి కడుక్కోడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు " వాతాపీ! ఓ వాతాపీ! బయటకు రా!" అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది. అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ " ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమై పోయాడు" అన్నాడు.


తన ఎదుట వున్నది అగస్త్యులవారనీ, ఆయనకు మహత్తరశక్తులు ఉన్నాయనీ అప్పుడు అర్ధమయింది ఇల్వలుడికి. ఒణికిపోతూ మహర్షి కాళ్ళమీద పడి " మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచి పెట్టండి. మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను" అన్నాడు.తాపసి దయతలచి సరే అన్నాడు.ఇల్వలుడు మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి వదలి పెట్టి వెళ్ళిపోయాడు.

"ఇల్వల" అంటే చెడునడత గలిగన మనసు అని అర్ధం.


"వాతాపి" పేరు సర్వప్రాణుల్నీ హరించేవాడు అనే అర్ధాన్నిస్తుంది. అంటే 'మరణం' అన్నమాట.


ఇల్వలుడనే చెడు మనసు గల వాని జిత్తులు జ్ఞాని అయిన అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేక పోయాయి.

వివేకానంద

ప్రతీ జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతిని నియంత్రించి, అంతర్గతమైన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించటమే జీవిత పరమావధి. దీనికై కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలలో ఒకటిగాని, కొన్నిటినిగాని, లేదా అన్నిటినిగానీ అవలంబించి ముక్తులవ్వండి. మతసారం ఇదే. వాదాలు, సిద్ధాంతాలు, కర్మకలాపాలు, గ్రంధాలు, దేవాలయాలు, బాహ్యరూపాలు, మూర్తులు ----ఇవన్నీ అప్రధానాంసాలు. ------"వివేకానంద సూక్తి"

2013-12-27

తులసీదాసు గొప్పతనము

తప్పక చదవండి........(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు ) హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.ఇక్కడే మన మహర్షుల మహాత్యం తెలుస్తింది.ఈ క్రింది విషయం పరిశీలంచండి. హనుమాన్ చాలీసాలో ... "యుగ సహస్ర యోజన పర భాను, లీల్యో తాహి మధుర ఫల జాను" హనుమాన్ చాలీసా వచ్చిన అందరికీ పైన చెప్పిన పంక్తులు తెలుసు.

 పై పంక్తులకి అర్ధాన్ని ఒకసారి తెల్సుకుందాం. భాను అంటే సూర్యుడు.యుగ సహస్ర యోజన అంటే దూరాన్ని తెలియజేస్తుంది. లీల్యో తాహి మధుర ఫల జాను అంటే ..సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు. ఇక్కడ భూమికి సూర్యుడికి దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు.

ఈ దూరాన్ని విశ్లేషించుకుందాం. యుగ -12000 సంవత్సరాలు సహస్ర -1000 యోజనం- 8 మైళ్ళు యుగ X సహస్ర X యోజనం 12000X1000=12000000 12000000X8=96000000 మైళ్ళు ఈ మైళ్లను కిలోమీటర్లోకి మారిస్తే.... ఒక మైలు =1.6 కి .మీ. 96000000X1.6=153600000 ఇది భూమికీ సూర్యుడికి ఉన్న దూరం.


(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు ) అని హనుమాన్చాలీసాలో తులసీదాసు ఏ విధంగా చెప్పగలిగాడో నాసా వారికి అంతుచిక్కడం లేదు. ఎటువంటి టెలిస్కోపులు ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగాలిగారో ఆలోచించండి. కేవలం వాళ్ళ తప్పశ్శక్తి, జ్ఞ్యాన నేత్రంతో చూడగలిగారు. హిందూమతం గొప్పతనం అది. 

ఈ పోస్టులో తెలిపిన విషయాలుTelugu People నుండి సేకరించినవి .

మన సంస్కృతి


గృహస్తు ధర్మాలను పాటిస్తే చాలు, సత్ఫలితాలన్నీ వాటంతట అవే చేకూరుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. భర్తకు అనుకులవతి అయిన భార్య దొరకడం ఒక మహా భాగ్యం. గృహస్తు విజయం అతని భార్యపైనే ఆధారపడి ఉంటుంది. మంచి భార్య ఉన్నవాడు ఎంతటి ఆపదనైనా సులభంగా దాటగలడు.

 మహాభారతం ప్రకారం ధర్మపత్ని-- ధర్మార్ధ కామ సాధనకు ఉపకరణం, గృహనీతి విద్యకు నిలయం, సత్ప్రవర్తన నేర్పే గురువు, వంశ అభివృద్ధికి మూలం, సద్గతికి ఊతం--ఇవన్ని పురుషులు గ్రహించాలి.

గృహస్తు- గృహిణి సహాయంతోనే అతిథులను సంతోశాపెత్తగాలుగుతున్నాడు. ఆశ్రమ ధర్మాలేన్ని ఉన్నా, గృహస్త ఆశ్రమం తో ఏదీ సమానం కాదు. భార్యతో పరితృప్తి చందే గృహస్తు అశ్వమేధ ఫలాని పొందగలడు. ఏ ఇతర ఆశ్రమమూ కూడా, గృహస్తాశ్రమం లో పదహారో వంతు కుడా కాదు.

మంచి భార్య వల్ల భర్తకు ధర్మార్ధ సుఖాలు కలుగుతాయి. అధర్మంగా ప్రవర్తించే భార్యలను అసురి, పైశాచి, రాక్షసి అనే పేర్లతో సనాతన సంస్కృతీ ఈసడించింది. అటువంటి వారి వాళ్ళ వంశ నాశనం సంభవిస్తుంది.

భర్త అభిప్రాయాన్ని అనుసరించేది, సుగుణవతి, సంతానవతి అయిన భార్యను అవమానించే భర్తకు సద్గతులు ఉండవు అని శాస్త్ర వచనం. ధర్మపత్ని యెడల ప్రేమ, గౌరవాన్ని చూపటం భర్త యొక్క ప్రథమ కర్తవ్యమ్.

ఆధునికులు సైతం ఆచరించవలసిన సనాతన ధర్మం ఇది.
 ఈ పోస్టు నేను స్వంతంగా తయారు చేసినది కాదు . ఫేసుబుక్ నుండి సేకరించినది . మన తెలుగు మన సంస్కృతి అను ఫేసుబుక్ పేజీలో చాలా చక్కటి వివరణ ఉన్నది దాని లింకు దిగువన ఇస్తున్నాను

2013-12-26

బొట్టు ప్రాముఖ్యత

భారతీయ సంప్రదాయములో హిందువులు బొట్టును ధరించడం అనాదిగా వస్తున్న ఆచారము . బొట్టు ధరించుట వలన తేజస్సు పెరుగుతుంది . ముఖ్యంగా స్త్రీలు బొట్టును ధరించుట వలన ముఖము నందు తేజస్సు పెరగడమే కాకుండా అందము తో పాటు లక్ష్మీ కళ  వస్తుంది .ఐశ్వర్యము కలుగుతుంది .

 బొట్టును దరించడానికి ఉపయోగించే కుంకుమ సహజ సిద్దంగా తయారు చేసినది అయి ఉండాలి . సహజ సిద్దంగా తయారు చేసే కుంకుమ లో పసుపును వాడతారు . దీని వలన ముఖరోగాలు , నశించడం జరుగుతుంది . జ్ఞాన నేత్రం పై కుంకుమను ధరించడం కంటి చూపు బాగు పడుతుంది . ముఖపై మొటిమలు మొదలగు వ్యాధులను నయం చేస్తుంది .

 పసుపు యొక్క ప్రాముఖ్యతను గురించి, పసుపును వాడడం వలన కలిగే లాభాలను గురించి  సైంటిస్టులు చాలా సందర్భాలలో చెప్పుచునే ఉన్నారు . పసుపు యాంటి బయాటిక్ గా ఉపయోగ పడుతుంది . అందుకనే ఏమో ఈ విషయాన్ని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు . బొట్టును ధరించడం ఆచారమని తెలియ పరచారు . ప్రస్తుతము ఈ కాలములో ప్యాషన్ కొరకు  మెహంది బొట్టు బిళ్ళలు , ప్లాస్టిక్ బొట్లు వాడుచున్నారు . దీనివలన అందం వస్తుంది . గానీ ముఖ రోగాలు నశించవు.

Number 8

8 సంఖ్య : ఈ సంఖ్యకు ఉన్న విశిష్టత చాలా బలమైనది . అష్ట లక్ష్మీ స్వరూపము . అష్ట వస్తువులు , అష్ట సిద్ధులు , అష్ట ఐశ్వర్యములు మొదలగు వాటికి చైతన్యాత్మకముగా , శక్తి స్వరూపిణి అయిన దుర్గా స్వరూపమే ఈ 8 వ సంఖ్య .దుర్గాష్టమిని తలుచుకుంటే ఈ ఎనిమిదవ సంఖ్యా విశిష్టత ఏమిటో అర్ధము అవుతుంది . శ్రీ కృష్ణ పరమాత్మ కూడా అష్టమి (8 ) నాడే జన్మించాడు . ఈ సంఖ్యకు సంబంధించిన వాడు శని . ఇతడు సూర్య పుత్రుడు . ఈ ఎనిమిదవ సంఖ్యకు సంబంధించిన వారు ఎంత విశిష్టత కలిగి ఉంటారో తెలుసుకుందాము ?

సూర్యుడు ఇతడు కనిపిస్తే లోకమంతా చీకటి ఉండదు . అతని పుత్రుడు అయిన శని కనిపిస్తే జీవితము అంతా చీకటి మయమే . . అంతటి భయంకరమైన శని గ్రహము యోగించిందంటే మిగతా ఏ గ్రహముల వలన కలగనంత మేలు కలుగ జేస్తాడు . ఇతని వలన యోగము కలిగితే మరి ఏ ఇతర గ్రహములు అంతటి యోగమును ఇవ్వలేవు . సకల శుభ కారకుడైన గురు గ్రహము కన్నా మిన్నగా ఈ శని గ్రహము యోగించ గలదు . అంతటి శక్తి సామర్ద్యములు గల శని గ్రహము 8 వ సంఖ్యకు ఆధిపత్యము వహించును .

8 17 26 తేదీలలో పుట్టిన వారి లక్కీ నెంబరు 8 . వీరు నీతి నియమములు కలిగి ఉంటారు . తొందరపాటు ఉండదు . నిదానముగా పని చేస్తారు . మనో నిబ్బరము కలిగిన వారు . వీరు బద్దకమును విడచి పెట్టవలెను . ప్రశాంతత అలవాటు చేసుకోవాలి . వీరు ఏ విషయములో నైన దీర్గాకాలిక ప్రయోజనము కొరకు ఆలోచిస్తారు . ఎంతటి కష్టమైన పనులనైనా శ్రమపడి సాధించగలరు . చిరాకు ఉండదు .

స్వయంకృషి ని నమ్ముకుంటారు . వీరు పుట్టకతో భాగ్య వంతులు కారు . అనేక కష్టములకు ఓర్చి జీవితమున పైకి రాగలరు. హంగు ఆర్భాటములన్న ఇష్టము ఉండదు . విద్యా విషయములో ఆటంకములు , పేదరికము , కుటుంబ భాద్యతల వలన నష్టము కలుగును . ప్రజా సేవ చేయుటలో ముందుంటారు . సామాన్య జీవితమును గడుపుతారు .

వీరికి 15 17 24 26 35 సంవత్సరములలో జీవితమున అనుకోని మార్పులు సంభవించును . ఆరోగ్య విషయమున జాగ్రత్త వహించుట మంచిది . 37 సంవత్సరము నుండి యోగదశ ప్రారంభము అవుతుంది . 44 సంవత్సరము నుండి సంఘములో పలుకుబడి పెరగడము , గౌరవ మర్యాదలు సంపాదించడం జరుగుతుంది .దక్షిణ , ఆగ్నేయ దిశల యందు చేయు ప్రయత్నములు తప్పక ఫలించును .


వీరిని అర్ధం చేసుకుని మసలుకొనే జీవిత భాగస్వామి లభించును . దాంపత్య జీవితము బావుంటుంది . ప్రేమ వ్యవహారముల వలన మోసము జరుగును . వీరిలో చాలా మంది చిన్న స్థాయిలో జీవితమును ప్రారంభించి ఉన్నత స్థితికి చేరుకుంటారు . దీర్ఘకాలం పాటు కష్టపడి అభివృద్ధి లోకి వస్తారు . శని వారం వీరికి కలసి వస్తుంది . 13 22 31 తేదీలు వీరికి లాభాన్ని చేకూరుస్తాయి .  మయూర నీలమును గానీ , ఇంద్ర నీలమును గానీ ఉంగరములో చేయించి ధరించిన అదృష్టము కలుగును . 

2013-12-25

Number 7

7 వ సంఖ్య కేతువు : సప్త ఋషులు , సప్త సముద్రములు , ఏడు ఖండాలు , సప్త ద్వీపములు  మొదలగు వాటికి కారకత్వము వహించునది 7 వ సంఖ్య.  దీనికి  అధిపతి . కేతువు . ఈ కేతువు చంద్రునికి సంబంధించినదిగా తెలుసుకోవాలి . 2 7 Negative and Positive  ఈ రెండు ఫలితాలను కలుగ చేయును . 

 7 16 25 తేదీలలో పుట్టిన వారి కి కేతువు అను గ్రహము ఆధిపత్యము వహించును . వీరు 7 వ సంఖ్యకు చెందినవారు. వీరు గొప్ప గొప్ప ఆశయములను పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు .సహజముగా వీరికి Life లో సుఖ దుఖాలు , కష్ట నస్తములు వస్తూ పోతూ ఉంటాయి . బ్రతుకంతా ఎగుడు దిగుడు గా ఉంటుంది .

కష్టములు ఎదురైనా బెదరి పోకుండా ఎదురొడ్డి పోరాడే మనస్తత్వము కలిగి ఉంటారు . ఆధ్యాత్మిక చింతన , దైవము పట్ల నమ్మకము కలిగి ఉంటారు . వీరి వ్యవహారిక శైలి ప్రత్యేకత కలిగి ఉంటుంది . క్రమ శిక్షణ కలిగిన , ఆదర్శ భావాలు కలిగిన జీవనము గడుపుతారు . ఇతరులకు ఆదర్శప్రాయులై ఉంటారు . ఎదుటి వారిని ఆకట్టుకోగల జనాకర్షణ శక్తి కలిగి ఉందురు . మంచి మాట నేర్పరి తనము కలిగి ఉందురు . సమస్యలను చాకచక్యముగా పరిష్కరించగలరు .

ముఖమునందు తేజస్సు కలిగి ఉందురు . శాంత స్వభావులు , గంభీరమైన హృదయము , జ్ఞాపక శక్తి అధికముగా ఉంటుంది . సూక్ష్మమైన ఆలోచనా శక్తి కలవారు . విషయ పరిజ్ఞానము కలవారు .విద్యా విఘ్నములు కలుగుటకు అవకాశము ఉన్నది . జరగబోవు పరిణామములను ముందుగా ఊహించి చెప్పగలరు . వీరు వ్యాపారము చేపట్టినచో నష్టపోయే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి . లాభాలే ఎక్కువ .
ఆరోగ్య విషయమున జాగ్రత్త వహించుట అవసరము . పశ్చిమ , ఉత్తర దిశల యందు వీరికి కలసి వచ్చును .

 చర్మ సంభంద వ్యాధులు , దగ్గు , జలుబు , మొదలగు జబ్బులతో భాధ పడతారు . వీరికి 34 సంవత్సరము నుండి యోగదాయక మైన అభివృద్ది కలుగును .  42 సంవత్సరము నుండి స్థిరాస్తి అభివృద్ధి చెందుట , గౌరవ అధికారములు పెరుగును . Sunday and Monday వీరికి కలసి వచ్చును .

అలాగే  2 11 13 20 22 25 7 16 తేదీలు , ఆది సోమా వారములతో కూడి పైన తెలిపిన తేదీలలో వీరికి బాగా కలసి వస్తుంది . ఈ దినములలో ఏ పని చేపట్టిన అనుకూలముగా ఉంటుంది . దైవారాధనలలో గణపతిని , దుర్గామాతను ప్రత్యేకించి సేవించుట ఆరాధించుట వలన మీకు కలుగు కష్ట నష్టముల నుండి విముక్తి లభించును . దైవ శక్తి వెన్నంటి ఉండును .


 7 16 25 34 43 52 61 సంవత్సరములు వీరి జీవియమున బహు యోగాదాయకముగా ఉండును . Dark colors మీకు కలసిరావు . Light colors white , cream , Light rose color  ,sky color , light Yellow color మీకు అనుకూలమైనవి . వైడూర్యము మీకు అనుకూలమైన రత్నము దీనిని ధరించుట శ్రేయోదాయకము .

2013-12-15

Number 6

6 వ సంఖ్య Venus శుక్రుడు : ఆరు ఋతువులు , షట్కర్మలు , షడ్గుణములు , షడ్చాస్త్రములు , షడ్రసములు , షడ్రుచులు , షడైశ్వర్యములు మొదలగు వాటికి కారకుడైన శుక్రుడు 6 వ సంఖ్యకు అధిపతి .ఇతడు బ్రాహ్మణ గ్రహము మరియు స్త్రీ గ్రహము .శుభుడు , కళత్ర అధిపతి .6 15 24 తేదీలలో పుట్టిన వారు మరియు ఏప్రియల్ 20 నుండి మే 20 తేదీలలోపల , సెప్టెంబరు 11 నుండి అక్టోబర్ 27 తేదీల లోపల జన్మించిన వారు 6 వ సంఖ్యా ప్రభావములో ఉంటారు . వీరిపై శుక్ర గ్రహ ప్రభావము అధికముగా ఉంటుంది .

ఇందు జన్మించిన వారు సంగీత , సరస సల్లాపములు , వాహనములు , భోగములు , స్త్రీ సౌఖ్యము , శయ్యా సౌఖ్యములు కలిగి ఉంటారు .ప్రతి ఫలాపేక్ష లేకుండా ఇతరులకు సహాయ పడతారు .ప్రేమ వ్యవహారములలో జయము కలుగును . నిశితమైన చూపును కలిగి ఇతరులను ఇట్టే ఆకర్షించగల రూపము కలిగి ఉందురు .అలసట , నీరసను , నరముల బలహీనత , మేహ వ్యాధుల వంటి అనారోగ్యము కలిగి ఉందురు .

వీరికి తమ స్వస్థలము నుండి పడమట నైరుతి దిశలలో ప్రయాణించుట , ఆయా ప్రాంతములకు వలస పోవుట వలన లాభమును పొందుతారు . వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులు కౌంటరు నందు పడమట దిశను చూస్తూ కూర్చుని పనిచేసిన వృత్తి యందు వృద్ధి కలుగును .లక్ష్మి దేవిని , దుర్గా మాతను పూజించుట , సహస్ర నామ పారాయణము చేయుట వలన మేలు కలుగును. 

ఆత్మస్తుతి పనికిరాదు .బందువులు మరియు స్నేహితులతో సత్సంబంధములు కలిగి ఉంటారు .వీరు హుందాగా , దర్పంగా , గంబీరమైన మనస్సు కలిగి ఉందురు .కల్మషము లేని హృదయము కలవారు . 15  24 ౩౩ సంవత్సరములలో విద్యాభి వృద్ది కలుగును ౩౩ సంవత్సరము యోగదశ ప్రారంభము అవుతుంది .స్థిరాస్తి వృద్ధి చెందును . సకల శోభితమైన గృహము ప్రాప్తించును. అందమును ఆస్వాదింతురు . 

42 సంవత్సరములో గౌరవము పెరగడము , అధికారము తో కూడిన పదవిని పొందడము జరుగుతుంది . 38 వ సంవత్సరములో ముఖ్యమైన మార్పులు కలుగును . మంగళ , గురు శుక్ర వారములు కలసి వస్తాయి . వంశ పారంపర్య ఆస్తులే కాకుండా స్వార్జితపు ఆస్తులు కూడా బాగా సంపాదిస్తారు .


సంతాన విషయములో వారి బాగోగుల విషయములో క్రమ శిక్షణతో కూడిన పద్దతులను అవలబించాలి . లేని యెడల సంతానము వలన కొన్ని ఇబ్బందులు ఎదురుకాగలవు.  వీరి మనస్సు క్షణికావేశం నకు లోను కాగలదు . తద్వారా Illegal Contacts , Bad Habits కు తొందరగా అలవాటు పడతారు . జాగ్రత్త అవసరము . ప్రతి నెలలోనూ 12 15 18 21 24 27 30 3 6 9 And 6 15 24 తేదీలు అనుకూలముగా యోగ ప్రదంగా ఉంటాయి .       

2013-12-14

Number 5

5 వ సంఖ్య బుధుడు   : పంచేంద్రియములు , సృష్టికి కారణమైన భూమి , నీరు , అగ్ని , గాలి , నీరు మొదలగు పంచ భూతములు ఆధారమైన పంచ భూతములకు 5 వ సంఖ్యా సంబంధములో ఉంటాయి . ఈ 5 వ సంఖ్యకు బుధుడు అధిపతి . ఇతడు వైశ్య గ్రహము అనగా వైశ్య జాతికి చెందినవాడు . వైశ్య జాతి అంతే వ్యాపార , వాణిజ్య లక్షణములను కలిగి ఉంటాడు.

 ఈ 5 వ సంఖ్యకు చెందినవారు ఏ ఇంట జన్మించిన వారైనా సరే పుట్టుకతోనే  వ్యాపార లక్షణములు కలిగి ఉంటారు .5 , 14 , 23 తేదీలలో జన్మించిన వారు జనవరి 10 నుండి జూలై 1౩ తేదీల మధ్య పుట్టిన వారిపై బుధ గ్రహ ప్రభావము ఎక్కువగా ఉంటుంది .

వీరు మంచి ఆరోగ్యవంతులు . బుధుడు మే 21 నుండి సెప్టెంబర్ 27 తేదీల మధ్య విశేష బలము కలిగి ఉండును . ఈ మధ్య కాలములో 5 14 23 తేదీలలో జన్మించిన వారికి మంచి యోగమును ప్రసాదించ గలడు . వీరికి స్థిరత్వము తక్కువ . ప్రయాణము అంటే ఇష్టము . అందరితో కలసి మెలసి ఉంటారు . ఎదుటి వారి మనసు గుర్తెరిగి మసలుకుంటారు . ఇతరులను అతి సులభంగా వశపరచు కొందురు . మంచి బుద్ది కుశలత గలవారు . హాస్య సంభాషణ చతురులు .వీరు సామాన్య ఎత్తు కలిగి మధ్యమంగా ఉంటారు . బుధ శుక్రవారాలు కలసి వస్తాయి . బుధవారము అధికముగా అనుకూలిస్తుంది .వీరు ఇతరుల చేతిలో తొందరగా మోసపోవుదురు . వీరికి రెండు మూడు రకాలుగా ధన సంపాదన కలిగి ఉందురు

స్వయంకృషితో అభివృద్ది లోకి వస్తారు . వీరి జీవితమున అనేక మార్పులు సంభవించును.  కోరికలు ఎక్కువ వ్యాపార వ్యవహారములను చాలా నేర్పుగా చక్కబెట్టగలరు . మోసములు , దగా చేయు వారిని దరి చేరకుండా జాగ్రత్త పడవలెను . 14 28 32 41 50 62 71 సంవత్సరములు చాలా అనుకూలముగా ఉండును . 23 సంవత్సరములో స్థిరత్వము కలుగును . 35 వ సంవత్సరము మంచి స్థానము , Promotion , లభించును . బూడిద రంగు వీరికి Lucky Color . మెరిసే వస్తువులు ధరించుట మంచిది . Diamond , తెలుపు రంగు రాళ్ళు ధరించిన మేలు కలుగును . Silver ( వెండి ) వస్తువులు వాడటం మంచిది . వెండి కంచములో భుజించడం వలన చాలా లాభాలు ఉంటాయి .దీనివలన నరముల బలహీనత , శరీర దుర్బలత్వము కలుగదు . ఆరోగ్యము మెరుగు పడుతుంది .  

వంశ పారంపర్య గుణాలు వీరిలో ఉంటాయి .స్వార్జితముగా ధనమును కూడపెడతారు . వీరిలో చాలా మందికి తక్కువ వయసులోనే వివాహము జరుగుతుంది . విద్య పట్ల మమకారము ఎక్కువ . విద్యాధికులు , చదువుకున్న వారిపట్ల గౌరవమును ప్రదర్శింతురు . తీర్ధ యాత్రలు చేయుట వీరికి ఇష్టము .చిరకాలము పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు .

2013-12-12

Number 4


4 వ సంఖ్య రాహువు Rahuvu  : నాలుగు దిక్కులు , నాలుగు వేదాలు , ధర్మ అర్ధ కామ మోక్షాలు , సామ దాన భేద దండోపాయములు, బాల్యము , కౌమారము , యవ్వనము , వృద్ధాప్యము ఇలా ఉన్నవన్నీ నాలుగు సంఖ్య ఆధీనములో ఉంటాయి . వీటికి రాహు గ్రహము ఆధిపత్యము వహించును . పైన తెలిపిన వాటన్నింటికి రాహువే ఆధార భూతుడై ఉంటాడు .

 ఈ రాహువు ఉచ్చ మిత్ర క్షేత్రముల యందు , జాతక రీత్యా ౩  , 6 స్థానములలో ఉన్నప్పుడు బలవంతుడు . మరియు 4 , 1౩ , 22 , ౩1 తేదీలలో పుట్టిన వారందరూ 4 వ సంఖ్యకు చెందినవారు . ఈ 4 వ సంఖ్యకు చెందినవారు ఇతరులతో ఏకీభవించక వ్యతిరేఖ ప్రవర్తన కలిగి ఉంటారు .శాంతము , సహనము వీరికి తక్కువగా ఉంటుంది . శత్రువులు అధికముగా ఉంటారు .

ఉద్రేక స్వభావము కలిగి ఉందురు . వృధాగా కాలమును గడిపేస్తారు . స్త్రీ వ్యామోహం ఎక్కువ . ధీమా , అహంకారము , కోపం ఎక్కువగా ఉంటుంది . ఎవరికీ లొంగరు . మొండివారు . దృడత్వము కలవారు . తగినంత ఎత్తు కలిగి ఉందురు . విశాలమైన నుదురు , మంచి కనుబొమ్మలు కలిగి ఉంటారు . వీరి బాల్యమున అనేక కష్టములను ఎదుర్కొందురు. యవ్వనము లోకి ప్రవేశించే సమయము నుండి లౌకిక జ్ఞానము , మంచి చెడు భేదాభిప్రాయములను తెలుసుకొని నడచు కొందురు . కానీ పాత సంప్రదాయములను , ఆచార వ్యవహారములను నమ్మరు . వాటిని వ్యతిరేకిన్తురు . సంఘములో అనేక మార్పులు తేవాలని చూతురు . సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టామనే గొప్పలు చెప్పుకుంటారు .

English భాషలో మంచి పట్టు సాధిస్తారు . పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్లు తాము పుట్టి పెరిగిన ప్రదేశములలో ఉన్న ఆచారములు , సంప్రదాయముల కన్నా విదేశీ అలవాట్లు , పద్దతులపై మోజు ఎక్కువ . వీరిలో ఎక్కువ మంది ప్రేమికులు లేక Love Marriage చేసుకునే వారే ఉంటారు .కానీ వైవాహిక జీవితము కొంత వరకు అస్తవ్యస్తం గా ఉంటుంది. భార్యాభర్త మధ్య ఎడబాటు రావడమో లేదా ఇరువురులో ఎవరో ఒకరికి అనారోగ్యము కలగడమో జరుగుతుంది . తద్వారా దాంపత్య జీవితము కొంత అసంతృప్తిగా ఉంటుంది . ఆకస్మిక ధనలాభం కలుగును .

ఈ రాహువు Horoscope ప్రకారము జన్మ లగ్నము నుండి 1 లేక 7 స్థానములో ఉన్నప్పుడు విధవా సంపర్కము గానీ లేక అన్య జాతికి చెందిన వారితో గానీ వివాహము జరుగును . అట్లు లేని యెడల అక్రమ సంబంధములు కలిగి ఉంటారు. వీరికి June 21 to July 27 Dates మధ్య అనుకూలముగా ఉంటుంది .విద్యాభ్యాస సమయములో కొంత ఒడుదుడుకులు కలుగును . మొండిగా వ్యవహరించుట మంచిది కాదు . 31 Years నుండి యోగదశ ప్రారంభమగును . డబ్బును వృధాగా ఖర్చు చేసే అలవాటు ఉంటుంది . Prestige Issue తో Waste ఖర్చు పెడతారు . 1 2 7 8 సంఖ్యలు గల వారితో మంచి ఆదరాభిమానాలు , నమ్మకముతో ఉంటారు .

ధన సంపాదన యందు మెళకువలు తెలిసినవారు . ఏకధాటిగా ఎంతసేపయినా ఉపన్యాసము చేయగలరు . వాగ్దాటి బాగుంటుంది . కన్న తల్లిదండ్రుల కన్నా అత్తవారు వారి తరపు బంధువుల యెడల మర్యాదను ప్రదర్శిస్తారు .

1 4 10 13 19 22 26 31 35 37 40 44 46 49 53 55 58 62 64 73 సంవత్సరములు వీరికి అనుకూలమైనవి .
18 19 22 25 28 37 40 44 సంవత్సరము లలో జీవితమున అనుకోని మార్పులు కలిగి ఉన్నత అభివృద్ధి , లాభములు కలుగును .     

2013-12-10

Number 3


3 వ సంఖ్య గురుడు  Jupiter : బ్రహ్మ విష్ణు మహేశ్వరులు . సృష్టి , స్థితి లయలు Past , Present and future , సత్వ రజస్ తమో గుణములు ఇవన్ని మూడవ Number లో ఇమిడి ఉన్నవి . వీటికి Jupiter బృహస్పతి అధిపతి అయి ఉన్నాడు . 3 , 12 , 21 , 30 తేదీలలో పుట్టిన వారికి Lucky Number ౩ వీరిపై గురు గ్రహము యొక్క అనుగ్రహము ఉంటుంది .

Horoscope ప్రకారము కర్కాటక రాశిలో గురుడు స్థితి పొంది ఉన్నప్పుడు జన్మించిన వారిపై  ఇతడు బలము కలిగి ఉండును. మిత్ర క్షేత్రములలో , కోణముల యందు బలమైన వాడు . చేతి యందు Index Finger క్రింది భాగము గురుస్థానము . ఇది ఎత్తుగా ఉబ్బెత్తుగా ఉన్నవారు సుఖముగా ఆనందమైన జీవనము సాగింతురు . జ్ఞానము కలవారు . మంచి హోదా గౌరవ ప్రదమైన హుందా కలిగిన జీవితమును సాగింతురు .

ముఖము నందు దైవత్వము ఉండును . అన్యాయపు పనులు చేయరు . మనోబలం , బుద్ది బలము కలవారు , వీరు సలహాదారులుగా, Teachers , Speakes, Astrologers మరియు మతభోధకులు , ప్రచార కర్తలుగా స్థిర పడతారు . స్వతంత్ర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి . స్వతంత్ర జీవనము గడుపుటకు ఇష్ట పడతారు . మంచి బుద్ది కుశలత కలవారు . వీరు గౌరవము అధికారము కల ఉద్యోగములలో స్థిరపడతారు . అట్లు గాకున్న ఉన్నత స్థితి కలిగిన పదవులను అధిరోహిస్తారు . దైవ చింతన కలవారు . గొప్ప గొప్ప వాళ్ళతో Friendship చేస్తారు .
House Property , Land Property కలిగి ఉంటారు. వీరికి కనక పుష్య రాగము Lucky Stone దీనిని ఉంగరములో చేయించి ధరించిన అన్ని విధముల అనుకూలించును .

Favorable Days : Sunday, Saturday, Monday
Favorable Dates : 3 ,12, 21, 30, and  1, 2 , 7 పైన తెలిపిన తేదీలలో ఆ వారములు కలసి వచ్చిన రోజులు వీరికి అత్యంత అనుకూలమైనవి .సంవత్సర సంఖ్యను కలుపగా 1, 2, 4, 7, 8వచ్చిన సంఖ్యలు వీరికి చాలా అనుకూలముగా ఉంటాయి .ఉదా : రాబోయే సంవత్సరము 2014 మొత్తం సమిష్టి సంఖ్య  7 అవుతుంది . ఈ సంఖ్య చాలా అనుకూలతను కలిగిస్తుంది . ఇలాంటి అనుకూల సంఖ్యలు వచ్చిన సంవత్సరములలో ఉద్యోగము నందు ప్రమోషన్స్ ,గొప్ప వాళ్ళ పరిచయాలు , వివాహాది శుభ కార్యములు జరగడం , వ్యాపార రంగములో ఉన్నవారికి అభివృద్ధి మొదలగునవి జరుగును .

 వీరు సంపాదిస్తారు . మంచి ఆదాయము కలిగి ఉంటారు . కానీ ఎంత ఆదాయము వస్తుందో ఖర్చులు కూడా అలాగే ఉంటాయి . ధనమును నిల్వ చేయలేరు .అన్యాయాన్ని సహించలేరు . కోపము అధికము . నీతి నిజాయితీ కలిగి ఉత్తమ భావాలను కలిగి ఉంటారు. వీరు చూడటానికి అమాయకముగా కన్పిస్తారు . కానీ బహు గడసరులు వయసు గడిచే కొలది సుఖ పడతారు . మాతృసౌఖ్యం , సోదర సౌఖ్యం కలిగి ఉందురు. కానీ అన్యోన్యత తక్కువ . వంశాచారాలు , ఆచార సంప్రదాయాలకు విలువ ఇస్తారు వీరికి సాధారణ ఆరోగ్యము ఉంటుంది . కానీ మనసు మాత్రము ధృడంగా ఉంటుంది .
12, 15 , 21 , 27 , 30 , 33 , 36 , 39 , 42 , 46 , 49 , 54 , 60 , 63 , సంవత్సరములు కలసి వస్తాయి.     

2013-12-08

Number 2

2 వ సంఖ్య Moon  : పరమాత్మలో జీవాత్మ ఇమిడి ఉన్నట్లు చంద్రుడు సుఖ దుఃఖములకు , శీతోష్ణములకు , రాత్రి పగలు రెండింటికి కారకుడుగా 2 వ స్థానాన్ని పొందినాడు . 2 వ తేదీన పుట్టిన వారికి అధిపతి చంద్రుడు.  ఇతడు స్త్రీ గ్రహముగా నిర్ణయించినారు. కానీ 1 వ సంఖ్య వారికి 2 వ సంఖ్య వారికి ఏవిధమైన పోలిక లేదనే చెప్పాలి . కానీ ఒకరికొకరు విశ్వాసం , అనురాగం , ప్రేమ , అభిమానములను కలిగి ఉంటారు .

 చంద్రునికి వృషభరాశి ఉచ్చారాశి . మిత్ర క్షేత్రముల యందును , శుభ క్షేత్రములలోనూ మంచి ఫలితములను ఇచ్చును . జూన్ 20 నుండి జూలై 27 తేదీల మధ్య విశేష బలము కలిగి ఉంటాడు . ఈ తేదీల మధ్య జన్మించిన వారికి చంద్రుని వలన విశేషమైన యోగము కలుగును .2 , 11 , 20 , 29 తేదీలలో పుట్టిన వారికి చంద్రుడే అధిపతి .
Moon స్వభావము వలన వీరు చపలచిత్తులు, స్థిరత్వం తక్కువ . గొప్ప ఆలోచనా శక్తిని కలిగి ఉంటారు . కళల యందు అభిమానము అధికము .

 భోగముల యందు ఆసక్తి , ప్రేమ , దయ వీరిలో అధికముగా ఉంటుంది . మంచి ప్రవర్తన కలిగి ఉంటారు . సదా సంచార ప్రియులు .విలాసములకు అధికముగా ఖర్చు పెడతారు . దైవము పట్ల నమ్మకము ఎక్కువ . వీరికి దైవశక్తి తోడుంటుంది . బుద్ది కుశలత కలవారు . తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రతి ఫలాన్ని ఆశిస్తారు .
ప్రతి పనిని పూర్తిగా చేయరు . మధ్యలో విడచి పెడతారు . వీరికి ఆరంభ శూరత్వము ఎక్కువ . పని ప్రారంభించినపుడు ఉన్న పట్టుదల తరువాత ఉండదు . క్రమేపీ తగ్గి పోతుంది   ఇరుగు పొరుగు వారితో , మరియు ఇతరులతో మంచి సంబంధములు ఏర్పాటు చేసుకొందురు . వీరికి ప్రతి నెలలోనూ 2 , 11 , 20 , 29 తేదీలు అనుకూలముగా ఉంటాయి . ఈ తేదీలలో కొత్త పనులు , వ్యాపారాలు ప్రారంభించిన మేలు కలుగును . ఆది సోమ శుక్ర వారములు కలసి వచ్చును .

వీరికి విశ్రాంతి ఉండదు . ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో ఒక పనిలో నిమగ్నులై ఉంటారు . Life Partner వలన Property కలసి వచ్చును . వీరిది తెలియని సంపాదన . ఒకప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారు . మరలా అదోగతికి పొందే అవకాశము ఉంటుంది ,. ఈ సమయములో చాలా జాగ్రత్త అవసరము . వీరికి కోపము వచ్చిందంటే మంచి చెడు అని తేడా చూడరు . తన కోపమే తన శత్రువు అను విధంగా వీరి కోపము వలన Loses ఏర్పడతాయి .అభిమాన వంతులు . వయసు పెరిగే కొద్ది బుద్ది సూక్ష్మత పెరుగును .

వీరికి అనుమానము ఎక్కువ . ఏ విషయమును  తొందరగా నమ్మరు . 1 వ తేదీన జన్మించిన వారితో స్నేహము చేయుట వలన వారు వీరికి మార్గ నిర్దేశనము చేయుటకు ఉపయోగ పడతారు . మంచి సలహాలను ఇచ్చి ప్రోత్సహించ గలరు . వీరికి వ్యభిచార లక్షణములు ఉండే అవకాశములు ఉన్నవి . రహస్యమైన పనులు చేయుదురు .శుచి శుభ్రత, మంచి వస్త్ర ధారణ వీరికి ఇష్టము . మనో నిగ్రహము చాలా తక్కువ . ఊహల్లో విహరిస్తూ ఉంటారు . విద్య సామాన్యము . అధిక మేధాశక్తి కలిగి ఉందురు . వీరు దాంపత్య జీవితములో చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ సర్దుకు పోతారు .వైవాహిక జీవితము సుఖప్రదంగా ఉంటుంది . భార్య భర్త ఇరువురు 2 వ సంఖ్యకు సంబంధించిన వారై ఉంటే మొండిగా ప్రవర్తిస్తారు . 

వీరికి  Red , Black , Rose Colors  పనికి రావు .  White,  Green Favorable Colors
Moon Stone , Emerald and Green is favorable stones
11 , 14 , 20 , 23,  32 , 35 , 41, 44 , 53 , 62 71 సంవత్సరములు అనుకూలమైనవి .
14th  లో విద్యాభివృద్ది , 23rd  year  Life settlement

44th year  Gain Property , Lands , House. Gold Etc......     

2013-12-07

Number 1

1వ సంఖ్య సూర్యుడు : నిత్య సనాతనమైన పరబ్రహ్మ స్వరూపము ఒక్కటే . అట్టి దానిని ఆధారంగా చేసుకొని వెలుగు చున్నాడు సూర్యుడు . అతడు లేనిదే  జీవరాశికి చేతనత్వము లేదు . ప్రపంచము అంతా చరాచర స్వరూపాల్లో ఒకటిగా ఇమిడి యున్నాడు . అనేకాన్ని ఏకం చేసేవాడు సూర్యుడు . ఒకటవ తేదీన జన్మించిన వారికి ఇతడు గ్రహాధిపతి . లోక భాంధవుడు . సింహ రాశి యందు , మేషరాశి యందు మిత్ర క్షేత్రములైన కర్కాటక , వృశ్చిక , ధనుస్సు , మీనరాశుల యందు బలవంతుడు . మధ్యాహ్న సమయము నందు జన్మించిన వారి యందు అధిక బలము కలిగి ఉంటాడు .

ఒకటవ సంఖ్య యందు పుట్టినవారు ప్రధానంగా బుద్ది సూక్ష్మత , ఆత్మస్థైర్యం , పనుల యందు అధిక పట్టుదల , ధైర్య సాహసాలు కలిగి ప్రతి పనిని సాధింతురు . స్వయం కృషి వలన అభివృద్ధిలోకి వస్తారు . చురుకైన సొగసైన చూపులు కలిగి ఆకర్షింప బడతారు. ఏ పనినైననూ సాధించగల సమర్ధులు . వీరు చేయు పనులు అందరికి ఆదర్శంగా ఉంటాయి . వీరికి self Confidence ఎక్కువగా ఉంటుంది .వీరు పూర్వీకుల Property, మరియు స్వార్జిత సంపాదన కలిగి ఉంటారు .

Financial Trouble అనే సమస్య వీరికి ఉండదు . మంచి Educate అయి ఉంటారు . గ్రంధ రచనలు చేయగలరు . భూమి , గృహ వసతులు కలిగి ఉందురు . అమిత ఆశలను కలిగిన వారు . సౌశీల్యమైన అనుకూలమైన Life Partner లభించును . రెండు మూడు Languages వీరికి తెలిసి ఉండును . అందు ప్రవీణులు కాగలరు . మంచి ప్రవర్తన , తెలివి తేటలు ఆధ్యాత్మిక శక్తి కలిగి రాణింతురు . రవిదశ బాగా యోగించును . వీరికి అంతః శత్రువులు ఉంటారు . కానీ వారి వలన వీరికి ఏమీ ఇబ్బందులు కలుగవు . వీరి ఎదుట వారు నిలువలేరు . దొంగ దెబ్బ తీయుటకు అవకాశము కొరకు కాచుకొని ఉంటారు . కావును వారి పట్ల అతి జాగ్రత్తగా ఉండాలి . పలుకుబడి హోదా కలిగి ఉంటారు .

ఆశయములు సిద్దించుట కొరకు Money ఖర్చు చేస్తారు . 10 వ తేదీన పుట్టిన వారికి అనుకూలతలు , ప్రతికూలతలు సమానముగా ఉంటాయి . వీరు అన్ని విషయములు తెలిసిన వారి వలే ఉంటారు .23 Years వరకు విలాస వంతమైన జీవితము గడుపుతారు . 28 Years తరువాత నుండి పరిస్థితులు అనుకూలించును . 33 Years లోపల జీవితములో ప్రధానమైన మార్పులు సంభవించును . ఆర్ధిక అభివృద్ది కలుగుతుంది . జీవితమున Settle అవుతారు . వీరు మాటల్లో ద్వంద్వ అర్ధము గోచరించును . ఎవరినీ లెక్క చేయరు . యుక్తవయస్సులో ఆస్తి నష్టము , కుటుంబ తగాదాలు ఏర్పడును .

15 To 24 years లోపు విద్య విఘ్నములు
13, 14 , 22 years లలో విద్యా లాభం
14, 19 , 22 , 23 , 31 Years విద్యలో జయాదిక్యతలు
21 , 26 , 34 Years Life Settlement

35 , 37 , 40 , 47 , 53 , 58 , 62 , 64 , 73 Years  Favorable Years    

2013-12-06

భార్గవ సిద్దాంత పంచాంగము

పూర్వము కాలమును ఘడియలలో లెక్కించేవారు.  క్రమేణా గంటలు , నిమిషములలో లెక్కించడం జరుగు చున్నది .ఒక ఘడియ అనగా 24 నిమిషములు  రెండున్నర ఘడియలు ఒక గంట . అరవై ఘడియలు ఒకరోజు అనగా ఇరవై నాలుగు గంటలు .

పూర్వము కాలమును గణించే పద్దతి ప్రకారము ప్రతి ఘడియకు ఒక ముహూర్తము చొప్పున లెక్కవేస్తూ చెప్పిన విధానమే భార్గవ సిద్దాంత పంచాంగము . ఈ పద్దతిలో సూర్యోదయము నుండి మొదలు కొని మరుసటి రోజు సూర్యోదయము వరకు ఈ పద్దతిని గణించడం జరిగినది . అయితే ప్రతి చోటా సూర్యోదయము ఒకే సమయములో జరుగుట లేదు . దేశము , మరియు ప్రాంతములను బట్టి సూర్యోదయ సమయము మారుచున్నది .

 కావున ఆయా ప్రాంతములలో సూర్యోదయము నుండి ప్రారంభించి ఈ సిద్దాంతమును అనుసరించాలి .
ఈ సిద్దాంతములో  ముప్పై ముహూర్తములు ఇవ్వడం జరిగినది . సూర్యోదయము నుండి మొదలు ముప్పై ముహూర్తములు వచ్చును . సూర్యాస్తమయము నుండి తిరిగి అవే లెక్కించు కోవాలి .
ఉదాహరణకు ఒక ప్రానతములో సూర్యోదయము ఉదయము ఆరు గంటలకు జరిగితే భార్గవ సిద్దాంతము ప్రకారము కలిగే ఫలితములు ఇలా ఉంటాయి .
గం . ని.
గం . ని .
ఆదివారం
సోమవారం
మంగళ వారం
బుధవారం
గురువారం
శుక్రవారం
శనివారం
06.00
06.24
లాభం
వివాదం
ధనలాభం
దుర్వార్త
ధనలాభం
కార్యజయం
కష్టం
06.24
06.48
ధనం
లాభం
సుఖం
మనోవ్యధ
కలహం
మిత్రలాభం
సుఖం
06.48
07.12
కలహం
క్షేమం
భయం
ధనలాభం
భయం
ధనలాభం
విరోధం
07.12
07.36
రోగం
ధనలాభం
కష్టము
కార్యజయం
శుభం
శుభం
ధనలాభం
07.36
08.00
చోరభయం
భూలాభం
జయం
భయం
కార్యసిద్ధి
విరోధం
జయం
08.00
08.24
శత్రు వృద్ది
ధననష్టం
సుఖం
సుఖం
కార్యజయం
జయం
కార్యజయం
08.24
08.48
కార్యసిద్ధి
కార్యసిద్ధి
సుఖం
సుఖం
ధనలాభం
హాని
కార్యలాభం
08.48
09.12
సుఖం
వస్తుప్రాప్తి
భయం
భీతి
లాభం
స్నేహం
సన్మానం
09.12
09.36
క్షేమం
ఇష్టసిద్ది
విరోధం
ధనలాభం
కలహం
అశుభం
కార్యహాని
09.36
10.00
మిత్రవృద్ది
సుఖం
మనోభయం
మిశ్రమఫలం
కార్యజయం
మిశ్రఫలం
అనారోగ్యం
10.00
10.24
కార్యభంగం
స్త్రీలాభం
సుఖం
కార్యసిద్ధి
వృద్దిలాభం
సౌఖ్యం
సౌఖ్యం
10.24
10.48
సుఖం
కార్యసాధన
కార్యహాని
మిశ్రమ
శుభం
ధనలాభం
సంతాపం
10.48
11.12
జయం
కార్యహాని
మిశ్రమం
శుభం
ధనలాభం
క్షేమం
భయం
11.12
11.36
కార్యసిద్ధి
వివాదం
భయం
లాభం
ఆరోగ్యం
కార్యసిద్ధి
మిత్రప్రాప్తి
11.36
12.00
కలహం
కార్యసిద్ధి
కష్టం
శుభం
నష్టం
భీతి
జయం
12.00
12.24
ఇష్టసిద్ది
ఇష్టలాభం
రోగపీడ
సౌఖ్యం
పనినష్టం
సుఖం
ధనలాభం
12.24
12.48
కార్యహాని
ధనలాభం
లాభం
ఫలసిద్ది
విరోధం
భయం
శుభం
12.48
01.12
జయం
కార్యజయం
కార్యసిద్ధి
క్షేమం
కార్యసిద్ధి
శుభం
మిశ్రమం
01.12
01.36
ఇష్టసిద్ది
శుభం
కార్యహాని
మిశ్రమం
బంధనం
సుఖహాని
కార్యసిద్ధి
01.36
02.00
సంతాపం
మిశ్రమం
ఉద్యోగలాభం
వివాదం
హాని
ధనవ్యయం
కార్యజయం
02.00
02.24
ధనవ్యయం
శుభం
వ్యర్ధం
ఇష్టసిద్ది
కలహం
కార్యజయం
జయం
02.24
02.48
విరోధం
మనస్తాపం
కార్యహాని
లాభం
జయం
సౌఖ్యం
మిశ్రమం
02.48
03.12
ధనలాభం
కార్యసిద్ధి
అపజయం
ఉద్యోగలాభం
కార్యభంగం
భయం
విరోధం
03.12
03.36
శత్రువృద్ది
ప్రయాణం
శత్రుజయం
విజయం
అశుభం
కార్యహాని
రోగపీడ
03.36
04.00
కలహం
లాభం
వ్యయం
అభీష్టసిద్ది
స్నేహం
నష్టం
మనస్తాపం
04.00
04.24
రోగం
విద్యాలాభం
సుఖం
శుభం
జయం
అపవాదు
లాభం
04.24
04.48
ధనలాభం
కార్యనష్టం
కార్యలాభం
క్షేమం
కలహం
భయం
కార్యసిద్ధి
04.48
05.12
కార్యసిద్ధి
గౌరవం
క్షేమం
జయం
మనోభీతి
పనినష్టం
లాభం
05.12
05.36
నష్టం
శుభం
కార్యసిద్ధి
ఉద్యోగలాభం
జయం
కార్యజయం
సుఖం
05.36
06.00
లాభం
అధికలాభం
సౌఖ్యం
అశుభం
కార్యసిద్ధి
ధనలాభం
జయం


మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...