2014-12-18

కన్య రాశి

కన్యరాశి :ఈ రాశికి అధిపతి బుధుడు . ఇది భూ తత్వము కలిగిన రాశి . ఈ రాశిలో పుట్టిన వారు మంచి ఆలోచనా శక్తి కలవారు . వివేకవంతులు . ఉత్సాహవంతులు . ఈ రాశివారు నిత్యము ఆనందముగా ఉందురు . మంచి రూపము కలిగి అందముగా ఉంటారు . ఇతరులపై ప్రేమానురాగములు కల్గి యుంటారు .పొదుపును పాటిస్తారు . సంపాదించాలనే కోరిక ఉంటుంది . కానీ నిర్దేశించు కొన్న లక్ష్యాలను చేరుకొనుటకు కొన్ని అవరోధములను ఎదుర్కొంటారు . కష్ట పడకుండా డబ్బు రాదనే విషయమును గుర్తించుట మంచిది .వీరికి సమాజము పట్ల మంచి అభిప్రాయము ఉంటుంది .,

ఏ విషయము నందైనా ప్రణాలికా బద్దంగా నడచుకోనవలెను అనే సిద్దాంతము వీరిలో కన్పించుచున్నది . ఇతరులకు ఆదర్సవంతముగా కనపడతారు . అనుకొన్నది సాధించ గలరు . ఒక్కొక్క సమయములో నిర్దేశించుకున్న  లక్ష్యమును చేరుకొను సమయములో వీరికి కొన్ని ఆటంకములు ఎదురైననూ  కొంత శ్రమకోర్చి విజయమును పొందగలరు .రచనలు చేయుట, వీరికున్న ప్రత్యేక లక్షణము .

లలిత కళలయందు , ఆటలయండు మక్కువ ఎక్కువగా ఉండును . సంగీతము , సాహిత్యము లన్న వీరికి ఇష్టము . చాల వేగంగా ఆలోచించ గలరు . సూక్ష్మమైన , నిశిత పరిశీలనా జ్ఞానము కలవారు .ఆపద సమయములలో ఇతరులకు సాయపడుటకు ,ఉపకారము చేయుటకు ముందుంటారు . భార్య భర్తలమధ్య మంచి ఆప్యాయత , ప్రేమ కలిగి ఉంటారు . అలంకరణ , మంచి వాతావరణము ,అనిన  వీరికి ఇష్టము . గృహమును తమకు అన్ని విధముల సౌఖర్యవంతముగా ఉండేటట్లు తీర్చి దిద్దుకొందురు .

తాము చేసిన తప్పులను పొరపాట్లను గుర్తించక పోవడమే కాకుండా తొందరగా మరచి పోవుదురు . దీని వలన జరిగిన తప్పులనే మరలా చేయుచుందురు . ఎదుటి వారి తప్పులనున్ గురించి దెప్పి పొడిచే మనస్తత్వము అధికము . మంచి విమర్శనా జ్ఞానము కలవారు . ఎప్పుడు నిత్యనూతనంగా ,పరిశుభ్రంగా ఉంటారు .వయస్సు పెరిగిననూ యవ్వనంలో ఉన్నవారి వలె కన్పిస్తారు . ఇష్టం లేనప్పుడు బంధువుల అవసర సమయములలో కుంటి సాకులు చెప్పి తప్పించు కొంటారు . ఈ రాశి వారు స్వతంత్రతను కోరుకొంటారు . ఇతరుల పై ఆధారపడకుండా బ్రతకాలని అనుకొంటారు .

2014-12-16

తులారాశి

 తులారాశి : ఈ రాశి వాయు రూపము కలది . దీనికి అధిపతి శుక్రుడు , ఇది చరరాశి . ఈ రాశిలో పుట్టిన మానవులు , చంచల స్వభావము కలవారు . సందర్భమును బట్టి సమయోచితముగా వ్యవహరింతురు . సంఘమునందు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు . మధ్యవర్తులుగా వ్యవహారములు జరుపుటలోనూ , రాయబారములు చేయుట లోనూ వీరు సిద్ధహస్తులు .

మంచి వాగ్ధాటి కలవారు , వీరు శాంత స్వభావము కలవారిగా కనబడుదురు . కోపము వచ్చిన ఎంతటి వారినైనా లెక్కచేయరు. మృదువుగా మాటలాడుచు ఇతరులను ఆకట్టుకొందురు . ప్రశాంతమైన వాతవరాణములో బ్రతకాలని కోరుకొంటారు . వీరిలో కొందరు న్యాయవాద వృత్తులలో బాగా రాణిస్తారు . సాధ్యమైనంత మటుకి ఎక్కువ విశ్రాంతిని కోరుకొంటారు . ఆరోగ్య విషయములలో ఎప్పుడు జాగ్రత్తను పాటిస్తారు .    

వాదనలకు దిగి వీరిని ఒప్పించుట చాల కష్టమైన పని , న్యాయాన్యాయ విచారణ లలో వీరు ఇతరులకు తగు పరిష్కారములు చూపించ గలరు . గ్రామ పెద్దలుగానూ , సంఘముల యందు అధ్యక్షులుగానూ, మరియు విభిన్న రకముల  పదవులను అలంకరింతురు . తొందర నిర్ణయములు తీసుకోరు . వీరు తమ మనస్సుకు నచ్చినట్లు నడచుకొంటారు . ఇతరుల ఆలోచనలపై ఆధారపడరు .

వీరికి బంగారము , ఆభరణములు ,మొదలగు విలువగల వాటిపై మక్కువ ఎక్కువ .  అందమైన ఇల్లు , నూతనములైన ఇంటి సామగ్రి ,ఇలా కొత్తవస్తువులు అనిన వీరికి ఇష్టము , వీరికి  స్త్రీల పట్ల  గౌరవముంటుంది.
కానీ మనస్సును అదుపులో ఉంచుకోరు . తద్వారా స్త్రీలోలురు గా తయారవుతారు . ఒక్కొక్కప్పుడు వ్యసనములకు  ఆకర్షితులు కాగలరు .  సంగీత ప్రియులు . అలంకారములు , ఆడంబరము లకు ధనమును ఖర్చు చేస్తారు . 

జూదము , మద్యపానము మొదలగు వ్యసనములకు తొందరగా బానిసలు కాగలరు . ఈ విషయములలో తగు జాగ్రత్త పాటించుట అవసరము .  

2014-12-15

వృశ్చిక రాశి

వృశ్చికరాశి : ఈ రాశి కి అధిపతి కుజుడు ఇది జల తత్వము కల రాశి . ఈ రాశి స్థిర స్వభావము కలది . ఈ రాశిలో జన్మించిన వారికి గర్వము ఎక్కువ . కఠినమైన  మనస్సు కలిగి యుందురు . . వీరు వృశ్చికము వలె పగ ప్రతీకారముల తో ఉంటారు . ఇతరుల వలన అపకారము జరిగిననూ , భాధకలిగిననూ ఏదో విధంగా వారిపై కక్ష తీర్చు కొంటారు . వీరు రహస్యములను బయటకు చెప్పరు.  పొదుపు (Savings ) విషయములో జాగ్రత్త వహింతురు . అన్ని విషయములకు డబ్బే ప్రదానము అనే భావన కలిగి ఉంటారు .

అన్నతమ్ములను (Brothers), తల్లి దండ్రులను (Parents)చివరకు  జేవిత భాగస్వామిని { Life partner } కూడా వీరు నమ్మరు . వీరి ప్రపంచమే ప్రత్యేకము . వీరి మనస్సు అర్ధము చేసుకొనుట కష్టము .తమ ఆరోగ్యము( Health) సౌఖ్యముల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు .
గూడచార సంస్థల యందు . ఇన్వెస్టిగేషన్ సంస్థలలో వీరు బాగా రాణిస్తారు . అసూయ ,ద్వేషములు ఉంటాయి .ఒకరి కింద పనిచేయుట వీరికి ఇష్టం ఉండదు . స్వతంత్రతను కోరుకొంటారు .

ఒకరకంగా చెప్పాలంటే వీరు పిసినారులని చెప్పవచ్చు , కానీ వీరు అనుకొన్నదాని కంటే ఎక్కువ ఖర్చు పెడతారు . ఎవ్వరివలనైనా వీరి మనస్సుకు భాద కలిగితే బయటకు చెప్పరు . కానీ ప్రతీకారము తీర్చుకొనే సమయము వచ్చే వరకు వేచి ఉండి వారికి హాని తల పెడతారు .ఇతరుల గురించి పట్టించుకొనే నైజము తక్కువ . తాము వేసుకున్న ప్రణాలికలు తప్ప ఇతరులు ఏమి చెప్పిననూ వీరు ఆలకించరు.

సాదరంగా ఇతరులకు వీరు సాయ పడరు . తాము తమకోసమే బ్రతకాలని అనుకొంటారు . సమాజమును గురించికానీ , లోక వ్యవహారములను గానీ అంతగా పట్టించుకోరు . వీరు ధైర్యము ఎక్కువగా ఉన్నట్లు కనపడతారు .వ్యక్తిగతంగా చూస్తే మంచి ఆలోచన కలిగిన వారే . కానీ అన్ని వేళలా ఈ విధమైన పద్ధతులు పనికి రావు . వీరు యుక్త వయస్సులో కుటుంబమునకై పాటుపడతారు . నడివయస్సు వచ్చేటప్పటికి వీరిలో స్వార్ధము పెరుగుతుంది .ఎక్కువ శాతం మందితో విరోధములు పెట్టుకొంటారు ., అందువలన కష్ట సమయములలో వీరికి ఎవరూ అండగా ఉండరు ..

2014-12-13

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి : ఈ రాశి కి అధిపతి గురుడు ,ఇది అగ్ని తత్వము కలిగిన రాశి మరియు చరరాశి . ఈ రాశి యందు జన్మించిన వారు పరోపకారము చేయుదురు . అంతా భగవంతుని నిర్ణయము ప్రకారమే జరుగుతుందని , కర్మ ఫలమని నమ్ముతారు . ఆచారములు , సాంప్రదాయము లకు ఎక్కువ విలువనిస్తారు . వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది . ఏక సంధా గ్రాహులు. ఎప్పుడో జరిగిన విషయములను కూడా గుర్తించుకొంటారు. లోకములో అందరూ న్యాయంగా ఉండాలని , న్యాయంగానే బ్రతకాలని అనుకొంటారు .

వీరు ఎక్కువ ఊహా లోకంలో విహరిస్తారు . ఏ దైనా పనిని ప్రారంభించక మునుపే లాభ , నష్టములను గురించి అలోచించి గాలిలో మేడలు కడతారు . వీరికి దైవ భక్తీ అధికము . పురాణాలు , ఇతిహాసాలు మరియు దైవ సంబంధ మైన కధలను బాగా చెప్పగలరు . మత ప్రచార సంస్థలలో బాగా రాణిస్తారు . ఎంత లాభ వచ్చే వ్యవహారమైనా  సరే వీరికి అప నమ్మకము ఏర్పడితే మధ్యలో విడిచి పెట్టేస్తారు . ధార్మిక సంస్థల యందు , దైవ సేవా కార్యక్రమముల యందు ఎక్కువగా పాల్గొంటారు .

వీరికి వయస్సు పెరిగే కొలది బుద్ధి జ్ఞానము పెరుగును . చదవడం అంటే చాలా ఇష్టము . తేజస్సు కలవారు . పదిమందిలో గౌరవమును పొందుతారు . కానీ కుటుంబములో వీరిని అర్ధము చేసుకోరు . వీరికి ధనాపేక్ష ఎక్కువ .మనస్సు లో ఏదీ దాచుకోరు . నిర్మొహమాటంగా మాటలాడుదురు . అనుసరించే స్వభావము ఎక్కువగా ఉంటుంది .వీరికి అప్పచెప్పిన పనిని భాద్యతగా నిర్వహిస్తారు .భవిష్యత్తులో జరిగే ప్రతి పరిణామము భగవంతుని సంకల్పమే అని ‘’ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా   ‘’ అంతా ఆయన అనుగ్రహము వలనే నడుస్తుందని అనుకొంటారు .

ఈ రాశి వారు ఎప్పుడు తృప్తిగా , ఆనందముగా ఉండాలని అనుకొంటారు .జీవిత విషయములో ముందు ప్రణాలికలు ఉండవు . వీరికి స్వతంత్ర నిర్ణయములు ఉండవు . ఏ విషయములో నైనా పరిమితికి మించి ఆలోచిస్తారు . తాత్కాలిక సంగతుల గురించి పట్టించుకోరు . నిత్యము ఏదో ఒక కొత్త విషయమును గురించి తెలుసుకోవలెననే ఆరాటము వీరిలో ఎక్కువ . వీరికి జీవిత భాగస్వామి గానీ మరి ఎవరైనా గానీ మంచి సలహాలను ఇచ్చి ప్రోత్సహించి నట్లయితే జీవితములో చాలా ప్రగతిని సాధించ గలరు . ఆరోగ్య విషయములో తగు జాగ్రత్త అవసరము .జాగ్రత్త వహించనిచో బిపి , షుగర్ లాంటి వ్యాధులు బారిన పడే అవకాశమున్నది .       .

నవగ్రహ స్తోత్రములు


శ్లోకం ;   ఆదిత్యాయచ  సోమాయ  మంగళాయ బుధాయచ
          గురు శుక్ర  శనిభ్యశ్చ  రాహువే కేతవే నమః  .
                    నవగ్రహ స్తోత్రములు
రవి :    జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్
          తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం.
చంద్ర:    దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవమ్
          నమామి శశినం సోమం  శంభోర్మకుట భూషణం
కుజ ;   ధరణీ గర్భ సంభూతమ్ విద్యుత్కాంతి సమప్రభం
          కుమారం శక్తిహస్తం , తం మంగళం ప్రణమామ్యహం
బుధ  ;  ప్రియంగు కలికాశ్యామం రూపేణాన్  ప్రతిమం బుధం
          సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యాహం
గురు  ; దేవానాంచ ఋషినాంచ గురుం కాంచన సన్నిభం
          బుద్దిమంత్రం త్రిలోకేశం  తం నమామి బృహస్పతిం
శుక్ర  ;  హిమకుంద మృణాలాభం  దైత్యానాం పరమం గురుం
                సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం
శని  ;   నీలంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం
          చాయామార్తాండ సంభూతమ్ తం నమామి శనైశ్చరమ్
రాహు ; అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం
          సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం
కేతు ;   ఫలాశ పుష్ప సంకాశమ్ తారకాగ్రహ మస్తకం
          రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుంప్రణమామ్యహం.                                                    

2014-12-12

కుంభ రాశి

కుంభ రాశి : ఈ రాశికి శనీశ్వరుడు అధిపతి . ఇది వాయు  తత్వ రాశి.  మరియు స్థిర రాశి . ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని పద్దతులు ఉంటాయి .వీరు రహస్యములను గానీ ,వ్యక్తిగత విషయములను గానీ ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు .గుంభనంగా ఉంటారు , ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకొంటారు . పరిశుభ్రతను పాటిస్తారు . ఈ రాశిలో పుట్టిన కొందరు వైద్యులు గానూ , రసాయన శాస్త్రవేత్తలు గానూ రాణిస్తారు .

ప్రయాణములు చేయుట వీరికిష్టము. విహారయాత్రలు , కొత్త కొత్త ప్రదేశము లను సందర్శించడం అలవాటు. వీరు తమ మనోభావములను తమ జీవితములోని కష్ట , సుఖములను ఇతరులకు తెలియనీయరు . ఎంత భాధలు అనుభవించిననూ, మానసిక స్థైర్యాన్ని కోల్పోరు .. ఆనందముగా గడుపుటకు ఇష్ట పడతారు . వీరికి కొంత బిడియము ఉంటుంది . సంపాదన విషయములో స్థిర మైన ప్రణాళికతో ఉంటారు .

ఈ రాశి వారు నడి వయస్సు వరకు సాధారణ జీవితమును గడుపుతారు.నడివయస్సు నుండి ఆర్ధిక స్థిరత్వమును పొంద గలరు . వృద్ధి లోనికి రాగలరు .  ఆచార సంప్రదాయములను ఇష్ట పడరు . ప్రతి వారికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలని కోరుకొంటారు .ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతకాలని కట్టుబాట్లు, పాత ఆచారాలు మొదలగు వాటిని వ్యతిరేకిస్తారు .   ప్రపంచములో జరగబోయే సంఘటనలు ముందుగా ఊహించగల మేధాశక్తి వీరి సొంతము .ఈ రాశికి చెందిన కొందరు నూతన విషయములను కనిపెట్టి ప్రపంచమునకు అందివ్వగలరు .

 భావితరాలకు మార్గ దర్శకులు అవుతారు . తగవులు ఆడుకోవడం వీరికి ఇష్టం ఉండదు . ప్రశాంతతను కోరుకొంటారు . స్నేహితులు ఉంటారు . కానీ వీరికి ఒంటరిగా గడపడం అంటే ఇష్టం . పని చేయుటలో ఒక పద్ధతిని అవలంభిస్తారు. వీరి జీవితము క్రమ శిక్షణ కలిగి ఉంటుంది . సమయపాలన అనేది చాలా బాగుంటుంది . వీరి అలవాట్లు కూడా చాలా బాగుంటాయి . ప్రతి పనిని టైము ప్రకారము చేస్తారు . జీవిత భాగస్వామికి కూడా మంచి విలువనిస్తారు .తమ అభిప్రాయములను ఇతరులపై రుద్దరు .            .  .  


2014-12-10

మీన రాశి

మీనరాశి : ఈ రాశికి అధిపతి బృహస్పతి . ఇది జలతత్వముకల రాశి , స్థిరరాశి . ఈ రాశి యందు జన్మించిన  వారు మృదు స్వభావులు . భయస్తులు . వీరికి చల్లని వాతావరణం లో ఉండుట ఇష్టము. ఇతరులకు అపకారము చెయ్యరు . వీరు మనస్సు దేనికోసం ఆరాట పడదు . లాభ నష్టముల గురించి ఆలోచించరు. పరలోక చింతన ఎక్కువ . దైవబలం వీరికి తోడుగా ఉంటుంది . దైవ భక్తీ అధికముగా ఉంటుంది . ధార్మిక సేవా కార్య క్రమములలో ఎక్కువగా పాల్గొంటారు .

ఉదార గుణము కలవారు . దాన ధర్మములు చేస్తారు . పదిమంది తమగురించి మంచిగా చెప్పుకోవాలని అనుకొంటారు . ద్వేషము , ఈర్ష్య , అసూయ లాంటి మనస్సు వీరికుండదు . కపటము లేనివారు . అన్ని మతాల పట్ల సద్భావము కలిగి ఉంటారు . ధనము సంపాదించుట కన్నా ఖర్చులు ఎక్కువ . కుటుంబ భాధ్యతలను అంతగా పట్టించుకోరు . ‘’ మానవ సేవే మాధవ సేవ ‘’  అన్నట్లు ఎప్పుడు సేవా కార్యక్రమములలో ఎక్కువగా పాల్గొంటారు .
అందరూ సమానమేననీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అను భావము వీరికి ఉండదు .  

వీరు నమ్మకమైన వారు . వృత్తి , వ్యాపార , ఉద్యోగములలో భాద్యతగా పనిచేస్తారు . నిజాయితీ కలవారు .వేదాంతము , భక్తీ వీరిలో ఎక్కువగా ఉంటుంది .ఆచార సంప్రదాయములకు విలువ ఇస్తారు . జ్ఞానము కలవారు . మంచి చెడుల నెరిగి ప్రవర్తిస్తారు .సాయము చేయడములో ముందుంటారు . లోకములో అందరు మంచి వారే అను భావముంటుంది . క్షమా గుణము కలవారు . ఎవరి వలనైనా అపకారము జరిగినచో వారి పాపాన వారే పోతారని అనుకొంటారు .

వీరికి సామాజిక భాద్యత ఎక్కువ . సమాజము గురించే ఎక్కువ ఆలోచిస్తారు .ఎదుటివారి సమస్యలను, కష్టములను ఓపికగా వింటారు . తమకు తెలిసి నంతలో వారి సమస్యలకు పరిష్కారము చూపించుటకు ప్రయత్నిస్తారు . అవసరమైతే వారికి ధన సహాయము చేయుటకు కూడా వెనుకాడరు . వీరికి ధనముపై మోజు తక్కువ .కీర్తి ప్రతిష్టలు గురించి తాపత్రయ పడతారు .

2014-12-09

మకర రాశి

మకర రాశి : ఈ రాశికి శనీశ్వరుడు( Saturn) అధిపతి . ఇది భూ తత్వ రాశి మరియు చరరాశి . ఈ రాశిలో జన్మించిన వారికి ధన సంపాదన పై (Money) మక్కువ ఎక్కువ . పట్టిన పట్టు విడవరు . ఎంతటి కష్టముల నైనా ఓర్పుతో భరిస్తారు . కష్టపడే(hard work) మనస్తత్వము ఉంటుంది . స్వంత శక్తిని నమ్ము కొంటారు . జీవితములో అవసరమైన ప్రణాలికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళతారు . కపటము గానీ మాయ చేసి మోసగించడం వంటివి వీరికి తెలియదు . యధార్ధముగా బ్రతుకుతారు .

తమ స్వంత శక్తి సామర్ధ్యములను ఉపయోగించి ఉన్నత స్థితికి చేరుకొంటారు . అధికారులుగా (Officer) చెలామణి అవుతారు . కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని , పెద్ద పేరుగల వారిగా ఉండాలని తాపత్రయ పడతారు . జేవితములో ఒకటి రెండు సార్లు అపజయము కల్గిననూ నిరాశ పడకుండా అనుకొన్నది సాధించగల ఓపిక , సహనము వీరికున్న సహజ లక్షణము . ఎదుటి వారి విషయములలో జోక్యం చేసుకోరు . వీరు ఇతరులకు చాలా నమ్మకస్తులుగా ఉంటారు . 

ధర్మబుద్ధి కలవారు . ఆత్మగౌరవము కలిగి ఉంటారు . వీరికి ఇతరులపై ఆధారపడకుండా బ్రతకాలని ఉంటుంది . విద్యా ( Education ) సంబంధ విషయముల యందు జాగ్రత్త అవసరము . వివాహ విషయములలో (Marriage ) స్వంత అభిప్రాయము మేరకు నడచు కొంటారు , కానీ దంపతుల మధ్య కొంత అన్యోన్యత లోప ముంటుంది . వీరిని అర్ధము చేసుకొనే జీవిత భాగస్వామి ( Life partner )దొరుకితే వీరు చాలా అదృష్టవంతులు ఆగుతారు . 

వీరి ప్రవర్తన ఇంట్లో ఒకలాగా ,బయట మరొక లాగా ఉంటుంది . కుటుంబ సభ్యులతో ( Family members ) సత్సంభంధములు పెంచుకొనుట మంచిది . సాధారణము గా వీరికి పూర్వార్జితము గానీ , పిత్రార్జిత సంబంధ ఆస్తులు గానీ[ Property) కలసి వచ్చే అవకాశములు ఉండవు .స్వార్జిత సంపాదన ఉంటుంది . పిల్లల  అభివృద్ది బాగుంటుంది . జీవిత చరమాంకములో ఇతరులపై ఆధారపడ కూడదని అనుకొంటారు .వీరు నరముల సంబంధ అనారోగ్యముతో భాదపడు సూచనలున్నవి. ఆరోగ్యము పట్ల జాగ్రత్త అవసరము .

2014-12-06

MARS

the planet of mars is ruler of many types of professionals. he was created different types of jobs and occupations . belongs electricians , electrical workers, army , police departments, agriculture departments, farmers, security guards, fire departments and powerful  workers .

he is a fire . he is critical and philosophy.

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...