2017-06-28

గృహ నిర్మాణ స్థలము

1 . గృహము నిర్మించ బోయే స్థలము ఎట్లు ఉండాలి .
గృహము నిర్మించ దలచిన స్థలము చతురస్రముగా గాని , దీర్ఘ చతురస్రముగా గానీ ఉండాలి . గట్టిగా ఉన్న స్థలములు అనువైనవి . ఎత్తైన నేలలు మంచివి .

2. గృహ నిర్మాణమునకు పనికిరాని  స్థలములు ?
త్రికోణ ఆకారము, డైమండ్ ఆకారము , కోణములు ఎక్కువ , తక్కువ ఉన్న స్థలములు , వృత్తా కారముగా ఉన్నవి , మెత్తటి నేలలు, విదిక్కులకు తిరిగి ఉన్న స్థలములు, ఉబుకు నేలలు, గుల్ల నేలలు గృహ నిర్మాణము నకు పనికిరావు . 

గృహము నిర్మించబోయే వారు మొదట స్థల పరిశీలన జరిపించాలి . ఎవరైనా ఇంజనీరును గానీ , సిద్ధాంతిని గానీ సంప్రదించి  దిక్సూచి ని ఉపయోగించి దిక్కులకు సరిపోయే విధంగా స్థలాన్ని చతురస్రముగా లేక దీర్ఘ చతురస్రముగా మార్కింగు చేయించాలి . తదుపరి ఆ స్థలం చుట్టూ ప్రహారి నిర్మించాలి .

 గట్టివి , కంకర నేలలు అయితే మంచిదే . కానీ ఈ కాలములో అందరికి అనువైన స్థలములు దొరకుట కష్టము .అలాంటివారు ఇసుక నేలలు, మెత్తటి నేలలు, ఉబుకు నేలలు మరి ఇతర నేలలు ఉన్నప్పుడు గృహనిర్మాణము చేయ దలిస్తే ముందుగా స్థలమును ఆరడుగుల లోతు వరకు తవ్వి మట్టిని తీసేయాలి . వ్యవసాయ భూమి లో మట్టితో గానీ , కంకరతో నింపాలి . ఈ విధముగా చేయుట వలన ఇంటి యొక్క అడుగు భాగము గట్టిగా ఉంటుంది . మరియు వాస్తు ప్రకారము కూడా మంచిది .

గృహ నిర్మాణ కర్త ఒక మంచి శుభ ముహూర్తము ఏర్పాటు చేసుకొని శంఖుస్థాపన చేయాలి .దీనినే గృహారంభము అంటారు . గృహారంభ ముహూర్త విశేషములు ఈ విధంగా ఉన్నాయి .

గృహారంభ ముహూర్తము నకు వృషభ చక్రశుద్ది ,4, 8 , 12 స్థానముల శుద్ది ముఖ్యముగా చూడాలి .
వృషభ చక్రము :సూర్యడు ఉన్న నక్షత్రము నుండి ముహూర్తము పెట్టుకొన్న రోజున ఉన్న నక్షత్రము వరకు లెక్కించగా వచ్చు సంఖ్యను బట్టి ఫలితములు ఇలా ఉంటాయి .

సూరుడున్న నక్షత్రము నుండి మొదటి 1, 2 ,౩ నక్షత్రములు మృత్యువు ను కల్గించును , 4 . 5 , 6 ,7 నక్షత్రములు చెడుకాలము{ దుర్దశ }, 8 ,9 , 10 ,11 ధైర్యమును కల్గించును , 12, 13 ,  14 భ్రమణము{ ఇక్కడ భ్రమణము అంటే సంచారము ) ను, 15 , 16 , 17 ,18  ధనమును ప్రసాదించును . 19, 20 , 21 ,22 ధాన్య సంపదను 23 , 24 , 25 సంపద వృద్ధి జరుగును 26 , 27 , 28 పశు వృద్ధి జరుగును .

ఈ విధముగా వృషభ చక్రఫలితములు తెలుసుకొని చక్కని ముహూర్తము నిర్ణయము చేసుకొని గృహ నిర్మాణము ఆరంభించాలి .

2017-06-16

మార్పే జీవన రహస్యం

ప్రకృతిలో మార్పు …. మనలో మార్పు …..

మొక్కలో మార్పేమహా వృక్షం. నిన్న మొగ్గ నేడు పుష్పం. ఇలా కాల పరిసరాలలో మార్పు.పెను తుఫాను వచ్చిందని పువ్వు పరిమలించడం మానదు. అస్తమించిన సూరిడు ఉదయించక మానడు. రెయిని చూసి రాక మనదు రెరాజు (చందమామ). పర్వతాన్ని చూసి ప్రవహించడం మానదు సెలయేరు. అడ్డు గోడలు చూసి గమనం ఆపుతుందా గాలి? మండుటెండను చూసి ముత్యాల నవ్వులు మానుతుందా మల్లె పువ్వు? చిన్న చీమ చూడు ఎంత బరువులెత్తునో తన కంటె. ఈ పకృతి దృశ్యాలు తమ విధి ని ఎంత విజయవంతము గా జరుపుకుంటున్నాయో!!! విసిగి పోకుండా ,అలసిపొకుండా , చిరు నవ్వులు చిందిస్తూ..

ఉన్న స్ధితి నుండి ఉన్నత స్ధితిని పొందడమే ఉత్తముల లక్షణం . మొక్క లో మార్పు మహా వృక్షము అయితే మరి మనిషి మారితే ….? ఇది మీరే నిర్ణయించుకోండి. మీరు మారి ఉన్న స్ధితి నుండి ' ' ఉన్నత స్ధితికి , ఎంత ఉన్నత స్ధితికి వేల్లాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. Construction స్టార్ట్ చేసే ముందు గా బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఉన్నంత ఖచ్చితంగా మన గోల్ మనకి కనిపించాలి.

ప్రయత్నం లేని ఫలితంలో ఆనందముండదు. ఉన్నా ఎంతకాలమూ వుండదు. అందుకే '' నీర్జీవంగా ఎన్ని రోజులుంటావు ..? సజీవంగా ఒక్కరోజు ఉండటానికి ప్రయత్నించు . మరణించు వరకు ఈ మార్పే నీకు నడిపిస్తుంది , జీవించడం నేర్పుతుంది, జీవింప జేస్తుంది. ''
''
మొడుబారిన చెట్టులా ఉండి మరణించు కంటే గోల్ కోసం బలైనా మంచిదే '' అన్నట్టు గా వుండాలి. అందనంత దూరం లా వుంటుంది కాని అచరణ తో అడుగు ముందుకు వెయ్యలే కాని నీ అద్బుత లోకం ఎదురుగా వస్తుంది నిన్ను అహ్వానిస్తూ

మనమేంటో మనకి తెలుసు . మనకి మాత్రమే తెలుసు. మన ఉనికిని మనం కాపాడుకుందాం. మనమేంటో మనం నిరూపించుకుందాం. మబ్బు మాటున మెరుపులు పైకి కనిపించడం లేదా? ఆకు చాటు పండు తన పవరేంటో తెలుపుతుంది. కోమ్మల చాటున పువ్వులు పరిమళలతో తన ఉనికిని చాటుకుంటాయి. ఇవ్వాన్ని మనకి తేలియంది కాదు. మనము మనమేంటో నిరూపించుకోవాలనే ఆలోచన ఉండాలే కాని మార్గాలే కరువా?

మనం ఎమి కావలనుకుంటున్నామోమనకి ఎమి కావలనుకుంటూన్నామో వాటిని స్పష్టంగా మన సుప్త చేతనా మనసుకి చేరవేయ్యండి. నిర్బయంగా వుండండి . మన సుప్తచేతన మనసుకున్న అధ్బుతమైన శక్తిని మన: పూర్వకంగా నమ్మండి. మనం నమ్మినదే జరిగి తిరుతుంది. మన సంతోషమే సంక్రాంతి సంబరాలు. మన విజయమే విజయదశమి అంబరాలు.

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...