Showing posts with label భావములు. Show all posts
Showing posts with label భావములు. Show all posts

2014-07-27

ద్వాదశ రాశులు - ప్రమాణములు


ద్వాదశ రాశులను 12 లగ్నములుగా సూచించి లగ్న ప్రమాణములు చెప్పినారు . ఇవి భూమిపై నున్న అక్షాంశ రేఖాంశ ములను బట్టి కొద్ది మార్పులు వచ్చును . సుమారుగా భారత దేశములో రాజమండ్రికి లగ్న ప్రమాణములు ఈ విధంగా ఉన్నవి .

మేష రాశి ప్రమాణము 1 గం .   45 ని . లు  00 సెకన్లు
వృషభ రాశి ప్రమాణము 2 గం . 01 ని . లు 39 సెకన్లు
మిధున రాశి ప్రమాణము 2 గం .11 ని . లు 12 సెకన్లు
కర్కాటక ప్రమాణము 2 గం .11 ని . లు 51సెకన్లు
సింహ రాశి ప్రమాణము 2 గం . 06ని . లు19 సెకన్లు
కన్య రాశి ప్రమాణము 2 గం .04 ని . లు 59సెకన్లు
తులరాశి ప్రమాణము 2 గం . 09 ని . లు39 సెకన్లు
వృశ్చిక రాశి ప్రమాణము 2గం .13ని . లు 24సెకన్లు
ధనుస్సు రాశి ప్రమాణము 2 గం .07ని. లు 26సెకన్లు
మకర రాశి ప్రమాణము 1 గం . 54 ని . లు48 సెకన్లు
కుంభ రాశి ప్రమాణము 1 గం .  38 ని . లు28 సెకన్లు
మీన రాశి  ప్రమాణము 1 గం .  36 ని . లు 15సెకన్లు

ఈ విధంగా పన్నెండు రాశుల ప్రమాణము కలిపితే 23 గంటల 56 నిమిషములు వచ్చును . తిరిగి అవే లగ్నములు వచ్చు చున్నవి రోజుకు 24 గంటలు అయినపుడు ఒక రోజులో 23గంటల 56 నిముషాలు గతించి తర్వాత లగ్నములో సుమారు 4 నిమిషములు భూ గమనము జరుగుతుంది , దీనినే జ్యోతిష్యులు లగ్నభుక్తి గా సూచిస్తున్నారు .

ఉదా : ఏప్రిల్ నెలలో  13నుండి 16 వతేదీ లోపల మేష సంక్రమణము జరుగుతున్నది . మేష లగ్న ప్రమాణమును 1గంట 45 ని. లను 30 భాగాలు గా విభజిస్తే మేష సంక్రమణము జరిగిన నాటినుండి రోజుకు 3 నిమిషముల 30సెకన్లు లగ్న భుక్తి జరిగి 30రోజుల తరువాత భూమి 31వ డిగ్రీకి వస్తుంది . దీనినే వృషభ సంక్రమణం అంటారు . ఈ విధంగా భుక్తి జరుగుచు సంవత్సరములో 12 సంక్రమనములు వచ్చును

27 నక్షత్రములను  దేవ రాక్షస మానుష గణములుగా విభజించిరి
అశ్విని ,మృగశిర ,పునర్వసు , పుష్యమి , హస్త  స్వాతి , అనూరాధ శ్రవణం రేవతి  ఈ తొమ్మిది నక్షత్రములు : దేవగణమునకు చెందినవి 
కృత్తిక ,ఆశ్రేష , మఖ చిత్త , విశాఖ , జ్యేష్ట , మూల ,ధనిష్ఠ, శతభిషం  ఈ తొమ్మిది నక్షత్రములు : రాక్షస గణమునకు చెందినవి
భరణి ,రోహిణి , ఆరుద్ర ,పుబ్బ, ఉత్తర ,పూర్వాషాడ, ఉత్తరాషాడ, పూర్వాబాద్ర, ఉత్తరాభాద్ర ఈ తొమ్మిది నక్షత్రములు : మనుష్యగణమునకు చెందినవి.

2013-10-22

చంద్ర గ్రహ ప్రభావము

చంద్ర గ్రహ ప్రభావము

 జాతక చక్రములో చంద్రుడు ఏ  గ్రహాములతో  కలసి నపుడు ఎలాంటి ఫలితములు  అను విషయమును గురించి తెలుసు కొందాము.

చంద్రుడు సూర్యునితో  కలసి నపుడు  శారీరక దుర్బలత్వము , భయము , మనో ధైర్యము లేకుండా ఉండడము , ప్రత్రి పనిలోనూ వెనుక బడి ఉండడము లాంటి  స్వభావమును కలిగి ఉంటారు .. చంద్రుడు మనస్సు కు కారకత్వము వహించు చున్నాడు . అందువలన వీరికి మనసు ఆందోళనతో నిండి ఉంటుంది  . ఇట్టి వారు తాము ఆలోచించి  చేయు ప్రతి విషయములోనూ వ్యతిరేక ఫలితములు కలుగును . వీరు తొందరగా  నిరాశ పడతారు , మనో భీతి ఎక్కువ . సాహించి ముందడుగు వేయలేరు .

ఈ విధముగా సూర్య చంద్ర గ్రహముల ప్రభావము ఉన్నవారు అమావాస్య  ఘడియలలో జన్మించిన వారి ఉంటారు . ఎందుకంటే  సూర్య చంద్రులు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు అమావాస్య ఏర్పడు చున్నది గదా ?  పైన తెలిపిన ఫలితములు  జాతక చక్రములో సూర్యునికి చంద్రునికి మధ్య ఉన్న దూరమును బట్టి  కొందరికి అత్యంత ఎక్కువగానూ , మరికొందరికి చాలా తక్కువగానూ కలుగుతూ ఉంటాయి .   

సుర్ర్యునితో కలసిన  ఏ గ్రహమైనా  అస్తన్గత దోషము పొందును . అస్తన్గత దోషము అంటే  ఆ గ్రహమునకు ఉన్న  బలమును కోల్పోయి  శూన్యత పొందును . గ్రహము వలన కలిగే శుభ ఫలితములను జాతకుడు పొందలేదని భావము . ఎలా అంటే సూర్య  చంద్రులు  గగనములో ఉన్నారు . కానీ  అమావాస్య రోజున  చంద్రుని వలన వెలువడు కాంతి  (వెన్నెల ) ని  భూమిపై నున్న మానవుడు చూడలేదు కదా ?

అంటే కాకుండా అమ్మావాస్య  సమయములో  మానసిక స్థితి భాగా లేనివారికి, పిచ్చి వారికి , మతి స్థిమితము లేనివారికి వారి యొక్క  మానసిక  స్థితిలో ఎక్కువగా మార్పులు కలుగుతాయని  విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడా నిరూపించి ఉన్నారు . దీనికి కారణము ఏమిటంటే  అమావాస్య రోజున చంద్రుని కిరణాలు ( చంద్రకాంతి  ) భూమిపై  ప్రసరించక పోవడమే .


పుట్టినపుడు జాతక చక్రము ప్రకారము ఇలాంటి గ్రహ స్థితి ఉల్లవారి లో ఎక్కువగా  మానసిక సంఘర్షణకు లోనగుదురు . వీరి జీవితములో  చంద్ర మహా దశ జరుగు చున్న సమయములో ఎక్కువగా ఇబ్బంది పడతారు . జాతక చక్రములో  సూర్యునికి చంద్రునికి  మధ్య  సుమారు 15 డిగ్రీ ల కన్నా దూరము ఎక్కువగా ఉంటె  పైన తెలిపిన  వ్యతిరేక ఫలితములు  వీరికి వర్తించవు 

2013-08-18

గ్రహ దశలు - ఫలితములు

గ్రహ దశలు - ఫలితములు 
గ్రహముల యొక్క దశలు వలన కలుగు ఫలితములు జాతకునకు అనుభవించు వయస్సులో వచ్చి నపుడు మాత్రమె సంపూర్ణముగా అనుభావించ గలరు . అట్టి వారు అదృష్ట వంతు లనబడుడురు .

ఉదా . ఒక వ్యక్తికీ గురు బలము చాలబాగుంటుంది . ఈ గురు దశ విధ్యాభ్యాస కాలములో వచ్చినట్లయితే అతడికి మంచి ఉన్నత మైన చదువు అబ్బుతుంది . తద్వారా గొప్ప మేధావిగా తయారవుతాడు . నది వయస్సు దాటిన తరువాత వచ్చిన దనుకొంటే  ఆ వయస్సులో విద్యను అభ్యసించ లేరు కదా.

అదే విధముగా మరొక వ్యక్తికీ రవి బలము బాగుంటుంది . ఈ దశలో రాజ యోగమును అనుభవిస్తారు . ఇటు గొప్ప గొప్ప పదవులను పొందుతారు . ఇట్టి దశ  బాల్యములో వస్తే అతడు యోగమును అనుభవింప లేడు.

శుక్రబలము బాగున్న వారికి సకల భోగ భాగ్యములు కలుగుతాయి . అన్ని రకముల ఆనందములను , సుఖములను అనుభవిస్తారు . ఇట్టి దశ వృద్ధాప్యములో వస్తే  బూడిదలో పోసిన పన్నీరే కదా?

 ''అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ''
అన్న సామెత వలే  యోగ వంతమైన దశ సరియైన వయస్సులో  రాకపోతే  జాతకులకు యోగ భంగము కలుగుతుంది .ఇలా ప్రతి గ్రహ దశ అనుకూల సమయములో వచ్చిన వారు అద్భుతమైన జీవితమును గడుపుతారు .

భావములు – విశ్లేషణ, కుజ దోషము

భావములు –  విశ్లేషణ

కుజదోషము ను గురించి తెలుసుకొనుటకు కొంత ప్రాధమిక అవగాహన అవసరం కనుక ఈ విషయములను ఈ శీర్షికలో వ్రాయడం జరిగింది  

జాతక చక్రము ప్రకారము మానవుని జీవన విశేషములు తెలుసుకొనుటకు 12 భావములుగా విభజించితిరి .
సూర్య రేఖ భూమిపై ఎక్కడ స్పర్శించు చున్నదో అక్కడ సూర్యోదయము కలుగు చున్నదని ఇంతకు ముందు శీర్షికలలో  తెలుసు కొన్నాము . లగ్న సాధన గురించి కూడా తెలుసుకొన్నాం .

మానవుని జన్మ సమయమును బట్టి లగ్న నిర్ణయము జరుగుతుంది . తల్లి గర్భము నుండి శిశు జననము జరిగిన సమయములో ఈ సృష్టి తో అనుబంధం ఏర్పడుతుంది . కాబట్టి  జన్మ సమయమును బట్టి ,జన్మ స్థానమును బట్టి ఖచ్చితముగా లగ్న సాధన చేయవలెను. ఈ లగ్న  స్థానము మొదలుకొని 12 రాశులు 12 భావములు గా ఏర్పడుచున్నవి . 12 భావములు నుండి ఈ దిగువ విషయములను తెలుసు కోవచ్చు.

1 వ భావము నుండి శారీరక ధృడత్వం , ఆరోగ్య విషయములను
2 వ భావము నుండి నేత్రములు , వాక్కు , ధనము , కుటుంబము ను గురించి
౩ వ భావము నుండి అన్న తమ్ములు , అక్క చెల్లెలు , సాహసము , ఉదార గుణము మొదలగు విషయములు
4 వ భావము నుండి విద్య , వాహనములు , తల్లి , భూమి , గృహము నకు  సంబందించినవి
5 వ భావము నుండి సంతానము , బుద్ధిని గురించి
6 వ భావము నుండి శత్రువులు , అప్పులు , అనారోగ్యము ను గురించి
7 వ భావము నుండి జీవిత భాగస్వామిని గురించి
8 వ భావము నుండి ఆయుస్సు , వారసత్వపు ఆస్తులు మున్నగు వాటిని
9 వ భావము నుండి తండ్రి ,భాగ్యము , ధర్మబుద్ది ,దాతృత్వము , పిత్రార్జితము నకు సంబంధించిన ఆస్తులు
10 వ భావము నుండి జాతకుడు చేయు వృత్తిని , ఉద్యోగము , వ్యాపారము మున్నగు వాటి గురించి
11 వ భావము నుండి జాతకుని జీవితములో కలుగు అన్ని రకముల లాభములు
12 వ భావము నుండి జరుగు నష్టములు గురించి తెలుకోవచ్చు.

ఈ విధముగా మానవుని జీవితమును 12 భాగములుగా విభజించి ఫలిత నిర్ధారణ చేయవచ్చునని జ్యోతిర్విదులు చెప్పి యున్నారు. పైన చెప్పిన విషయములే కాకుండా 12 భావముల నుండి ఇంకా అనేక విషయములను తెలుసు కోవచ్చునని చెప్పితిరి . .వీటిని గురించి తర్వాత శీర్షికలలో చెప్పెదను ..

2013-06-21

మేష లగ్నము


మేష లగ్నమున జన్మించిన వారికి పంచామాధిపతి రవి , భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు కోణాధిపతులై శుభ ఫలితములు ప్రసాదించ గలరు . రవి కన్నా గురుడు ఉత్తమ యోగములు కలుగ జేయును . ఏ లగ్నమున కైనా కేంద్ర కోణ అధిపతులైన గ్రహాలూ పరివర్తన చెందిననూ ఒకరి ఇంట మరియొకరు ఉన్ననూ ఉత్తమ రాజ యోగ కారకులగుచున్నారు 
.
ఈ లగ్నమున జన్మించిన వారికి నైసర్గిక పాప గ్రహము అయిన సూర్యుడు పంచమ కోణ ఆధిపత్యము వచ్చుట మంచిది . కాబట్టి సూర్యుడు శత్రు క్షేత్రము లైన మకర కుంభ రాశుల యందు గానీ ,వృషభరాశి యండుగానీ , నీచ క్షేతము నందు గానీ ఉండుట మంచిది . 

ఈ విధముగా ఉన్నప్పుడు ఈ రవి దశా అంతర్ధశలు నడుస్తున్న జాతకులు అన్నింటా విజయము వరించు చున్నది .రాజకీయ వ్యవహారముల యందు ,సంఘమునందు గౌరవ మర్యాదలు పెరుగును . జీవిత స్థిరత్వము కలుగును . ఉద్యోగ లాభము , ప్రమోషన్స్ మొదలగునవి లభించును .

భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు చతుర్ధ స్థానము అనగా కర్కాటక రాశిలో స్థితి పొంది యుంటే ఈ జాతకులకు హంస మహాపురుషయోగము అను యోగము పట్టును . ఇది విద్యా స్థానము . ఈ స్థానము నందు గురుడు ఉచ్ఛ స్థితిలో ఉండుట వలన మంచి విద్యా యోగము కలుగుటయే  కాక  అన్నింటా మొదటి ర్యాంకులు పొందుట గొప్ప జ్ఞాన వంతులు , మేధావులుగా తయారగుదురు . వీరికి శారీరకముగా శ్రమ పడరు . తమ బుద్ది బలముచే తెలివి తేటల వలన పెద్ద పెద్ద ఉద్యోగములను సాధింతురు . 

జాతకులకు ఈ దశా అంతర్ధశలు సంభవించిన కాలములో సన్మానములు పొందుట , పెద్ద , పెద్ద అవార్డులను , బిరుదులను అందుకొనుట జరుగును . అంతే కాక విశేష కీర్తిని సంపాదిన్తురు . కానీ ఈ గురు దశా రెండవ భాగమునందు , గురునుకున్న వ్యయ భావ ఆధిపత్యము వలన కొంత కష్ట నష్టము సంభవించు అవకాశము ఉన్నది .

ఈ కర్కాటక రాశిలో గురు చంద్ర గ్రహములు కలిసి యుంటే గజకేసరి యోగము కూడా పట్టుచున్నది .
ఈ యోగ ఫలితముచే సమాజమున ఉన్నత ప్రమాణములు కలిగిన వ్యక్తిగా గౌరవవింప బడుట ,పూజ్యులుగా రాణించడం . గొప్ప ఉపన్యాసకులు , సంఘ సంస్కర్తలుగా రాణింతురు .

ఈ రాశి పునర్వసు 4వ పాదము , పుష్యమి, అశ్రేష నక్షత్రములకు చెంది ఉంటుంది
పునర్వసు 4 వ పాదములో జన్మించిన వారికి గురు మహాదశ  బాల్యమున సుమారు 4 సంవత్సరములు ఉంటుంది . పుష్యమి అశ్రేష నక్షత్రములలో జన్మించిన వారికి గురు మహాదశ రాదు . కావున చంద్ర మహాదశ అంతర్దశల లోనూ . గురుని అంతర్ధశల లోనూ ఉత్తమ యోగములు కల్గించును . .      

2013-06-19

జాతక పరిశీలన ఎలాచేయాలి?



జాతకము ద్వారా మానవుని జీవన విశేషములు తెలుసుకోవచ్చు . జాతక పరిశీలనలో అనేక మార్గములున్నవి . గ్రహ చారము , గో చారము , గ్రహ దశ , భావ విశ్లేషణ, గ్రహముల కున్న శుభత్వ , పాపత్వము లను , గ్రహల స్థితి , దృష్టి , యుతి గ్రహముల బలాబలములు ఇలా అనేక విధములుగా పరిశీలన చేసి ఫలిత నిర్ధారణ చేయవచ్చు .
గ్రహచారము అంటే ఏమిటి ?
జాతకులు జన్మించినపుడు గ్రహములు, రాశులు ఆధారముగా జాతకము తయారు చేసుకొంటాం . జాతకుడు పుట్టినపుడు ఉన్న గ్రహముల స్థితినే గ్రహ చారము అంటాం . వ్యక్తీ బ్రతికి ఉన్నంత కాలము ఇది శాశ్వతము .

గో చారము అంటే ఏమిటి ?
జాతకులు పుట్టినపుడు ఫలితములు తెలుసు కొనుటకు వీలుగా ఉంటుందని గ్రహాలను అవి ఉన్న స్థానాలను బట్టి రాశులలో వేసుకొని జాతక చక్రం తయారు చేసుకొంటున్నాం .కానీ గ్రహాలు అక్కడే స్థిరంగా ఉండలేదు . అవి నిత్యము సంచరిస్తూనే ఉన్నాయి . దీనినే గో చారము అంటారు .

మానవుడు పుట్టినప్పటి నుండి రోజు రోజు కు శారీరక , మానసిక స్థితులలో ఏ విధముగా మార్పులు కల్గుచున్నాయో , గ్రహాలు సంచరించే విధమును తెలుసుకొని ఫలిత నిర్ధారణ చేయుటకు ఉపయోగ పడును.  

గ్రహదశ : జన్మ నక్షత్రమును బట్టి  దశ ఏర్పడుచున్నది . దీనినే జన్మకాల దశ అంటారు . తదుపరి ఒకదాని తర్వాత మరొక దాస వస్తుంది . ఏ వ్యక్తికైనా ఫలితములు తెలుసుకొనేటప్పుడు నడుస్తున్న దశకు అధిపతియైన గ్రహమే అధికారిక గ్రహము . ఆ గ్రహము యొక్క బలమును బట్టి జాతకునకు కలుగు ఫలితములు ఆధారపడి ఉంటాయి .

భావ విశ్లేషణ : జాతకునకు సంబంధించి ఏ భావమును పరిశీలించాలని అనుకొంటున్నామో ఆభావ సంభంద గ్రహము , భావ కారకులను ముఖ్యముగా పరిశీలించాలి .

గ్రహములకు శుభత్వ, పాపత్వములు . : ఒక్కో లగ్నమును బట్టి శుభ గ్రహము పాప గ్రహముగానూ , పాప గ్రహము శుభ గ్రహముగాను మార్పు చెందును . జాతకులు జన్మ సమయమును బట్టి మార్పులు కలుగును .
గ్రహముల స్థితి , యుతి , వీక్షణ : జాతకులు పుట్టిన సమయములో గ్రహాలూ ఎక్కడెక్కడ ఉన్నాయి , ఏ ఏ గ్రహాలు కలసి ఉన్నాయి , ఏ గ్రహలచే చూడ బడు చున్నాయి . అనే విషయాన్ని చూడాల్సి ఉంటుంది .
ఇంకా అనేక విషయములను చాల నిశితంగా పరిశీలించి ఫలిత నిర్ధారణ చేయాలి .

తదుపరి  ఏ లగ్నములో జన్మించిన వారికి ఏ గ్రహాలు అనుకూలము , భావాలను గురించి ............
తర్వాత చర్చించుకొందాం          

2013-06-12

దశా పద్ధతి



మానవుని జీవన విశేషములను తెలుసుకొనుటకు మహర్షులు దశా పద్ధతిని అనుసరించారు.
దశా పద్ధతిలో కాల చక్ర దశ, యోగిని దశ , వింశోత్తరి దశా మొదలగు అనేక దశా పద్ధతులను ఉపయోగించి నప్పటికీ పరాశర మహర్షి చే చెప్పబడిన వింశోత్తరి దశా విధానమే అత్యంత ప్రాచుర్యం పొందినది .
ఈ వింశోత్తరి దశా విధానములో మానవుని పరమాయుర్ధాయము 12౦ సంవత్సరములుగా నిర్ణయం చేస్తూ గ్రహములకు దశా సంవత్సరములు తెల్పితిరి .

సూర్యుడు  6 సంవత్సరములు, చంద్రుడు   10 సంవత్సరములు , కుజుడు  7  సంవత్సరములు , రాహువు   18 సంవత్సరములు , గురుడు  16 సంవత్సరములు, శని  19  సంవత్సరములు, బుధుడు 17 సంవత్సరములు, కేతువు 7 సంవత్సరములు, శుక్రుడు 20 సంవత్సరములు
ఈ విధంగా తొమ్మిది గ్రహాల దశా సంవత్సరములు మొత్తం 12౦ సంవత్సరములు అవుతుంది .

ఉదా : 1 . 1 . 2010 శుక్రవారం మధ్యాహ్నము  ౦౩ . 25 ని.కు కాకినాడ లో ఒక అమ్మాయి పుట్టినది అనుకొందాము .  ఆ రోజు పునర్వసు నక్షత్రము ఉదయం 06 . 43 ని.కు ప్రారంభమై రాత్రి గం ౦౩ . 57  ని .లు వరకు ఉన్నది
ఈ అమ్మాయి పుట్టిన దశను ఈ విధముగా తెలుకోవచ్చు

పునర్వసు నక్షత్ర ప్రమాణము మొత్తం 21 గంటల 14 ని .లు ఉన్నది .జాతకురాలు జన్మించిన సమయమునకు పునర్వసు నక్షత్రము లో గడచిన సమయము 08 గం .ల 42 ని.లు పునర్వసు నక్షత్రములో మిగిలిన సమయము గం.లు 12 . ౩2 ని.లు ఇక్కడ పునర్వసు నక్షత్రమునకు గురుడు అధిపతి అగుచున్నాడు కావున ఈమె గురు మహర్దశ లో పుట్టింది అని తెలుసు కోవాలి  

దశా శేషం తెలుసు కోవడం నక్షత్ర ప్రమాణము మొత్తము నుండి జాతకులు జన్మించిన సమయమునకు నక్షత్రములో గడచిన సమయమునకు అధిపతియైన గ్రహము యొక్క దశా సంవత్సరములను లెక్కవేసి తీసి వేస్తె దశా శేషము వస్తుంది

ఈ అమ్మాయి గురు దశా సంవత్సరములు 16 జన్మించిన సమయమునకు గడచిన సంవత్సరములు 6సం 6 నెలలు 22 రోజులు పోగా 09 సంవత్సరముల 05 నెలలు 8 రోజులు  గురు మహర్దశ శేషము ఉన్నది .
 జన్మ తేది        01 .  01 . 2010
                    08 . 05 . 09     గురు దశా శేషం
                   ---------------
                   09 . 06 . 2019  వరకు
తదుపరి          ౦౦ . ౦౦ . 19     శని మహర్ద శ
                    ---------------
తదుపరి          09 . 06 . 20౩8  వరకు  ఈవిధముగా పైన చెప్పినట్లు ఒక దశ తరువాత మరియొక దశ ప్రారంభ మగును .   

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...