2015-02-16

మిధునరాశి

మిధునరాశి : ఈ రాశి వాయు తత్వ రూపము కలది . దీనికి అధిపతి బుధుడు . ఈ రాశిలో జన్మించిన వారు  చురుకుదనము కలిగి యుందురు . విషయ పరిజ్ఞానము ఎక్కువగా ఉండును . వీరికి ఆత్మాభిమానము అధికము . కొంత చపల మనస్సు కలిగి ఉంటారు . మొదలు పెట్టిన పనిని మధ్యలో ఆపి మరొక పని గురించి ఆలోచిస్తారు . సాధారణంగా ప్రేమ సంభంద విషయములలో పరాజయము కలుగును . ఎదుటి వారికి విలువనివ్వక తమకు తోచిన విధంగా ప్రవర్తించుట వలన కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు .

వీరు రెండు రకముల ప్రవర్తన కలిగి యుందురు . ఒకప్పుడు చాల గంభీరముగానూ . ఒకొక్కప్పుడు పిరికి వారుగానూ ఉందురు .వీరు చేయు పనుల యందు ప్రణాళిక లోపించును , జాగ్రత్త వహించినచో కొంత అభివృద్ది సాధించ గలరు . వీరి జీవితములో రెండు గానీ అంతకన్నా ఎక్కువ గానీ వృత్తులను చేపట్టగలరు .టెక్నికల్ రంగములలో వీరు అధికముగా రాణింతురు . ముఖ్యముగా వీరు ఆర్ధిక రంగములలో అనేక రకముల ప్రణాలికలు రచించ గలరు ., కానీ తమ స్వంత విషయముల యందు సరియైన ఆర్ధిక ప్రణాళికతో వ్యవహరించలేరు . వీరి జీవితము కొద్ది కాలము కష్ట తరముగా , మరికొద్ది కాలము సుఖముగా గడచును .  

జీవిత భాగస్వామి ఆలోచనలతో ముందుకు వెళ్ళుట మంచిది . వీరికి గ్రాహ్య శక్తి అధికము . మేధావులు, ,నటనా రంగముల యందు విశేష ప్రతిభ కనబరచ గలరు . జీవితములో కూడా కొంత నటింతురు . ఆత్మీయులకు కూడా నిజం చెప్పరు . కొంత గర్వము కలవారు . సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు శారీరకంగా కష్టించి పని చేయరు . వీరు తమ ఆలోచనా శక్తి తో మానసికంగా శ్రమిస్తారు . ఈ రాశివారు రిటైల్ వ్యాపారములో బాగా రాణిస్తారు .

మిధున రాశిలో జన్మించిన జాతకులకు వాక్చాతుర్యము బాగుంటుంది . అందువలన పరిస్థితులను బట్టి , సందర్భమును బట్టి మాటలాడుదురు . సమయోచిత నిర్ణయములు తీసుకోనుటలో సిద్ధహస్తులు . వీరు ఎవరితోనూ విరోధము పెట్టుకొనుటకు చూడరు .ఎలాంటి వారినైనా తమ మాటల గారడితో నమ్మిస్తారు .వీరిలో కొందరు జ్యోతిష్య శాస్త్రము యందు, మరియు  వాయు సంబంధ పరిశోధనలు గావించగలరు . వీరికున్న అపూర్వమైన మేధాశక్తి చే  కొత్త , కొత్త విషయముల పై పరిశోధన చేయ గలరు . ప్రచార (పబ్లిసిటి )రంగములో వీరు బాగా రాణిస్తారు.  వీరి మనస్సు ఎప్పుడు నూతనత్వమును కోరుకొంటుంది .

2015-02-15

కర్కాటక రాశి

కర్కాటక రాశి :  ఈ రాశికి అధిపతి చంద్రుడు . ఇది జలతత్వము కలిగిన రాశి . ఈ రాశి యందు జన్మించిన వారు సున్నితమైన మనస్తత్వము కల్గి యుందురు . వీరికి ఇతరుల పట్ల అభిమానము ఎక్కువగా ఉండును . దయ కలవారు . ప్రేమ కలవారు . సాధారణంగా వీరు ఎవరికీ హాని తలపెట్టరు. అందమైన రూపము కలవారు . వీరు వర్తమాన విషయముల గురించి పెద్దగా ఆలోచించరు . భవిష్యత్తును గురించి ఎక్కువగా ఆలోచిస్తారు .

ధనమును పొదుపు చేయుటలో చాలా ఖచ్చితమైన ప్రణాళికతో ఉంటారు . ఎంత ధనము దాచిననూ తృప్తి చెందరు . ఒక విధంగా చెప్పాలంటే వీరు అత్యాశ పరులని అనుకోవచ్చు . ఇతరుల వలన  జరిగిన కష్ట , నష్టములను ఎక్కువ కాలము మనస్సులో ఉంచుకోరు . వీరు సాదా సీదాగా  ఉంటారు. ఆడంబరములకు దూరంగా ఉంటారు . ఏదైనా సాధించాలి అనుకొంటే మాత్రము పట్టు బట్టి మరీ అనుకొన్నది సాధించడము వీరికున్న ప్రత్యేక లక్షణం .

వీరు శాంత స్వభావులు , వీరికి సాధారణముగా కోపము రాదు . కొంచెము చపల చిత్త మనస్సు కలిగియుందురు. అత్యవసర పరిస్తితులలోనూ , జీవితములో కలుగు క్లిష్ట పరిస్థితులలోనూ కుటుంబ సభ్యులు వీరికి అండగా ఉంటారు . ఈ రాశి వారికి భార్యా భర్తల మధ్య అన్యోన్యత కొంచెం తక్కువనే చెప్పాలి .ఎలా అంటే భార్య భర్తల ఇరువురి లో ఈ రాశికి చెందిన వారు రెండవ వారికి లోబడి ఉంటారు . ఇతరుల వలన అవమానము జరిగితే మాత్రము సహించలేరు . ఏదో విధంగా ప్రతీకారము తీర్చుకొంటారు .

 వీరు మనస్సులో ఏది దాచుకోరు ,తమ శ్రేయస్సు కోరేవారు, ఆప్తులు ,స్నేహితులతో మనసులోని భావాలను పంచుకొంటారు . ఏ విషయము నందైనా దీర్గముగా ఆలోచించి గానీ నిర్ణయము తీసుకోరు . విద్యా సంబంధ విషయములలో వీరు మంచి ప్రావీణ్యతను కనబరుస్తారు .   

2015-02-02

సింహరాశి

సింహరాశి : ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు . ఇది స్థిర రాశి మరియు అగ్ని తత్వము కలది . ఈ రాశిలో జన్మించిన వారు గంభీర వదనము కలిగి యుందురు . వీరికి పట్టుదల ఎక్కువ . అనుకొన్నది సాధించే వరకు నిద్రపోరు .  గర్వము , అహంకారము అధికముగా ఉండును . ఏ సందర్భములోనూ మోసపోయే అవకాశము ఉండదు .. వీరితో విరోధము పెట్టుకొనుట మంచిది కాదు . స్నేహము చేసిన వారిని, నమ్మిన వారిని ఆదుకొనే స్వభావము, దయార్ద్ర హృదయము కలవారు . 

వీరికి కోపం ఎక్కువ . అందరూ తాను చెప్పినట్లు నడచు కోవాలని అనుకొంటారు . ఎవరైనా వీరిని అవమాన పరిస్తే తట్టుకోలేరు . కసి ఎక్కువ , డబ్బును దుబారా గా ఖర్చు చేస్తారు . పొదుపు పాటించరు. పరులకు ఉపకారము చేయుటలో ముందుంటారు . వీరు ఇతరులపై ఆధారపడి బ్రతుకుతారు . కానీ తామే అన్నింటా గొప్ప వారమని గర్వ పడతారు . నిర్మోహమాటంగా మాట్లాడుదురు . గర్వము తగ్గించుకొని ప్రవర్తిస్తే ఈ రాశివారు జీవితములో చాలా ఉన్నత స్థితికి చేరుకోగలరు .  

నాయకత్వ లక్షణము లుండును అధికారులు గానూ , రాజకీయ నాయకులుగానూ చెలామణి అగుదురు .కుటుంబము నందు , సంఘము నందు పెద్ద మనుషులుగా గుర్తింప బడుదురు . ఈ రాశి లో జన్మించిన కొంత మందికి జీవితములో ఏదో ఒక సందర్భములో  పదవీ యోగము కల్గుచున్నది  . వీరు పొగడ్తలకు లొంగి పోవుదురు. రాజసము కలవారు . వీరికి ధన సంపాదన అధికముగా ఉండును .

ఈ రాశి వారికి సాధారణంగా పూర్వీకుల సంపాదించిన వారసత్వపు ఆస్తులు ఉండును . అట్లు లేకున్నా ఏదో ఒక సందర్భములో అనుకోని అదృష్టము కలసి వచ్చి ధనవంతులు అవుతారు . పెద్ద పెద్ద సంస్థల యజమానులు గా రాణిస్తారు . ఎదుటివారి బలహీనతలు తెలుసుకొని తమకు అనుకూలముగా మార్చు కొందురు. సమాజములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు .  .   
బ్లాగు మిత్రులందరికీ నా మనవి . దయచేసి ఈ బ్లాగు పోస్టులను షేర్ చెయ్యండి ..

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...