సంఖ్యా శాస్త్రము ప్రకారము 1 నుండి 9
వరకు ఉన్న సంఖ్యల స్వభావము వాటి యొక్క ప్రభావము మొదలగు విషయములను క్షుణ్ణంగా
తెలుసుకుందాము .
1 ఇది సూర్యునకు సంకేతము . 1 వ నెంబరు కు చెందిన
వారికి 6 వ సంఖ్య 8 వ సంఖ్యా శత్రు సంఖ్యలు . వీరికి ఆరు , మరియు ఎనిమిది సంఖ్యా
లక్కీ నెంబరు గా ఉన్న వారికి సరి పడదు .
రెండు , మూడు నాలుగు , ఏడూ ,
తొమ్మిది సంఖ్యా కలవారికి సఖ్యత ఉంటుంది .
1 వ సంఖ్యా అధికారము , హుందాతనం , హోదా
, గౌరవము , రాజకీయములు , ప్రభుత్వ సంభందిత వ్యవహారములు , గొప్ప గొప్ప వ్యవహారములు
, భారీ పరిశ్రమలకు అధిపతులు , నాయకత్వము , గొప్ప పదవులను చేపట్టుటకు కారకత్వము వహించును .
ఈ సంఖ్య ఆధిపత్యములో ఉన్న వారు
ముఖ్యముగా 6 మరియు 8 వ సంఖ్యలకు చెందిన
వారితో ఏ విధమైన వ్యవహారములు
చేయకూడదు . వ్యాపార సంబంధములు ఉండకూడదు .
భాగ్యస్వామ్య వ్యాపారములు చేయకూడదు .
అట్లు చేసిన ఎడల నష్టములు కలుగును . వారి
చేతిలో మోసమునకు గురి కాగలరు .
6 మరియు 8 వ సంఖ్యకు చెందిన వారు
మీకు ఎదురుగా ఉన్నప్పుడు ఏమీ చేయలేరు . కానీ
వెన్నుపోటు పొడుస్తారు . అభివృద్ధికి
ఆటంకములు ఏర్పరుస్తారు . దొంగ దెబ్బ తీస్తారు .
ఈ సంఖ్యకు చెందిన వారు పైన తెలిపిన 6
లేక 8 సంఖ్యలకు చెందిన వారిని వివాహము
చేసుకొనుట వలన దాంపత్య సౌఖ్యము ఉండదు
. తగవులు , కోర్టు కేసులు ఎదుర్కొందురు.
విడాకులు తీసుకోవడం , విడిపోవడము ,
తద్వారా మానసికముగా అనేక సమస్యలు
ఎదుర్కొందురు .