2014-09-26

NUMBER 1

సంఖ్యా శాస్త్రము ప్రకారము 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్యల స్వభావము వాటి యొక్క ప్రభావము మొదలగు విషయములను క్షుణ్ణంగా తెలుసుకుందాము .

1  ఇది సూర్యునకు సంకేతము . 1 వ నెంబరు కు చెందిన వారికి 6 వ సంఖ్య 8 వ సంఖ్యా శత్రు సంఖ్యలు . వీరికి ఆరు , మరియు ఎనిమిది సంఖ్యా లక్కీ నెంబరు గా ఉన్న వారికి సరి పడదు .
రెండు , మూడు నాలుగు , ఏడూ , తొమ్మిది సంఖ్యా కలవారికి సఖ్యత ఉంటుంది .
1 వ సంఖ్యా అధికారము , హుందాతనం , హోదా , గౌరవము , రాజకీయములు , ప్రభుత్వ సంభందిత వ్యవహారములు , గొప్ప గొప్ప వ్యవహారములు , భారీ పరిశ్రమలకు అధిపతులు , నాయకత్వము , గొప్ప పదవులను చేపట్టుటకు  కారకత్వము వహించును .

ఈ సంఖ్య ఆధిపత్యములో ఉన్న వారు ముఖ్యముగా 6 మరియు 8 వ సంఖ్యలకు చెందిన
వారితో ఏ విధమైన వ్యవహారములు చేయకూడదు . వ్యాపార సంబంధములు ఉండకూడదు .
భాగ్యస్వామ్య వ్యాపారములు చేయకూడదు . అట్లు చేసిన ఎడల నష్టములు కలుగును . వారి
చేతిలో మోసమునకు గురి కాగలరు .

6 మరియు 8 వ సంఖ్యకు చెందిన వారు మీకు ఎదురుగా ఉన్నప్పుడు ఏమీ చేయలేరు . కానీ
వెన్నుపోటు పొడుస్తారు . అభివృద్ధికి ఆటంకములు ఏర్పరుస్తారు . దొంగ దెబ్బ తీస్తారు .
ఈ సంఖ్యకు చెందిన వారు పైన తెలిపిన 6 లేక 8 సంఖ్యలకు చెందిన వారిని వివాహము
చేసుకొనుట వలన దాంపత్య సౌఖ్యము ఉండదు . తగవులు , కోర్టు కేసులు ఎదుర్కొందురు.
విడాకులు తీసుకోవడం , విడిపోవడము , తద్వారా మానసికముగా అనేక సమస్యలు
ఎదుర్కొందురు .


2014-07-27

కృతజ్ఞతలు

నేను ప్రారంభించిన జ్యోతిష్యము నకు సంబంధించిన  బ్లాగుకు గత ఆరునెలల కాలములో  విశేష ఆదరణ లభించినందుకు బ్లాగు వీక్షకులు అందరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను .

ఈ బ్లాగులో ప్రచురించే విషయములన్ని ప్రతి ఒక్కరికి ఏదో విధముగా ఉపయోగపడతాయి అనే ఉద్దేశ్యముతో ఈ బ్లాగును ప్రారంభించడం జరిగింది . నాకు తెలిసినంత వరకు జ్యోతిష్య శాస్త్రమునకు సంబంధించిన విషయములను క్లుప్తముగా వివరించుటే నా ధ్యేయము . 

జ్యోతిష్యములో చెప్పిన విషయములు అన్నీ ముఖ్యముగా మన భారతీయ సంస్కృతి లో ఆచార వ్యవహారములలో ముడిపడి ఉన్నవి .
బిడ్డ జన్మించిన నాటి నుండి బారసాల , నామకరణము , కేశ ఖండన , అక్షరాభ్యాసము , చదువు , వృత్తి , ఉద్యోగము , వివాహము ఆడ పిల్లలైతే రజస్వల , వివాహము , సీమంతము మొదలగు సమస్త శుభకార్యములలోనూ  జ్యోతిష్యము ప్రధానముగా ఉన్నది . 

ఈ శాస్త్రము మన భారతీయులకు ప్రత్యక్షముగా గానీ , పరోక్షముగా గానీ హిందువులకు అవసరము . పండుగలు , వాటి విశిష్టత లు ఆయా మాసములలో మన హిందూ సంస్కృతిని ప్రపంచానికి తెలియ పరచుటలో మన పూర్వీకులు మనకు అందించిన అద్బుతమైన జ్యోతిష్య శాస్త్రమే ఆధారమై ఉన్నది . 

నేను ఈ బ్లాగును ప్రారంభించిన ఆరు నెలలలో 100000 పైగా వీక్షకులు చూడడం జరిగింది . నా ఈ బ్లాగును వీక్షించిన ప్రతి ఒక్కరికి మరొక్క సారి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు  తెలుపుకుంటూ ఈ బ్లాగును మీ స్నేహితులకు , బంధువులకు షేర్ చేసి మరింత తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నాను .  

ద్వాదశ రాశులు - ప్రమాణములు


ద్వాదశ రాశులను 12 లగ్నములుగా సూచించి లగ్న ప్రమాణములు చెప్పినారు . ఇవి భూమిపై నున్న అక్షాంశ రేఖాంశ ములను బట్టి కొద్ది మార్పులు వచ్చును . సుమారుగా భారత దేశములో రాజమండ్రికి లగ్న ప్రమాణములు ఈ విధంగా ఉన్నవి .

మేష రాశి ప్రమాణము 1 గం .   45 ని . లు  00 సెకన్లు
వృషభ రాశి ప్రమాణము 2 గం . 01 ని . లు 39 సెకన్లు
మిధున రాశి ప్రమాణము 2 గం .11 ని . లు 12 సెకన్లు
కర్కాటక ప్రమాణము 2 గం .11 ని . లు 51సెకన్లు
సింహ రాశి ప్రమాణము 2 గం . 06ని . లు19 సెకన్లు
కన్య రాశి ప్రమాణము 2 గం .04 ని . లు 59సెకన్లు
తులరాశి ప్రమాణము 2 గం . 09 ని . లు39 సెకన్లు
వృశ్చిక రాశి ప్రమాణము 2గం .13ని . లు 24సెకన్లు
ధనుస్సు రాశి ప్రమాణము 2 గం .07ని. లు 26సెకన్లు
మకర రాశి ప్రమాణము 1 గం . 54 ని . లు48 సెకన్లు
కుంభ రాశి ప్రమాణము 1 గం .  38 ని . లు28 సెకన్లు
మీన రాశి  ప్రమాణము 1 గం .  36 ని . లు 15సెకన్లు

ఈ విధంగా పన్నెండు రాశుల ప్రమాణము కలిపితే 23 గంటల 56 నిమిషములు వచ్చును . తిరిగి అవే లగ్నములు వచ్చు చున్నవి రోజుకు 24 గంటలు అయినపుడు ఒక రోజులో 23గంటల 56 నిముషాలు గతించి తర్వాత లగ్నములో సుమారు 4 నిమిషములు భూ గమనము జరుగుతుంది , దీనినే జ్యోతిష్యులు లగ్నభుక్తి గా సూచిస్తున్నారు .

ఉదా : ఏప్రిల్ నెలలో  13నుండి 16 వతేదీ లోపల మేష సంక్రమణము జరుగుతున్నది . మేష లగ్న ప్రమాణమును 1గంట 45 ని. లను 30 భాగాలు గా విభజిస్తే మేష సంక్రమణము జరిగిన నాటినుండి రోజుకు 3 నిమిషముల 30సెకన్లు లగ్న భుక్తి జరిగి 30రోజుల తరువాత భూమి 31వ డిగ్రీకి వస్తుంది . దీనినే వృషభ సంక్రమణం అంటారు . ఈ విధంగా భుక్తి జరుగుచు సంవత్సరములో 12 సంక్రమనములు వచ్చును

27 నక్షత్రములను  దేవ రాక్షస మానుష గణములుగా విభజించిరి
అశ్విని ,మృగశిర ,పునర్వసు , పుష్యమి , హస్త  స్వాతి , అనూరాధ శ్రవణం రేవతి  ఈ తొమ్మిది నక్షత్రములు : దేవగణమునకు చెందినవి 
కృత్తిక ,ఆశ్రేష , మఖ చిత్త , విశాఖ , జ్యేష్ట , మూల ,ధనిష్ఠ, శతభిషం  ఈ తొమ్మిది నక్షత్రములు : రాక్షస గణమునకు చెందినవి
భరణి ,రోహిణి , ఆరుద్ర ,పుబ్బ, ఉత్తర ,పూర్వాషాడ, ఉత్తరాషాడ, పూర్వాబాద్ర, ఉత్తరాభాద్ర ఈ తొమ్మిది నక్షత్రములు : మనుష్యగణమునకు చెందినవి.

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...