ఆశ్రేష నక్షత్రము లో పుట్టిన వారు క్రూర స్వభావము
కలిగి ఉంటారు . కోపిష్టులు . నిదానముగా ఆలోచించలేరు . వీరికి స్వార్ధబుద్ది ఉండును.
పరిస్థితులను ప్రభావమునకు లోనగుదురు . చంచల మనస్సు కలవారు .ఇతరులపై ఆధారపడి
బ్రతుకుతారు . స్వతంత్రత ఉండదు . స్థిరముగా ఉండలేరు . ఈ నక్షత్రమున జన్మించిన వారి
జీవితము ఒడిదుడుకులతో ఉండును. తొందరగా నిరాశ నిస్పృహలకు లోనయ్యే స్వభావము కలిగి
ఉంటారు .
వీరు జీవితమున ఆలస్యముగా స్థిరపడతారు . అదృష్టవశాత్తు ఎవరో ఒకరు వీరికి బ్రతుకు దెరువు కొరకు మార్గమును చూపించ గలరు . చిన్న చిన్న సమస్యలు ఎదురైనా తట్టుకోలేరు . లోకములోని కష్టములన్ని తమకే వస్తున్నాయని భాద పడుతుంటారు . ఈర్ష్య , అసూయలు కలిగి ఉంటారు . అయిననూ దైవబలము వీరికి తోడుంటుంది .

ఈ నక్షత్ర జాతకులు యవ్వన ప్రారంభ దశలో
దురలవాట్లకు లోనయ్యే ప్రమాదము ఉన్నది . ముఖ్యముగా త్రాగుడు , స్త్ర్రీల పట్ల
ఆకర్షితులవడము లాంటి వ్యసనముల బారిన పడతారు. జాగ్రత్త వహించుట మంచిది . ఆరోగ్య
విషయములో డస్ట్ ఎలర్జీ , స్కిన్ ఎలర్జీ మరియు చర్మ సంభంద వ్యాధులతో భాద పడతారు . ఎళ్ల
వేళలా పరిశుభ్రతను పాటించుట అవసరము .
వీరు సుమారు ౩౦ సంవత్సరముల వరకు జీవితమున
స్థిరపడు అవకాశములు చాలా తక్కువ . వివాహ అనంతరము కొంత మార్పు వచ్చును .
జీవితభాగస్వామి వలన అదృష్టము కలసి వచ్చును . భార్యా మనస్తత్వము తెలుసుకొని
ప్రవర్తించుట మంచిది . వీరు ఎదుటి వారిని నమ్మరు . తమకు తెలిసినదే యదార్ధమని
అనుకొంటారు .తెలిసి కూడా తప్పులు చేయుటకు వెనుకాడరు . తాము చేసినది తప్పు అని
తెలిసిన మొండిగా వాదిస్తారు . సంపాదన సామాన్యముగా ఉంటుంది .
కుటుంబ సభ్యుల పట్ల అభిమానము , మమకారము కలవారు . భయమును కలిగి ఉంటారు . చేయు వృత్తి యందు కాన్సంట్రేషన్ తక్కువగా ఉంటుంది .శారీరక సౌఖ్యమునకై ప్రాకులాడతారు . భార్యను విడచి ఉండలేరు . సామ దాన దండోపాయములను ఉపయోగించి పరిస్థితులను తమకు అనుకూలముగా మార్చుకొంటారు . ఎదుటి వారి బలహీనలతలను తెలుసుకొని దెబ్బకొడతారు

No comments:
Post a Comment