అశ్రేష
,విశాఖ , జ్యేష్ట , మూల నక్షత్రములలో జన్మించిన వారికి వివాహము విషయములో కొన్ని
దోషములు ఉన్నవి .అవి
ఏమిటో చూద్దాం ?
ఆశ్రేష
నక్షత్రములో జన్మించిన కన్య ను వివాహమాడిన అత్తగారు నశించును . విశాఖ నక్షత్రమున
జనించిన స్త్రీని వివాహ మాడిన మరిదికి గండము. జ్యేష్ట నక్షత్రమున పుట్టిన పడతిని
పెండ్లాడిన బావగారికి దోషము, మూలా నక్షత్రమున పుట్టిన కన్యను పెండ్లాడిన మామగారికి
దోషము . అయితే పై నక్షత్రములలో జన్మించిన స్త్రీలకే గాని పురుషులకు దోషము
వర్తించదని కొందరు, స్త్రీ పురుషులకు ఎవరికైనా దోషమే అని కొందరు మహర్షులు అభిప్రాయ
పడి నట్లు శాస్త్రముల ద్వారా మనకు తెలియుచున్నది .
అనుభవములో చూడగా పైన తెలిపిన దోషములు అందరికి వర్తించుట లేదు . కొంతమందికి మాత్రమే వర్తించు చున్నవి.కొంతమంది విషయములో ఈ విధముగా జరుగు చున్నది . మూల నక్షత్రమున జన్మించిన వారికి మామగారు గతించిన కుటుంబము నుండి జీవిత భాగస్వామి లభిస్తుంది . ఆశ్రేష నక్షత్రమున పుట్టిన వారికి అత్త లేనటువంటి సంభందము కుదురుతుంది . అలాగే విశాఖ , జ్యేష్ట నక్షత్రముల వారికి కూడా .
దోష
పరిహారముల కొరకై శాస్త్రము నందు చెప్పబడిన నవ గ్రహ శాంతి , నక్షత్ర జపములు, హోమ
శాంతి , మృత్యుంజయ జపములు జరిపించుట వలన దోషమని చెప్పబడిన వారికి దోషములు తొలగి
ఆయురారోగ్యములు కలుగుతాయి .
పైన
తెలిపిన నక్షత్రములు దోషప్రభావము కలిగిన నక్షత్రములు కదా ?
ఆయా
నక్షత్రముల యందు జన్మించిన వారిని వివాహము చేసుకోకూడదా? అని అనుమానము కలుగకమానదు. దీనికి ప్రత్యామ్నాయము ఈ విధముగా ఉన్నది . జాతక చక్రమును పరిశీలించే టప్పుడు ,
జ్యేష్ట సంతానము వలన తండ్రి , కనిష్ట సంతానము వలన తల్లి కి సంభందించిన విషయములు
తెలుసు కోవచ్చుననీ , వారి వలన తల్లి దండ్రుల ఆయుర్దాయమును కూడా తెలియుననీ మహర్షులచే
చెప్పబడినది .
ఇక్కడ
మనము ఒక విషయమును పరిగణనలోకి తీసుకొందాం .
మూలా నక్షత్రమున జన్మించిన వారికి సంభందము చూసేటప్పుడు ,మొదటి సంతానముగా జన్మించిన
వారికి ఇచ్చి వివాహము చెయ్యకూడదు . అలాగే ఆశ్రేష నక్షత్రమున జన్మించిన వారికి
చివరి సంతానముగా పుట్టినవారికి ఇచ్చి పెండ్లి చెయ్యకూడదు
అలాగే
జాతక చక్రము ప్రకారము సోదర , సోదరీమణులు గురించి ఈ విధముగా ఉన్నది . లాభస్థానము లో
నైసర్గిక పాపగ్రహములు ఉన్నప్పుడు జాతకుల కన్నా ముందు పుట్టిన వారు , మూడవ స్థానమున
పాప గ్రహములు ఉన్న వారికి జాతకులకన్నా తరువాత పుట్టినవారు గతించుననీ తెలియు
చున్నది .
కావున
జాతకము లను జాగ్రత్తగా పరిశీలించి వివాహము జరిపించాలి . ఎందు కనగా జ్యేష్ట
నక్షత్రములో పుట్టిన వారి వలన బావ గారికి , విశాఖ నక్షత్రమున జనించిన వారి వాలన మరుదులకు
దోషమనీ ఉన్నది . ఇక్కడ ఇంకొక విషయము జ్యేష్ట నక్షత్రములో జన్మించిన వారికి బావ
లేని సంభందము చెయ్యాలి . అలా గానీ జ్యేష్టులకు ఇచ్చి వివాహము చెయ్య కూడదు .
అలాగే
విశాఖ నక్షత్రములో పుట్టిన వారికి చివరి సంతానముగా జన్మించిన వారికి ఇచ్చి వివాహము
జరిపించాలి . ఇది ముఖ్యముగా పురుషుల విషయములో ఆచరించాలి .
No comments:
Post a Comment