2013-07-05

గోచారము – సూర్యుడు



గోచార రీత్యా జన్మ రాశి నుండి సూర్యుడు పన్నెండు రాశులలో సంచరించు సమయమున శుభాశుభము

        .శ్లోకము : దేహార్తీ స్సత్వ సంతాప: కాలాతిక్రమ భోజనం
                   బంధు మిత్ర సుహృద్వేషః చంద్ర రాశి గతౌ రవి: 
సూర్యుడు జన్మ రాశిలో ఉన్నప్పుడు శరీరమునందు భాధలు జ్వర పీడ , మనస్సున సంతోషము లేకపోవడము , వేళకు తిండి తినక పోవడము బంధువుల తోనూ , స్నేహితుల తోనూ , ఆత్మీయుల తోనూ విరోధము ఏర్పడును 
       శ్లోకము : హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శ్మిరోవ్యధా
                నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతే రవౌ 
జన్మ రాశి నుండి సూర్యుడు రెండవ రాశిలో సంచరించు చున్నప్పుడు హీనముగా ఉండుట , చెడు స్నేహములు , మనస్సుకు సంకటములు , మనో వ్యధ , శిరస్సునకు సంభదించిన రోగములు చేయు వృత్తి వ్యాపార రంగములలో అభివృద్ధి లేకపోవడము లాంటి ఫలితములు కల్గును .
         
                   శ్లోకము : ఆరోగ్యం నిత్య సంతోష: బంధుమిత్ర సమాగమః
                             అర్ధలాభః పుత్రసౌఖ్య మిష్టసిద్దీ తృతీయగే
సూర్యుడు మూడవ రాశిలో సంచరించు సమయములో శరీరము ఆరోగ్యముగా ఉండును. మనస్సున ఉల్లాసము బంధువులు స్నేహితులు మొదలగువారితో ఐక్యముగా ఉండడము , ధన ప్రాప్తి కలిగి , పిల్లలవలన సౌఖ్యము కలుగును . కోరినవన్నీ సిద్ధించును .

                   శ్లోకము :అంతక్లేశం గృహచ్చిద్రం సౌఖహానీ నుభోజనం
                             ప్రయాణే విఘ్న మాప్నోతి చతుర్దే రవి సంయుతే
నాల్గవ రాశిలో రవి గోచార రీత్యా వచ్చినపుడు శారీరక సంకటములు , ఇంటిలో ప్రశాంతత లేకపోవుట , సుఖము లేక ఉంటారు . ప్రయాణముల యందు ఆటంకములు కలుగు చుండును .

                   శ్లోకము : దేహాలస్యం మనస్తాపం సుహృత్క్లేశం ధన వ్యయం
                             బుద్ది చాంచల్యం మాప్నోతి పంచమే రవి సంయుతే
పంచమ రాశిలో సూర్యుడు సంచరించు నపుడు శరీరమునందు సోమరి తనము , శారీరక రుగ్మతలు , స్నేహితుల వలన కష్టములు ఏర్పడును , ధన వ్యయము జరుగును , బుద్ది స్థిరముగా ఉండదు .

                   శ్లోకము :షష్ట రవౌ సుసౌఖ్యాదీన్ యత్న కార్యార్ధ సాధనం
                             దేహారాగ్యోది సంతోషం వస్త్ర ధాన్యాది లాభ కృత్
ఆరవ రాశిలో రవి సంచరించునపుడు సుఖముగా ఉండును. తలచిన పనులు ఏ ఆటంకములు లేకుండా సాధింతురు సంతోషముగా ఉంటారు , వస్త్ర లాభము , ధనధాన్య లాభములు కలుగును

                   శ్లోకము :సామంత జన విద్వేషః దార పీడా సుతామాయం
                             ఉత్సాహ భంగ కార్యాణి గోచరే సప్తమే రవౌ
సప్తమ రాశిలో సూర్యుడు సంచరించు చున్నప్పుడు ఇరుగు పొరుగు వారలతో తగవులు ఏర్పడును , కుటుంబ సభ్యులకు ,భార్యా పిల్లలకు రోగములు  , చేయు పనుల యందు ఆటంకములు కలిగి నిరుత్సాహముగా ఉందురు .
                   శ్లోకము :దుర్దోషః శత్రుసంవాదో గమనాగమన వ్యధా
                             దుఃఖవార్తా శ్రుతంచైవ అస్తమస్తో యధారవి:
ఎనిమిదవ ఇంట సంచరించు చున్న సూర్యుడు  చెడ్డ పనుల వలన కలిగేడు దోషములను , శత్రువులతో వాదోపవాదములు ఎక్కువగా ప్రయణములు చేయుట వలన కష్టమును కలుగ చేయును .

                   శ్లోకము :నిందాపరాద కలహం నిర్దోషశ్చ ధనక్షయం
                             పుణ్యలాభార్ధ నాశశ్చ విచారో నవమే రవౌ
తొమ్మిదవ ఇంటిలో రవి ఉన్నప్పుడు తగవులు ఏర్పడును , నిందలు కలుగును ,అకారణ కలహములు వచ్చును . ధన నష్టము సంభవిన్చును . పుణ్యము నశించును మనస్సుకు విచారము కలుగును .

                   శ్లోకము :అర్ధసిద్ది స్సదారోగ్యం బంధు మిత్ర సమాగమః
                             రాజదర్శన సల్లపౌ సుసౌఖ్యం దశమే రవౌ
పదవ రాశిలో సంచరించు చున్న సూర్యుని వలన ధన లాభము కలుగును , ప్రభుత్వ అధికారుల దర్శనము కలుగును . మంచి ఆరోగ్యవంతులై బంధుమిత్రులతో సంతోషముగా ఉంటారు .

                   శ్లోకము : అర్ధంచ స్వకులాచారః గృహే నిత్యోత్సవః శుభం
                             నిత్యమాధుర్య భుక్తిశ్చ లాభే చైకాదశే రవౌ
పదకొండవ రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు గృహమునందు వివాహాది శుభకార్యములు జరుగును , మంచి భోజన సౌక్యము కలుగును . కుటుంబము నందు సంతోషముగా ఉంటారు

                   శ్లోకము :స్వస్తాన నాశనం చైవ బంధురోగో ధనవ్యయః
                             ప్రాణ పర్యంతి మాపత్తిం రవమానం వ్యయే రవౌ
పన్నెండవ రాశిని పొందిన రవి స్థాన భ్రష్టత్వము కలిగించును . బంధువులకు రోగములు కలుగును , తద్వారా ధనము వ్యయమగును , అవమానములను ఎదుర్కొంటారు .         

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...