2013-07-02

లగ్నము - శని



మేష లగ్నములో పుట్టిన వారికి లగ్నము నందు శని యున్న జాతకులు బలహీన శరీరము కలిగి యుందురు .
ఇది శనికి నీచ స్థానము . కావున ఆయాసము , అలసట మొదలగు రోగ లక్షణములు ఉంటాయి . శరీరములో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది . నరముల నిస్సత్తువ కలిగి సన్నగా ఉంటారు .

2 వ స్థానమైన వృషభ రాశిలో శని యున్న జాతకులుకు సమయమునకు ధనము చేతికందదు. ప్రతి పని ఆలస్యముగా జరుగు తుంది .కుటుంబ సౌఖ్యము తక్కువ . వీరికి చిన్న తనములో మాటలు ఆలస్యముగా వచ్చును . మాటలాడుటలో తడబడు చుందురు . సభా పిరికి .వీరికి వివాహాది శుభ కార్యములు ఆలస్యముగా జరుగుతాయి .

మూడవ ఇంట శనియున్న వారికి సోదర సౌఖ్యము ఉండదు . వీరికన్నా చిన్న వారికి నష్టములు కలుగును . సోదర నాశనము తప్పదు .

నాల్గవ స్థానమైన మాతృ స్థానములో శని ఉండుట వలన తల్లి ప్రేమ తక్కువగా పొందుతారు . వీరిలో కొంత మంది దత్తత ఇవ్వ బడతారు . ఒక్కొక్కప్పుడు తల్లికి ప్రాణ నష్టము కలుగును . విద్యా సంభంద విషయములలో వెనుక బడతారు . చదివిన విషయములు గుర్తుండవు . బద్దకము ఎక్కువగా ఉంటుంది .

అయిదవ స్థానములో శని యున్న జాతకులు మంద బుద్ది కలిగి ఉంటారు . సంతానము ఆలస్యముగా కలుగుతుంది . ఒకవేళ తొందరగా సంతానము కలిగితే స్త్రీ సంతానము కలుగుతుంది . జాతకులకు వారసులు ఉండరు .

ఆరవ స్థానములో శనియున్న వారికి పాదములకు సంబంధించిన వ్యాధులకు గురియగుతారు . వృత్తి యందు మార్పులు సంభవించును .

కళత్ర స్థానము లో శని ఉచ్చ స్థితిలో ఉంటాడు . ఈ స్థితి యున్న జాతకులకు వివాహము ఆలస్యముగా జరుగుతుంది . మొదట అనుకొన్న సంబంధము తప్పిపోవు అవకాశము లున్నవి . వివాహ అనంతరము జీవితము నెమ్మదిగా అభివృద్ది చెందుతుంది .

ఎనిమిదవ ఇంట శని యున్న జాతకులకు ఆయుస్సు బాగుంటుంది . కానీ వృత్తి యందు నిలకడ ఉండదు . తొందరగా పైకి రాలేరు . ఎక్కువ కాలము నిరుద్యోగులుగా ఉంటారు . వీరికి ఏ అవకాశము కలసి రాక నిరాశ చెందుతారు .
భాగ్య స్థానము నందు శనియున్న జాతకులు పితృ భాగ్యమును పొందలేరు . ఒకవేళ ధన వంతుల కుటుంబం లో జన్మించినా వీరి అనుభవమునకు వచ్చేసరికి ఆస్తి నశించి పోవును .

కర్మ భావము అనగా మకరము నందు శనియున్న జాతకులకు శని స్వక్షేత్ర స్థితిలో ఉన్న కారణము వలన శశ మహా పురుష యోగాన్ని పొందుతారు . దీని వలన సాధారణ స్థాయి నుండి అంచెలంచెలుగా ఉన్నత స్థితికి చేర గలరు .

లాభ స్థాన శని గ్రహ స్థితి వశమున జాతకులు దీర్గ కాలములో అనేక విధములుగా లాభపడుదురు . దీర్గాకాల ప్రణాలికలతో ముందుకు పోవుదురు .

పన్నెండవ స్థానమున శనియున్న వారు ఆశించిన దానిలో కొంత నష్టములు ఎదుర్కోక తప్పదు .ఉద్యోగ , వ్యాపార సంభంద వ్యవహారముల యందు చాల జాగ్రత్త అవసరము . వీరు సంపాదించిన ధనాన్ని గానీ కీర్తిని , పేరు ప్రఖ్యాతలను కోల్పోవలసి వస్తుంది .         

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...