2013-07-09

వివాహము

భారత దేశంలో భిన్న సంసృతులు విభిన్న సాంప్రదాయములు ఉన్నాయి . ఇక్కడ వివాహము అనేది ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది . వివాహము జరిగే ప్రతి ఇంటిలోనూ సందడిగా ఉంటుంది .చుట్టములు , స్నేహితులు , ఆప్తులు మొదలగు వారితో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది .

వివాహము లలో అనేక పద్దతులు ఉన్నాయి .
గంధర్వ వివాహము , పాణిగ్రహణము , మాంగల్య ధారణ, తిలక ధారణ  ఇలా ఇంకా అనేక రకముల పద్దతులు వారి వారి ఆచార సంప్రదాయముల ప్రకారము జరుగుతుంది .  ఎవరైనా గానీ పెళ్ళికి ముహూర్తమును నిర్ణయించుకొని ముహూర్తము ప్రకారము వివాహము చేసుకొను ఆచారము మన దేశములో పూర్వమునుండి ఉన్నది . .

ఈ మధ్య కాలములో సామూహిక వివాహములు అక్కడక్కడ జరుపుచున్నారు . మన పూర్వీకులు  వివాహమునకు బలమైన ముహూర్తమును నిర్ణయించి వివాహము  చేసుకోవాలని శాస్త్రములలో చెప్పియున్నారు . మరి సామూహిక వివాహములు జరిపే టపుడు అందరికి ముహూర్తములు సరిపోతాయా ?

స్త్రీ  , పురుషులు ఇద్దరు ఒకరి నొకరు ఇష్ట పడి ఇతర కుటుంబ సభ్యులతో సంభందము లేకుండా దేవాలయములోనో  లేక మరొక దగ్గరో తమకు తాముగా  ఇరువురు నిర్ణయించు కొని ప్రస్తుతము కాలములో  ప్రేమించి  పెళ్లి చేసుకొను చున్నారు .

.సాధారణముగా యుక్త వయస్సులో ఉన్న స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది .ముందు వెనుకలు ఆలోచించ కుండా తాత్కాలిక ఆకర్షణకు లోనై చాలా మంది తమ జీవితములను పాడుచేసుకొంటున్నారు . ఇక్కడ తల్లి తండ్రుల కూడా తమ బిడ్డల ప్రవర్తన పై ఒక కన్నేసి ఉంచడం మంచిది .  .

వివాహము అనునది శారీరక సంభందమునకు మాత్రమే కాదు . అది మనిషి జీవితమునకు ఆదర్శము కలిగించునది అయి ఉండాలి . వివాహము వలన వంశమునకు మంచి పేరు  ప్రఖ్యాతలు పెరగాలి . జీవితమునకు సార్ధకత చేకూరాలి .

వివాహ సంబంధము చూసేటపుడు ముఖ్యముగా ఆరు రకములుగా పరిశీలన చేయాలని పెద్దలు చెపుతుంటారు .
వయస్సు , అందము , ప్రవర్తన , కట్నకానుకలు , విద్యావంతులా కాదా అని మరియు కుటుంబ నేపధ్యము వీటన్నిటిని పరిశీలించ వలసి ఉంటుంది ..

ఇంకొక విషయము భారత స్త్రీ ని మాతృమూర్తి , భూదేవి అని పురాణాలలో వర్ణించారు . ఇది చాలా అద్భుతమైన విషయము . ఎందుకంటే ఇరవై సంవత్సరాలు తన కన్నతల్లి దండ్రుల వద్ద పెరిగిన స్త్రీ వివాహము జరిగిన వెంటనే సర్వస్వము మరచి పోయి మెట్టినింటికి అంకిత మవుతుంది   ..
 




No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...