2013-07-18

ఏలిన నాటి శని – పరిహారములు

ఏలిన నాటి శని జరుగు చున్నప్పుడు  గృహ నిర్మాణము చేస్తే ఆ గృహము నిర్మాణము పూర్తి కాదు. ఏదో విధమైన ఆటంకములు ఏర్పడి మధ్యలో ఆగి పోతుంది . సమయానికి డబ్బు చేతికి అందదు . పూర్తవడానికి చాలా కాలము పడుతుంది . అనేక ఒడుదుడుకుల ఎదుర్కొంటే గానీ గృహమును పూర్తి చెయ్యలేరు .

వివాహము నకు మాత్రము ఆటంకము కలుగదు . చాలా మందికి ఏలిన నాటి శని జరుగు చున్నప్పుడు వివాహము జరుగుతుంది . వధూ వరుల ఇద్దరిలో ఎవరో ఒకరికి అర్దాష్టమ శని , అష్టమ శని , ఏలిన నాటి శని ఉన్నప్పుడు మాత్రమే వివాహము జరుగు చున్నది . ఎంతో కాలము వివాహము జరుగ కుండా ఉన్న వారికి కూడా ఏలిన నాటి శని జరుగు చున్నప్పుడు వివాహము జరుగు చున్నది .

మన దృష్టిలో వివాహము అనేది శుభ కార్యము .   కానీ బ్రహ్మ చారులై ఉండే వారికి  సంసార బంధమును ఏర్పరచి భాధ్యతలను పెంచేవాడు శని గ్రహము . కుటుంబమును ఏర్పరచి భవ బంధములను ఏర్పరుస్తాడు

అయితే శని గ్రహము వలన కలిగే భాధలకు నివారణ లేదా ? అని చాలా మంది అడుగుతుంటారు .
శనీశ్వరుని పూజించడము , నువ్వుల నూనెతో అభిషేకములు చేయించడము , నలుపు వస్త్రములు , నల్ల నువ్వులు దానము ఇవ్వడము  వలన శనీశ్వరునికి శాంతి జరిగి మంచిని ప్రసాదించ గలడు .

ప్రతిరోజూ శని గ్రహ స్తోత్రమును పటించుట వలన కూడా శాంతి కలుగును . నల్ల చీమలు , కాకులు మున్నగు వాటికి ఆహారమును పెట్టుట మంచిది . వీలయినపుడు ఎవరికైనా సరే అన్న దానము చేయ వలెను . మీరు వాడిన పాత బట్టలను ఎవరైనా బీదవారికి ఇవ్వండి . అనాధ పిల్లలకు ఆశ్రయము కల్పించండి . మీకు తోచిన సహాయము చెయ్యండి .

శని బద్దకమును పెంచుతాడు , అతినిద్ర,  మత్తు, బద్దకము కలిగిస్తాడు . ఏకాగ్రత లోపిస్తుంది . విద్యార్ధులయితే వేకువ జామున లేవండి .బ్రహ్మ ముహూర్త కాల సమయమైన తెల్ల వారుజామున లేచి చదువుట వలన తెలివి తేటలు పెరుగుతాయి . 

మిగతా వారు ఆరోగ్యమును కాపాడుకొనుటకు అన్ని వేళలా అలర్ట్ గా ఉండాలి .

కొంత మందిలో అయితే ఊబ కాయులు అవడము, శరీరమునందు కొవ్వు పెరిగి శారీరక అందమును కోల్పోయి వికారముగా తయారవుతారు . నూనె సంభందిత పదార్ధాలను తినడము తగ్గించండి . ఎక్కువగా వ్యాయామము చెయ్యండి . దీనివలన బద్దకము తగ్గుతుంది . యాక్టివ్ గా ఉంటారు .

ఏలిన నాటి శని జరుగు చున్న వారు ఏ నిర్ణయమును సరిగ్గా తీసుకోలేరు . ఒకే విషయమును గురుంచి పదేపదే అలోచిస్తూంటారు . వృధాగా కాల యాపన చేస్తారు . అనుకొన్న పనిని అనుకొన్న సమయమునకు పూర్తి చెయ్యలేరు . ఇటువంటి వారు ఉదయాన్నే యోగా చేయండి , లేకపోతే మీ కుల దైవమును గానీ , మీ ఇష్ట దైవమును గానీ మనసున ఉంచుకొని ధ్యానం చెయ్యండి . దీనివలన ఏకాగ్రత పెరుగుతుంది . ఉత్సాహముగా ఉంటారు .యాక్టివిటీ పెరుగుతుంది .

ఇలా శారీరకముగా మానసికముగా  అన్ని విధములా మనకు జరిగే పరిస్థితులకు అనుగుణముగా కొన్ని కొన్ని పరిహారములను చేయడం వలన శనీశ్వరుని అనుగ్రహమును పొంద గలము .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...