2013-07-04

గోచారము – ఫలితములు



సృష్టిలో భగవంతునిచే సృష్టించ బడినవన్నీ మార్పు చెందుతూనే ఉన్నవి . మార్పు అనేది నిరంతరము జరుగుతూనే ఉంటుంది .మార్పే సృష్టి రహస్యము .

ఉదా : ఒక్క మొక్క మ్రానై చెట్టుగా మారి మహావృక్షమవుతుంది .
మానవుడు  బాల్యం , యవ్వనము , కౌమారము , వృద్ధాప్యము ఇలా అనేక మార్పులు చెందుచున్నాడు  

గ్రహచారము అనగా మానవుడు పుట్టిన క్షణములో ఉన్న గ్రహస్థితిని గురించి తెలియ పరుస్తుంది . దీని ఆధారముగా గ్రహ బలములు , దశలు లను తెలుసుకొని జాతక ఫలితాలను విశ్లేషిస్తున్నాము. జాతక చక్రము వేసేటప్పుడు ఫలితములు తెలుసుకొనుటకు రాశులలో గ్రహాలను వేసుకొంటాము .

వాస్తవానికి గ్రహాలూ నిత్యము చలనము కలిగి ఉంటాయి .స్థిరముగా ఒకదగ్గర ఉండవు . అలా చలనము కలుగుతూ వివిధ రాశులలో తమతమ కక్ష్యలలో భ్రమణము చెందుతూ ఉంటాయి . దీనినే గోచారము అంటారు .
జాతకులు జన్మించిన జన్మ రాశి ఆధారముగా గోచారము ద్వారా ఫలితములు తెలుసుకోవచ్చు .
 ఒకవేళ జన్మ రాశి తెలియనివారికి పేరును బట్టి నామ నక్షత్రముతెలుసుకొని నామ రాశిని తెలుసు కొని కొంతవరకు ఫలితములు తెలుసుకొన వచ్చును.  

గ్రహ బలము ఎంత బాగున్ననూ , గోచారము అనుకూలముగా లేనిచో మానవులు  శుభ ఫలితములను పొందజాలరు.గోచారములో గ్రహములు జన్మరాశినుండి వివిధ స్థానములలో ఉన్నప్పుడు ఫలితములు ఏవిధముగా కలుగ చేస్తాయి .

సూర్యుడు జన్మరాశి నుండి ౩ 6 10 11 స్థానములలోనూ
చంద్రుడు 1 ౩ 6 7 10 11   స్థానములలోనూ
బుధుడు 2 4 6 11 స్థానములలోనూ
గురుడు 2 5 7 9 11 స్థానములలోనూ
శుక్రుడు 1 2 4 5 8 9 11 స్థానములలోనూ
కుజ శని రాహువు కేతువు లు ౩ 6 11 స్థానములలోనూ ఉన్నప్పుడు శుభ ఫలితములు కలుగ చేయుదురు .

నవ గ్రహాలూ గోచార రీత్యా ఏ ఏ స్థానాలలో ఉన్నప్పుడు ఏఫలితములిస్తాయి అను విషయమును గురించి తరువాత శీర్షికలలో తెలుసు కొందాము .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...