2013-07-07

గోచారము – చంద్రుడు



గోచారరీత్యా జన్మరాశి నుండి చంద్రుడు  పన్నెండు రాశులలో సంచరించు సమయమున కలిగే శుభాశుభములు
.               శ్లోకము :శరీర సౌఖ్యమారోగ్యం సంతోషో ధనమున్నతి:
           మృష్టాన్న భోజనం సంగం సన్మానం జన్మగేవిధౌ
జన్మరాశిలో చంద్రచారము జరుగుచున్నప్పుడు శరీరమునకు సుఖము ఆరోగ్యము సంతోషము గౌరవములు కలుగును . మంచి భోజన సౌఖ్యము కలుగును ధనసంపాదన బాగుంటుంది .దంపత్యము ఆనందముగా సాగుతుంది .
                   శ్లోకము : అంతఃక్లేశ ధనచ్చేద వ్యయద స్సర్వదోషదః
                             కుభోజనం దేహజాడ్యం ద్వితీయ స్థానగో విధు:
రెండవరాశిలో చంద్ర సంచార వేళ మానసిక ఉల్లాసము లేకపోవడము ధన వ్యయము ,మరియు శారీరక సౌఖ్యము లేక అనారోగ్యము కలుగును .

                   శ్లోకము : అర్ధలాభో వస్త్రలాభ శ్చిత్తసౌఖ్యం మనోద్రుతి:
                             కాన్తాభి రిష్టసల్లాపః తృతీయ స్తానగే విదౌ
మూడవరాశిలో చంద్రుని సంచారము జరుగుచున్నప్పుడు ధనలాభము కలుగును మంచి వస్త్రములు లభించును. మనస్సున సౌఖ్యముగా ఉండి స్త్రీలతో ఆనందముగా ఉంటారు .

                   శ్లోకము :చిత్తభ్రంశం బంధువైరం బుద్ది చాంచల్య మేవచ
                             కర్మ వైకల్ప్య కార్యంచ చతుర్ధ స్థాన గతో చంద్రః
నాల్గవ రాశిలో చంద్రసంచారము ఉన్నప్పుడు బుద్ది హీనత , చుట్టములతో విరోధము ఏర్పడును . మనస్సున ఆందోళనగా ఉండును . చేప్పట్టిన కార్యములు చెడును .

                   శ్లోకము : వాతాదిక్యం సదాలస్యం మనఃపీడా భయం తదా
                             ఇష్టార్ధ నాశం కురుతే పంచామక్శే యధా చంద్రః
పంచామరాశిలో చంద్ర చారము జరుగుచున్నప్పుడు వాతము వలన రోగములు , మనస్సున సంకటము , చేయు పనులయండు ఆటంకములు కలిగి నాశనమగును .

                   శ్లోకము : స్వస్థానం ప్రాప్తిమారోగ్యం మర్ధలాభం యశోముదం
                             స్త్రీ సల్లాపం ధర్మ సిద్ధం షష్ఠగో మృగలాంచనః
ఆరవరాశి లో గోచార రీత్యా చంద్ర సంచారము జరుగు చున్నప్పుడు స్వస్థాన ప్రాప్తించును , మంచి ఆరోగ్యము , సంతోషము కలిగి పుణ్య కార్యముల వలన సంతోషములను పొందుతారు .
                   శ్లోకము : మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమం
                             స్త్రీ సౌఖ్యం దేహ సౌఖ్యంచ సప్తమస్థో యధా విధు:
ఏడవ రాశిలో చంద్ర సంచార వేళ నెమ్మదిగా ఉందురు కీర్తి ప్రతిష్టలు కల్గును , గౌరవ మర్యాదలుపెరుగును , శరీర సౌఖ్యము , స్త్రీ సౌఖ్యమును పొందుతారు .

                   శ్లోకము : అజీర్ణామయ సంతాపం జాను భాదాం తధైవచ
                             కుభోజనం దేహ జాడ్యం పీడా చాష్ట మగశ్శశీ
అష్టమ రాశి చంద్ర సంచారము వలన అజీర్ణ వ్యాధులు సంభవిన్చును . , ఉత్సాహము లేకపోవడం , అనారోగ్యము ఏర్పడి సరియైన భోజన వసతి లేక వేదన కలుగును .

                   శ్లోకము : వస్త్ర నాశం పుత్రవైరం ప్రవాసం వ్యాధి పీడనం
                             ఉద్యోగ భంగం కలహం నవమస్తో యధావిదు:
తొమ్మిదవ రాశిలో చంద్రుని సంచారము జరుగుచున్నప్పుడు వస్త్రములు నాశనమగును . పుత్రులతో విరోధము ఏర్పడును . గృహమును వదలి అన్య ప్రదేశముల యందు నివాసము చేయ వలసి వచ్చును . అనారోగ్యముల వలన భాధలు , ఉద్యోగమునకు హానీ కలుగ వచ్చును .

                   శ్లోకము : ఇష్ట సిద్ధి స్సదారోగ్యం బంధు సంతోష భోజనం
                             దశామస్థో యదా చంద్రః యత్న కార్యార్ధ సాధనం

దశమ స్థానమున చంద్రుడు సంచరించునపుడు కోరిన కోర్కెలు నెరవేరును చుట్టములతో సంతోషముగా గడుపుదురు .ప్రయత్నించి న కార్యములు సఫలము చెందును .

                   శ్లోకము :మనస్సౌఖ్యం సదానంద: ఇష్ట గృహ సుభోజనం
                             ధన ధాన్యాది లాభాస్యాత్ చంద్రుచైకాదశంగతే
పదకొండవ రాశి సంచారము వలన మనస్సున సుఖము , ఆనందం , తన సన్నిహితులతో కలసి ఇంటి యందు మంచి భోజనము చేయుట , ధన ధాన్య లాభములు చంద్రుని వలన కలుగును .

                   శ్లోకము : చిత్తభ్రంశో మానహాని: బంధు వైరం ధనక్షయం
                             ద్వాదశస్థో యదాచంద్రో దేహాలస్యం మహద్విపత్    
పన్నెండవ రాశి సంచారము లో ఉన్న చంద్రుని వలన కలతలు , అవమానములు , కష్టములు , తగవులు మొదలగు ఫలితములు కలుగును .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...