కృష్ణ అంగారక చతుర్ధశి
వ్రతం .
ఈ వ్రతం కుజ గ్రహ దోషములతో
భాధలు పడేవారు ఆచరించదగిన వ్రతము .
ఎన్ని సంబంధములు చూసినా
పెండ్లి సంబంధములు కుదరని వారు , వివాహము ఆలస్యము అగుచున్నవారు , వివాహానంతరము
భార్యా భర్త మధ్య సయోధ్య లేనివారు, మరియు
తగవులు , పోలీసు కేసులు , కోర్టు దావాలలో ఇరుక్కున్నవారు , ఆర్ధిక విషయములలో ,
భూమి సంబంధ వ్యవహారములలో నష్టములు ఏర్పడిన వారు , విపరీతమైన అప్పుల భాధతో ఇబ్బంది
పడువారు ఈ వ్రతమును ఆచరించుట వలన సమస్యలు పరిష్కారము కాగలవు .
అంగారక చతుర్ధశి వ్రతము
అనగా చతుర్ధశి మంగళవారము తో కూడి వచ్చినపుడు ఈ వ్రతమును చెయ్యాలి .అయితే చాలా మంది పూర్ణిమ
ముందు వచ్చు చతుర్ధశి తో కూడిన మంగళ వారము రోజున ఈ వ్రతమును చేయు చున్నారు . అది
తప్పు .
ఎందుకంటే కృష్ణ పక్షములో మంగళ వారముతో కూడిన చతుర్ధశి రోజున మాత్రమే ఈ
వ్రతమును ఆచరించాలి . పేరులోనే ఉన్నది కదా? కృష్ణ అంగారక చతుర్ధశి వ్రతం అని. ఈ వ్రతము ఆచరించుటకు అన్ని మంగళ వారములు పని
చేయవు . సంవత్సరానికో లేక రెండు మూడు సంవత్సరాలకో ఒక సారి మాత్రమే బహుళ పక్షములో
చతుర్ధశి తో కూడిన మంగళ వారము వస్తుంది . గమనించ గలరు .