2013-07-16

ఏలిన నాటి శని

ఏలిన నాటి శని అంటే ఏమిటి ?
శని గ్రహము  విశ్వమును చుట్టి వచ్చుటకు ముప్పై  సంవత్సరములు పడుతుంది . శని గ్రహము తనకక్ష్యలో పరి భ్రమణము  చేస్తూన్నప్పుడు ఒక్కొక్క రాశిలో రెండున్నరసంవత్సరముల చొప్పున పన్నెండు రాశులలో ౩౦ సంవత్సరములు పడుతుంది .

ఇలా సంచరిస్తున్నప్పుడు ౩౦ సంవత్సరములలో ఏడున్నర సంవత్సరములు ప్రతి మానవుని భాధిస్తాడు . ఎవరికైనా  జన్మ రాశితో పాటు , జన్మరాశికి ఇరువైపులా ఉన్న రాశులలో శని సంచరించు కాలమును ఏలిన నాటి శని అంటారు .

శనిగ్రహము అనేక రకముల కష్టములను  , భాధలను  , నష్టముల ను కలుగ చేస్తుంది .
వ్యక్తీ జన్మ రాశికి వెనుక నున్న రాశికి అనగా తన జన్మ రాశినుండి పన్నెండవ రాశిలో శని గ్రహము ప్రవేశించి నపుడు ఏలిన నాటి శని ప్రారంభము అవుతుంది . ఈ ఏలిన నాటి శని జరుగు చున్న వారు అన్నిరకాలుగా అప్రమత్తముగా ఉండాలి . ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురగు చుండును .

ఆర్ధికపరమైన నష్టములు కలుగును . విద్యార్ధులకు విద్యలో ఆటంకములు కలుగుతాయి .పరీక్షలు తప్పుతారు . ఉద్యోగులు పని భారము ఎదుర్కొంటారు . పై అధికారుల ఒత్తిడి ఉంటుంది . ఒక్కొక్క సమయములో సస్పెన్షన్ అవడము , ఉద్యోగము కోల్పోవడం జరుగుతుంది

వ్యాపారులు ఆర్ధిక విషయములలో చాలా జాగ్రత్త వహించుట అవసరము . వ్యాపారము నత్తనడకన సాగుతుంది . అప్పులు పెరుగుతాయి . కొంత మందైతే  నష్టములను భరించలేక వ్యాపారములు దివాళా తీస్తారు . రాజకీయ నాయకులు పదవీ గండము కలుగుతుంది.  అన్నిరంగముల వారు ఈ ఏలిన నాటి శని జరుగు చున్నప్పుడు అనేక విధముల భాధలను ఎదుర్కొంటారు .

ముఖ్యముగా ఏలిన నాటి శని జరుగు చున్నప్పుడు బంధువులతో విరోధము కలుగును .అందరూ దూరమవుతారు . మిత్రులే శత్రువులవుతారు . గృహము నందు అసౌఖర్యము కలుగుతుంది . తన కుటుంబమునకు సంభందించిన వారికి గానీ , తన బంధు వర్గమునకు సంభందించిన వారికి గానీ మరణము సంభవించును .


ఈ ఏలిన నాటి శని జరుగుచున్న వారు ప్రయాణములలో చాలా చాలా జాగ్రత్త వహించుట మంచిది . యాక్సిడెంట్ లు జరగడము , కాళ్ళు , చేతులు విరగడము జరుగుతుంది. ఆయాసముతో కూడి బ్రతుకు భారముగా నడుస్తుంది .  

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...