2013-07-07

గోచారము - కుజుడు


కుజుడు గోచారములో ద్వాదశ రాశులలో సంచరించు నపుడు కలుగు ఫలితములు

శ్లోకం : జ్వరఖడ్గ వ్రణంచైవ భార్యా బంధు విరోధ కృత్
         చంద్ర రాశీ గతే భౌమేయక్ష రాక్షస పీడితం

కుజుని జన్మ రాశి సంచరములో జ్వరము వలన భాదపడతారు . గాయములు ఆకస్మిక ప్రమాదములు జరుగుతాయి భార్య భర్తల మధ్య తగవులు బంధువులతో విరోధము ఏర్పడును .దుర్మార్గుల వలన చెడ్డ ఫలితములు , అవమానములు కలిగి పీడించ బడుదురు .

శ్లోకం : అసత్వం సతతం క్లేశః సర్వ కార్య వినాశనం
         సదా దుర్జన సంపర్కః భీతి స్స్యాద్దనగే కుజః

రెండవరాషి కుజ సంచారములో దేహము బలహీనమగును , నీరసము , నిస్సత్తువ ఆవహించును ,ఎల్లప్పుడూ మానసిక విచారము కలుగును . తలిచిన కార్యములు చెడి పోవును ,ముఖ్యముగా వివాహాది శుభకార్యాలు కు ఆటంకములు ఏర్పడును .చెడు స్నేహములు , దుష్ట సాంగత్యము కలుగును .

శ్లోకం : విత్తలాభ స్సదారోగ్య మిష్టసిద్ది సుఖావహమ్
         వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్తానగే కుజః  

మూడవ రాశి లో కుజుని సంచారము జరుగుచున్నప్పుడు ధనలాభము కలుగును . మనస్సు ఎప్పుడూ సంతోషముతో నిండి ఉండును . కోరిన కోర్కెలు నెరవేరును .మంచి ఆరోగ్యమును కలుగ జేయును . అప్రయత్న ధనలాభము , మంచి వస్త్ర లాభము కల్గును .

శ్లోకం : భాగ్య హానీం భయం క్రూరం బంధువైరం ధన క్షయం
         రోగ పీడాది సంతాపః చతుర్ధ స్తానగే కుజః
నాల్గవ రాశి లో ఉన్న కుజుని వలన భాగ్యమునకు ఆపద కలుగును . బ్రతుకు భయము గా ఉండును . చుట్టములతోనూ , ఇరుగు పొరుగు వారలతో విరోధము వచ్చును . ధన నష్టము సంభవించును . రోగముల వలన మానసిక వేదనను అనుభావింతురు .

శ్లోకం :దేహ జాడ్యన్చ సంతాపం కాలాతీ క్రమ భోజనం
       దురితం కర్మ లాభశ్చ భౌమే పంచమ సంస్థితే  

పంచమ రాశి సుజా సంచారము వలన శరీరమునకు రోగము కలుగును.ఆసుపత్రి సందర్శనము కలుగును , ఆలస్యముగా  భోజనము , అలజడి ,  అశాంతి , మనో వేదన , పాపకర్మల యందు పాల్గొనుట మొదలగు ఫలితములు కలుగును .

శ్లోకం : వస్త్రలాభః , ధాన్య లాభః ధన లాభో యశ స్తదా
         మనోల్లాసః ధర్మసిద్ది  షష్టమస్తే కుజే భవేత్

కుజుడు ఆరవరాశిలో గోచార రీత్యా వచ్చినపుడు అన్ని విధములా లాభములు కలుగును , పేరు ప్రఖ్యాతలు పెరుగును , మనస్సున ఆనందముగా ఉండును , పుణ్యకార్యములు చేయుట , ధర్మముగా వ్యవహరించుట జరుగును .

శ్లోకం : అన్న వస్త్రాది రహితం సదాక్లేశ స్వబందుబి:
         కువార్తా పుత్రభాతృణం క్రోధ స్సప్తమగే కుజః

ఏడవ రాశిలో కుజును సంచార వేళ అన్న వస్త్రములకు ఇబ్బంది కలుగును . బంధువుల తమ పట్ల చిన్నచూపు చూచుట , పుత్రులు లేక సోదరులు చెడుగా ప్రవర్తించుట , చెడు వార్తలను వినడం లాంటివి జరుగును .

శ్లోకం : ప్రవాసః కార్య హానీస్స్యాత్ కాస రోగ ప్రపీడనం
        స్థాన నాశో ఋణచ్చెద అష్టమస్తే ధరాసుతే

ఎనిమిదవ రాశిలో కుజుడు సంచరించు చున్నప్పుడు స్వస్థానమును విడచి వేరే ప్రదేశములలోఉంటారు .తలచిన కార్యములు అనుకూలించవు , రోగములు కలుగుతాయి . అప్పులు పెరుగును తద్వారా అవమానములు పెరుగును .

శ్లోకం :ఆశనాచ్చాదనన్యూనం శోషణం దేహ పీడనమ్
        స్థాన నాశం విరోధంచ నవమస్తో ధరా సుతః

నవమ రాశి కుజ సంచారము జరుగు చున్నప్పుడు అన్న వస్త్రములకు లేమి కలుగును శరీరము వాత సంభంద నొప్పులతో ఉండును . స్థాన మార్పిడి కల్గును . ద్వేషము ఏర్పడును . 

శ్లోకం :నిత్యం క్లేశః సదావ్యాధి తదా భోజన దుర్భలః
        సదా సంచార ఉద్యోగం దశమస్తే ధరా సుతః

కుజుడు పడవ రాశిలో సాంచ రించు వేళలో ఎప్పుడు ఇబ్బందులు , సరియైన భోజన సౌఖ్యము లేకపోవడం , సంచారము చేయు వృత్తిని చేపట్టడము జరుగును .

శ్లోకం : ఆరోగ్యంఅర్ధ లాబంచ సంతోషం వస్త్రలాభకృత్
        యత్న కార్యాను కూలత్వం ధైర్యమేకాదశే కుజః

కుజుడు పదకొండవ రాశికి  వచ్చినపుడు మంచి ఆరోగ్యము ,ధనలాభామును ప్రసాదించును . మనసు ఉల్లాసంగా ఉండును , మంచి వస్త్ర లాభము కల్గును , తలచిన కార్యములు నెరవేరును . ధైర్యముగా ఉంటారు .

శ్లోకం ; ప్రవాసం వ్యాధి పీడంచ బంధువైరం ధనక్షయం
         దేహ పీడాంచ సంచారం ద్వాదశ స్థాన గో కుజః

పన్నెండవ రాశిలో కుజుని సంచారము ఉన్నప్పుడు దేశ సంచారము చేయుట చుట్టములతో విరోధములు కల్గుట రోగముల వలన భాధలు మందులు తీసుకొనుట మొదలగు లక్షణములు కలుగు చున్నవి .


No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...