2013-07-03

దంపతుల లక్షణము



మన పురాణములలో స్త్రీ ని గురించి ఈ విధముగా ఉన్నది .

కార్యేషు దాసీ కరణేసు మంత్రి భోజ్యేషు మాతా శయనేసు రంభా
                     రూపేషు లక్ష్మీ క్షమయా ధరిత్రీ షట్ ధర్మవర్తీ కుల ధర్మ పత్నీ:

అనగా స్త్రీ చేయు కార్యములయందు సహనముతో దాసీ వలె ఉండాలి . రాజుకు మంత్రి ఏవిధముగా సలహాలిచ్చి సహాయపడతాడో అదే విధముగా ఆర్ధిక విషయములలోగానీ , కుటుంబ విషయములలో గానీ , పిల్లల యొక్క భవిష్యత్తు ను గురించి గానీ మంచి సలహాలనిచ్చి  భర్తకు తోడ్పాటు నందించాలి . భోజన విషయములో ఒకతల్లి తన పిల్లలను ఏ విధముగా చూసుకుంటుందో భర్తను అలా చూసుకోవాలి . 

పడక సౌఖ్యమును అందించునపుడు రంభ వలె శృంగారముగా ఉండాలి. రూపములో లక్ష్మి దేవివలె ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి . భూదేవి వలె  ఓపిక కలిగి ఎంతటి క్లిష్టపరిస్థితుల నైనా ఎదుర్కొనే ఓపిక ఉండాలి  . {ఈ శ్లోకములో చెప్పిన కులము అను పదము వంశము అని అర్ధము చేసుకోవాలి }ఇలా ఆరు గుణములు కలిగిన స్త్రీ అడుగు పెట్టిన మెట్టినింటికి, వంశమునకు పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ..

 ఈ పైన ఉదాహరించిన శ్లోకములో స్త్రీని దాసిగా , సేవలు చేసేదిగా చెప్పడం జరిగింది . సోదరీ మణులు తప్పుగా అర్ధం చేసుకోవద్దని మనవి .

ఆనాటి కాలములో కుటుంబ పోషణ మొత్తం పురుషుడు చూసుకొనేవాడు . ఇంటి భాద్యతలు స్త్రీలు చూసుకొనేవారు.  

ఈనాడు మన సోదరీమణులు సమాన హక్కుల గురించి పోరాడుచున్నారు. అంతే కాకుండా భార్య భర్త ఇరువురు కష్టపడితే గానీ బ్రతకడం కష్టమైన ఈ రోజులలో స్త్రీ పురుషులంతా సమానమే . ఈ నాటి స్త్రీలు పురుషులతో సమానముగా చదువు కొను చున్నారు . ఉద్యోగ వ్యాపార వ్యవహారములలో పోటీ పడుచున్నారు .

అలాగే పురుషుడు ‘’ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ’’ అని అగ్ని సాక్షిగా ప్రమాణము చేసి పెళ్ళాడిన భార్యకు శ్రీరాముని వలె ఏక పత్నీవ్రతుడై , ధర్మ బద్దుడై , శాంత చిత్తుడై భార్యను అర్ధం చేసుకొని నడచుకోవాలి . ఇరువురి మధ్య అరమరికలు ఉండకూడదు . కష్ట సుఖములలో ఐశ్వర్యము ఉన్న , పేదరికము ఉన్న ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి ప్రవర్తించుట వలన సంసారము ఏ సమస్యలు లేకుండా హాయిగా సాగిపోతుంది . 

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...