2013-07-04

గోచారము –నవ గ్రహములు



గోచార రీత్యా జన్మ రాశి నుండి పన్నెండు రాశులలో నవగ్రహములు సంచరించేటపుడు కలుగు ఫలితాలు ఈ విధముగా ఉంటాయి .
       సూర్యుడు: స్థానభ్రష్టం , భయం , సంపదా , మానభంగం , మహాద్భయం
                    శత్రు క్షయం , వ్యధా , రోగం , దుఃఖం ,సిద్ది , ధనాదనే
                    క్రమేణ జన్మ రాష్యాది కురుతేతే పద్మ భాంధవః
తాత్పర్యము : సూర్యుడు జన్మ రాశిలో సంచరించునపుడు స్థాన మార్పిడి , 2 వ రాశికి వచ్చినపుడు భయమును ౩ సంపదను 4 మాన హానిని 5 విశేష భయమును 6 శత్రు నాశనం 7 దుఃఖము 8 రోగము 9 విచారమును 10 కార్య సిద్ధిని 11 ధన లాభమును 12 ధన వ్యయమును కల్గించును .

      చంద్రుడు :  అన్నవృద్ధిం, ధన క్షీణం , ద్రవ్య లాభం , మహాద్గతం
                   కార్యనాశంచ , విత్తంచ , ద్రవ్యలాభంచ .మృత్యుచః
                   నృపక్రోధం ,సుఖం , లాభం , ధనక్షీణంటు చంద్రమా 
తాత్పర్యము : చంద్రుడు 12 రాశులలో సంచరించునపుడు 1 భోజన సౌఖ్యమును 2 ధన క్షయమును ౩ ద్రవ్యలాభమును 4 విశేష రోగ భయమును 5 కార్య నాశనము 6 ధనరాబడిని 7 ద్రవ్య లాభమును 8 మరణ సమాన ఫలితములను 9 రాజ కోపమును 10 సౌఖ్యమును 11 లాభమును 12 ధన నష్టమును కలిగించు చున్నాడు . 
       కుజుడు :   ఖేదం , దౌర్భాగ్యం , సౌభాగ్యే , రిపుపీడాం , రిపోర్భయం
                   అర్ధసిద్ధి ,మనర్ధంచ , శస్త్రభాదాం,ధనక్షయం
                   అశోకంచ, ధనం , క్రూర క్రమేణా కురుతే కుజః  
తాత్పర్యము : కుజుడు ద్వాదశ రాశులలో చరించు చున్నప్పుడు 1 దుఃఖము 2 భాగ్య హాని ౩ సౌభాగ్యము 4 శత్రువుల వలన భాధలు 5 శత్రు భయము 6 ద్రవ్య సిద్ది 7 కార్య హాని 8 శస్త్రభాద గాయములు ఏర్పడుట 9 ధన వ్యయము 10 దుఃఖ నాశనము 11 ధన యోగము 12 క్రూరత్వము ను కలుగ జేయును .

       బుధుడు : బంధనం , హేమలాభంచ . రిపుపీడం , రిపుక్షయం
                   దారిద్ర్యం ,భూషణం , లాభం, మనసిద్దిం ,ధనక్షయం
ప్రమోదం, మోదసంహారం, బుదః కుర్యాత్క్రమాద్గతః
తాత్పర్యము: బుధుడు పన్నెండు రాశులలో సంచరిచు సమయములలో 1 బంధనము 2 సువర్ణ లాభము ౩ శత్రుభాధలు 4 శత్రువుల నాశనము 5 దరిద్రము 6 ఆభరణ లాభము 7 లాభములను 8 సంతోషము 9 ధన నష్టము 10 ప్రమోదము 11 మోదమును 12 నాశనము కలిగించును .

        గురుడు : దేశ త్యాగం , విత్తం లాభం అనర్ధం ధన నాశనం
                   సంపద , క్లేశం , ఆరోగ్యం , ధన హానిం ,ధనాగమం
                   పీడనం లాభ నష్టంచా క్రమేణ కురుతే గురుః   
తాత్పర్యము : గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము ౩ కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు .

       శుక్రుడు : ఆరోగ్యం భూషణం లాభం రతించ ప్రియదర్శనం
                   మానహానిం మహాద్రోగం భూలాభం ధాన్యవర్ధనం
                   ప్రమోదంచ ధనంచైవ సంతోషం కురుతే భ్రుగు;
తాత్పర్యము : శుక్రుడు ద్వాదశ రాశులలో సంచరించేటప్పుడు 1 ఆరోగ్యము 2 అలంకారము ౩ లాభము 4 రతిసౌఖ్యము 5 మిత్రదర్శనము 6 మానహాని 7 విశేషరోగము 8 భూలాభము 9 ధాన్యవృద్ధి 10 ప్రమోదము 11 ధనము 12 సంతోషముల ను కలుగ జేయును .

           శని :   విపత్తి హానిం సంపత్తి కుక్షిరోగం సుతక్షయం
                   లక్ష్మీకరం మహర్ధైన్యం మరణం దేహ శోషణం
    బంధనం లాభ నష్టంచ  క్రమేణ కురుతే శని:  
తాత్పర్యము : శని పన్నెండు రాశులలో సంచారము చేయు నపుడు 1 ఆపదలను 2 హానిని ౩ సంపదను 4 గర్భసంభంద రోగములను 5 సంతానమునకు కష్టములను , నాశనమును 6 మహా ఐశ్వర్యమును 7 మహా దరిద్రమును 8 మరణ సమాన ఫలితములను 9 దేహ శోషణమును 10 బంధనమును 11 లాభమును 12 అనేక విధాల నష్టములను కలిగించు చున్నాడు .

రాహు , కేతువులు : రాహోర్జన్మ గతో భయంచ కలహం సౌభాగ్య మాన
                                                         క్షయే ,విత్తభ్రంశం మహాత్శుఖే రిపుభయం చాష్టౌచ    
                        చోరాద్భయం శత్రోర్వుద్ది ధనక్షయం శుభ ఫలం
                                                             భ్రుత్యప్యనాశం వ్యయేకుర్యాత్ తత్ఫలమేవ
                        కేతు రనిశం చేత్యాహు గార్గ్యాతయః
తాత్పర్యము : రాహు కేతు గ్రహములు జన్మరాశి నుండి పన్నెండు రాశులలో సంచరించు సమయమున 1 భయమును 2 కలహాలను ౩ సౌభాగ్యమును 4  మానహానిని 5 ధన నష్టములను 6 మహా సుఖములను 7 శత్రువుల వలన భయమును 8 చొర భయమును 9 శత్రు వృద్ధిని 10 ధన క్షయమును 11 శుభ ఫలములను 12 భ్రుత్యునాశనమును కలిగించుదురు .
                                                                            
         

         

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...