2013-07-08

గోచారము – బుధుడు



శ్లోకం :   చిత్తభ్రంశో బందువైరం కాలాతిక్రమ భోజనం
          వివాదః దుష్ట సంసర్గం చంద్ర రాశీ గతే బుధే.
జన్మ రాశిలో బుధుడు సంచరించుచున్నప్పుడు బుద్ది వైకల్యము కలుగును బంధువులతో శత్రుత్వము పెరుగును . తగవులు వచ్చును దుర్మార్గులతో సహవాసము చేయుదురు .

శ్లోకం :   మణిమూలార్ధ లాభంచ సదా సౌఖ్యం నరస్యచ
          నిత్యారోగ్యంచ సద్గోష్టి: ద్వితీయ స్థానగే బుధే
రెండవ రాశిలో బుధుడు సంచరించు వేళ మానవునకు మణులు , మాణిక్యముల మూలకముగా మరియు ఇతర మార్గముల లోనూ ధన ప్రాప్తిని పొంద గలరు . మంచి ఆరోగ్య వంతులై సుఖముగా ఉంటారు .

శ్లోకం :   అర్ధహానః రాజకోపం జ్ఞాతివైరం తధా స్మృతి:
          బుద్దిజాడ్యం మనస్తాపః సహజ స్థానగే బుధే
తృతీయ రాశికి గోచారములో బుధుడు వచ్చినపుడు ధన నాశనము కలుగును ప్రభుత్వమూలకముగా ఇబ్బందులు ఎదురుకాగలవు . జ్ఞాపక శక్తి మందగించును. బుద్ది జాడ్యము , మనస్తాపము కల్గును .  

శ్లోకం :   మాతృ సౌఖ్యంచ సంతోషః ధనన్య వివర్ధనం
          బుద్ది ప్రారంభ కార్యస్య సిద్దిర్భందు గతే బుధే
నాలుగవ రాశిలో బుధ సంచారము జరుగుచున్నప్పుడు తల్లికి సౌఖ్యము సంతోషము కల్గును . ధన ధాన్యములు వృద్ధి అగుటయే కాక అనేక విధముల లాభము కలుగును . తను స్వశక్తిచే ప్రారంభించిన పనులు విజయవంటముగా పూర్తగును .

శ్లోకం :   సర్వాంగే షూస్మ సంతాపః సర్వ దోషైశ్చ మారణం
          అకస్మాత్ కలహా శ్చైవ పంచ మస్తే బుధే భవేత్
పంచమ రాశిలో బుధుడు గోచార రీత్యా సంచారము చేయునపుడు శరీర అవయవముల యందు ఉష్ణ తాపము జ్వరాది భాధలు , మరణ సమాన ఫలితములు , ఆకస్మికముగా కలహములు ఏర్పడును .

శ్లోకం :   వస్త్రలాభో ధాన్యలాభః ధనలాభో మనోధృతి:
          విద్యా వినోద సౌఖ్యంచ రిపు స్థాన గతే బుధే
ఆరవ రాశిలో బుధుని సంచారము వలన వస్త్రలాభము , ధన ,ధాన్య లాభములు మనస్సున ధైర్యము విద్యా వినోదము , సకల కార్యములు నెరవేరును .

శ్లోకం :   దౌర్భాగ్య మర్ధనాశశ్చ ప్రభుక్రోధ: కురూపణం
          సర్వాంగ జాడ్యముష్ణన్చ సప్తమ స్తానగే బుధే

ఏడవ ఇంట బుధ సంచారము జరుగు చున్నప్పుడు దౌర్భాగ్యము , ధన నాశనము , ప్రభుత్వ అధికారుల కోపమునకు గురియగుట , సౌందర్య హానీ , అనారోగ్య సూచితము రోగపీడ చే భాద పడుదురు .

శ్లోకం :   దేహ జాడ్యం మనస్థాప: వ్యాకులం చాల్పభోజనం
          అనృతమ్ భయ మిత్యాహు రష్టమస్తే భవేద్భుదే
ఎనిమిదవ రాశిలో గోచారము రీత్యా బుధ సంచారము ఉన్నప్పుడు శారీరక సౌఖ్యము లేక పోవడము మనో విచారము భయము కలుగుట , స్వల్పముగా భుజించుట , నిందారోపణలు కలుగుట జరుగును .

శ్లోకం :   దేహాలస్యం యశోహానీ స్వకర్మ పరపీడనం
          అరోచ భోజనమ్ పిత్తం నవమస్తే భవేద్బుదే

తొమ్మిదవ రాశిలో గోచారము వలన బుధుడు సోమరి తనము , ఇతరులను భాధ పెట్టుట ,రుచి లేని పదార్ధములను భుజించుట , పైత్య సంభంద రోగములను అనుభవించునట్లు చేయుచున్నాడు  

శ్లోకం :   అపవాదః దూషణమ్చ అన్నసౌఖ్య నిరాకృతి:
          ఆలస్యం తాపనం చైవ దశమస్తే భవేద్బుదే
బుధుడు పడవ రాశి సంచారము చేయునపుడు అపవాదులు కలుగును భోజన సౌఖ్యము లేకపోవుట ఇతరులచే నిందింప బడుట మనో విచారము ప్రబలి ఉండును.

శ్లోకం :   ఆరోగ్యం అర్ధ లాభశ్చ మనఃప్రీతి: సుఖంభవేత్
          బంధుప్రీతి ర్యశోవృద్ధి ర్లాభే చైకాదశే బుధః
పదకొండవ రాశిలో బుధ సంచార వేళ అన్ని విధముల మనసున సంతోషము కలుగును , అర్రోగ్యము ధనలాభము , సౌఖ్యములతో హాయిగా ఉంటారు బంధువుల మధ్య మంచి సంబంధ భాంధవ్యములు కలుగును .,

శ్లోకం :   సౌఖ్యహానీ ర్మనః క్లేశః కృషి భోజన మల్పశ్చ:
          నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశ స్తానగే బుధే
పన్నెండవ రాశిలో గోచారము రీత్యా బుధ సంచారము జరుగు చున్నప్పుడు సౌఖ్యము ఉండడు . మానసిక ఆనందమునకు లోటు కలుగును . ధనమునకు నష్టము కల్గును . భోజన సౌఖ్యము ఉండదు . కలహములు ఏర్పడును . దరిద్రమును అనుభవిస్తారు.           

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...