2013-05-11

నెల - వెన్నెల

వెన్నవంటి తెల్లనికాంతి కలిగి ఉండుటవలన చంద్రకాంతిని వెన్నెల అని చెప్పడం జరిగింది చంద్రుని భ్రమణము వలన నెలలు  అనగా మాసములు ఏర్పాటు చేసినారు . ఈ చంద్రుడు భూమికి ,సూర్యునకు మధ్య ఒకే సరళ రేఖపై నున్నప్పుడు పౌర్ణమి ఏర్పడుచున్నదని ఇంతకుముందు మనము తెలిసికొన్నాము . అయితే చంద్రుని నక్షత్ర చారమును బట్టి మాసములు ఏర్పడుచున్నవి . చంద్రచార నక్షత్రమును బట్టే మాసములకు  నామకరణము చేసినారు ఏలననగా చంద్రుడు తులారాశిలో నున్నప్పుడు ముఖ్యముగా

చిత్తా నక్షత్ర సంచారములో ఉన్నప్పుడు ఏర్పడిన పౌర్ణమితో కూడిన మాసమును చైత్ర మాసమనియు, విశాఖ నక్షత్ర సంచారములో ఉన్నప్పుడు ఏర్పడిన పౌర్ణమితోకూడిన మాసమును వైశాఖ మాసమనియు , జ్యేష్ట  నక్షత్ర సంచారములో ఉన్నప్పుడు ఏర్పడిన పౌర్ణమితోకూడిన మాసమును జ్యేష్ట  మాసమనియు,  పుర్వాషాడ లేక ఉత్తరాషాడ  నక్షత్ర సంచారములో ఉన్నప్పుడు ఏర్పడిన పౌర్ణమితో కూడిన మాసమును ఆషాడ  మాసమనియు, శ్రవణా నక్షత్ర సంచారములో ఉన్నప్పుడు ఏర్పడిన పౌర్ణమితో కూడిన మాసమునుశ్రావణ మాసమనియు, పూర్వాభాద్ర లేక ఉత్తరాభాద్ర  నక్షత్ర సంచారములో ఉన్నప్పుడు ఏర్పడిన పౌర్ణమితో కూడిన మాసమును భాద్రపద మాసమనియు, అశ్విని నక్షత్ర సంచారములో ఉన్నప్పుడు ఏర్పడిన పౌర్ణమితో కూడిన మాసమునుఆశ్వియుజ  మాసమనియు, కృత్తిక  నక్షత్ర సంచారములో ఉన్నప్పుడు ఏర్పడిన పౌర్ణమితోకూడిన మాసమును కార్తిక  మాసమనియు, మృగశిర నక్షత్ర సంచారములో ఉన్నప్పుడు ఏర్పడిన పౌర్ణమితో కూడిన మాసమును మార్గశిర మాసమనియు,పునర్వసు లేక పుష్యమి నక్షత్ర సంచారములో ఉన్నప్పుడు ఏర్పడిన పౌర్ణమితో కూడిన మాసమును పుష్య  మాసమనియు, మఖ నక్షత్ర సంచారములో ఉన్నప్పుడు ఏర్పడిన పౌర్ణమితో కూడిన మాసమును మాఘ మాసమనియు, పూర్వఫల్గుని లేక ఉత్తరఫల్ఘుని నక్షత్ర సంచారములో ఉన్నప్పుడు ఏర్పడినపౌర్ణమితో కూడిన మాసమును ఫాల్గుణ మాసమనియు ఈ విధముగా పన్నెండు మాసములను ఏర్పాటు చేసి యున్నారు .

అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రములు జ్యోతిష్య శాస్త్రములో సూచించుట జరిగినది . ఈ 27 నక్షత్రముల తరువాత అవే నక్షత్రములు తిరిగి వచ్చుచుండును . ఈ 12 నెలలలో ఏదైనా ఒక నెలను ఉదాహరణ గా తీసుకొందాం . ఒకనెలలో ఒక నక్షత్రములో పౌర్ణమి ఏర్పడితే ఆ నక్షత్రము నుండి 29వ నక్షత్రమునందు గాని 30వ నక్షత్రము నందు గాని తిరిగి మరుసటి నెలలో పౌర్ణిమ ఏర్పడును . ఈ విధముగా చంద్రుని గతి ననుసరించి నెలలు ఏర్పడుచున్నవి . 

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...