2 వ స్థానము నందు వృషభ రాశిలో బుదుడున్న
జాతకులు వడ్డీ వ్యాపారము బాగా చేస్తారు ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు చేస్తారు .
మంచి వాక్చాతుర్యము కలవారు . అయిననూ కుటుంబములో ఇతర సభ్యులతో సఖ్యతగా ఉండలేరు . ధన
విషయములో ఎవరిని నమ్మరు .
౩ వ స్థానము న బుధుడు స్వక్షేత్ర
స్థితిలో ఉండుటవలన జాతకులకు కొంత ఆయుర్భలము పెరుగును . వీరికన్నా తోడబుట్టిన
వారు మంచి పొజిషన్లో ఉంటారు. సూక్ష్మ
బుద్ది , నిశిత పరిశీలన కలిగిన వారవుతారు .
తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు నాల్గవ
స్థానములో ఉండుట అంత శ్రేయస్కరము కాదు . జాతకులకు గర్భ సంభంద రోగములను కలుగ జేయును
. విద్యా భ్యాస సమయములో ఈ దశా అంతర్ధశలు వస్తే తప్పక విద్యకు ఆటంకము ఏర్పడును .
వివాహానంతరము ఈ దశ జరుగుచున్న వారికి గృహము తాకట్టులో ఇరుక్కు పోవుట గానీ ,
అప్పులు చేసి గ్రహము నిర్మించు కోవడం జరుగుతుంది. చివరకు అప్పులు తీర్చలేక ఇల్లు
అమ్మవలసిన పరిస్థితులు ఏర్పడగలవు . వాహన ప్రమాదములు జరుగుతాయి .
పంచమ స్థానమున బుదుడున్న జాతకులకు
సంతానము కలుగదు , స్త్రీలలో అయితే గర్భము
పెరగదు గర్భసంచి లోపము వలన పిల్లలు కలుగరు
. పురుషులలో వీర్య వృద్ధి ఉండదు .మేష లగ్నమున పుట్టిన వారికి రవి బలము , గురు బలము
బాగుండక పోయిన యెడల సంతానము పూర్తిగా ఉండదు .
ఆరవ స్థానములో బుధుడు స్వక్షేత్ర , మరియు
ఉచ్చ స్థానములో ఉండుట వలన జాతకులు మేన
మామలు , మేనత్తల సహాయ సహకారములు పొందువారగుచున్నారు . సాధారణముగా వీరు ఎవరితోనూ శత్రుత్వము
పెట్టుకొనుట మంచిదికాదు . ఎక్కువగా అపజయములు ఎదుర్కొను అవకాశమున్నది .
ఆరోగ్యవిషయములో చాలా జాగ్రత్త అవసరము . అప్పులు చేయుట లేక లోన్లు వాడుట అంత మంచిది
కాదు .
No comments:
Post a Comment