అష్టమ భావమునందున్న బుధుని ప్రభావముచే వీరికి అనేక కష్టములు ఏర్పడతాయి . ఇక్కడ కుజ బుధ గ్రహములు కలసి యుంటే వారసత్వముగా ఉండే రోగాల వలన భాద చెందుతారు . వారసత్వపు ఆస్తులు ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా అనుభవింపలేరు . జీవిత చరమంకమునందు ఎక్కువగా జబ్బుపడి తనువు చాలింతురు .
తొమ్మిదవ స్థానము ధనుస్సులో బుధుని స్థితి యున్న జాతకులకు తండ్రికి సంభందించి ఆర్ధిక ఒడుదుడుకులు ఏర్పడును . తండ్రితో ప్రతి విషయములోనూ విభేదిస్తారు . తమ అభివృద్ధికి తగిన శ్రద్ధ తీసుకోలేదనీ ఎల్లప్పుడూ తండ్రిని నిందిస్తారు .
పదవ ఇంట మకరము నందు బుదుడున్న జాతకులకు ఉద్యోగ స్థిరత్వము ఉండదు . అదృష్టవశాత్తు మంచి పొజిషన్ కలిగిననూ వీరు స్వయంకృతం వలన మధ్యలో విడచి పెడతారు . పంతాలు , పట్టింపులు ఎక్కువ .
లాభ స్థాన గతుడైన బుధుని ప్రభావము వలన ఫైనాన్సు రంగములో వీరు బాగా వృద్ది చెందుతారు .ఆర్ధిక వ్యవహారములలో చాలా తెలివిగా ప్రవర్తిస్తారు . ఇక్కడ బుధుని స్థితి వలన సునాయాస ధనయోగము కలుగు చున్నది .
తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు పన్నెండవ భావములో ఉండగా జన్మించిన జాతకులకు అనారోగ్య సంభంధముగా ఎక్కువగ్గా ధనము వ్యయ మగును . దాంపత్య సౌఖ్యము తక్కువగా ఉండును . సోదరులసహాయమును పొందలేరు .
No comments:
Post a Comment