మేష లగ్నమున జన్మించిన వారికి
పంచామాధిపతి రవి , భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు కోణాధిపతులై శుభ ఫలితములు
ప్రసాదించ గలరు . రవి కన్నా గురుడు ఉత్తమ యోగములు కలుగ జేయును . ఏ లగ్నమున కైనా
కేంద్ర కోణ అధిపతులైన గ్రహాలూ పరివర్తన చెందిననూ ఒకరి ఇంట మరియొకరు ఉన్ననూ ఉత్తమ
రాజ యోగ కారకులగుచున్నారు
.
ఈ లగ్నమున జన్మించిన వారికి నైసర్గిక పాప
గ్రహము అయిన సూర్యుడు పంచమ కోణ ఆధిపత్యము వచ్చుట మంచిది . కాబట్టి సూర్యుడు శత్రు
క్షేత్రము లైన మకర కుంభ రాశుల యందు గానీ ,వృషభరాశి యండుగానీ , నీచ క్షేతము నందు
గానీ ఉండుట మంచిది .
ఈ విధముగా ఉన్నప్పుడు ఈ రవి దశా అంతర్ధశలు నడుస్తున్న జాతకులు
అన్నింటా విజయము వరించు చున్నది .రాజకీయ వ్యవహారముల యందు ,సంఘమునందు గౌరవ మర్యాదలు
పెరుగును . జీవిత స్థిరత్వము కలుగును . ఉద్యోగ లాభము , ప్రమోషన్స్ మొదలగునవి
లభించును .
భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు చతుర్ధ
స్థానము అనగా కర్కాటక రాశిలో స్థితి పొంది యుంటే ఈ జాతకులకు హంస మహాపురుషయోగము అను
యోగము పట్టును . ఇది విద్యా స్థానము . ఈ స్థానము నందు గురుడు ఉచ్ఛ స్థితిలో ఉండుట
వలన మంచి విద్యా యోగము కలుగుటయే కాక అన్నింటా మొదటి ర్యాంకులు పొందుట గొప్ప జ్ఞాన
వంతులు , మేధావులుగా తయారగుదురు . వీరికి శారీరకముగా శ్రమ పడరు . తమ బుద్ది బలముచే
తెలివి తేటల వలన పెద్ద పెద్ద ఉద్యోగములను సాధింతురు .
జాతకులకు ఈ దశా అంతర్ధశలు సంభవించిన
కాలములో సన్మానములు పొందుట , పెద్ద , పెద్ద అవార్డులను , బిరుదులను అందుకొనుట
జరుగును . అంతే కాక విశేష కీర్తిని సంపాదిన్తురు . కానీ ఈ గురు దశా రెండవ
భాగమునందు , గురునుకున్న వ్యయ భావ ఆధిపత్యము వలన కొంత కష్ట నష్టము సంభవించు
అవకాశము ఉన్నది .
ఈ కర్కాటక రాశిలో గురు చంద్ర గ్రహములు
కలిసి యుంటే గజకేసరి యోగము కూడా పట్టుచున్నది .
ఈ యోగ ఫలితముచే సమాజమున ఉన్నత ప్రమాణములు
కలిగిన వ్యక్తిగా గౌరవవింప బడుట ,పూజ్యులుగా రాణించడం . గొప్ప ఉపన్యాసకులు , సంఘ
సంస్కర్తలుగా రాణింతురు .
ఈ రాశి పునర్వసు 4వ పాదము , పుష్యమి,
అశ్రేష నక్షత్రములకు చెంది ఉంటుంది
పునర్వసు 4 వ పాదములో జన్మించిన వారికి
గురు మహాదశ బాల్యమున సుమారు 4 సంవత్సరములు
ఉంటుంది . పుష్యమి అశ్రేష నక్షత్రములలో జన్మించిన వారికి గురు మహాదశ రాదు . కావున
చంద్ర మహాదశ అంతర్దశల లోనూ . గురుని అంతర్ధశల లోనూ ఉత్తమ యోగములు కల్గించును . .
No comments:
Post a Comment