’’ పిండి కొలది రొట్టె ‘’
జాతకులు జన్మించినపుడు ఉన్న గ్రహాల బలాబలముల అధారముగానే ఫలితములు కల్గును .
మేష లగ్నమునకు చతుర్ధాధిపతి అయిన
చంద్రుడు కేంద్రాధిపతి అగుట వలన పాపి . ఈ లగ్నమునకు క్షీణ చంద్రుడు అయితే శుభ ఫలితములను , పూర్ణ
చంద్రుడు అయితే పాప ఫలితములను ఇచ్చుటలో బలవంతుడు .
చంద్రుడు లగ్నమున యున్న జాతకులు మృదు
స్వభావులు , చంచల మనస్సు కలవారు , భయస్తులుగా ఉంటారు .వీరికి తొందర పాటు ఎక్కువ .
ఏ విషయములోనూ సరియైన నిర్ణయము తీసుకోలేరు
.
రెండవ ఇంట చంద్రుడు ఉన్న జాతకునకు
చతుర్దాదిపతియై ఉచ్ఛ స్థితిని పొందుట వలన జాతకుడు మంచి విద్యావంతుడు , సుఖము మరియు
సునాయాస ధనయోగము కల్గును . వీరికి మాత్రు వర్గము వారి వలన గానీ , విద్యావలన గానీ
,గృహముల వలన గానీ ధనప్రాప్తి కల్గును .
ఇక్కడ గమనించ వలసిన విషయము కుజుడు
బలవంతుడై ఉంటే వ్యవసాయము వలననూ , వివిధ రకముల మట్టి మూలమున అనగా గృహ నిర్మాణ
రంగములు , కాంట్రాక్టులు , మున్నగు వాటివలన ధన యోగము ప్రాప్తిన్చుచున్నది
బృహస్పతి బలము కలిగి యుండిన జాతకులకు
విద్యామూలమున , గృహములు , అద్దెల మూలమున మరియు తన వాక్చాతుర్యము చే మధ్య
వర్తిత్వము చేయు వ్యవహారముల వలన , భోధన విధానముల వలన ఇలా అనేక విధముల ధన యోగము
కల్గుచున్నది .
మూడవ ఇంట చంద్రుడున్న జాతకులకు శౌర్య
పరాక్రమములు తక్కువగా ఉండును . మాతృ సంభంద విషయములలో కొంత నష్టము సంభవించును .
ఒక్కొక్కప్పుడు విద్యా వ్యవహారములలో కొద్ది ఆటంకాలు ఏర్పడవచ్చును .సోదరీలు
ఎక్కువగా ఉంటారు . వీరి యొక్క భాద్యతలు కూడా ఉండును .
నాల్గవ స్థానమున చంద్రుడుండిన జాతకునకు
ఇక్కడ చంద్రునికి స్వక్షేత్రము అగుట వలన మాత్రు ప్రేమ అధికము .మంచి విద్య
ప్రాప్తించును . ఈ చంద్ర మహా దశా కాలమున మంచి గృహము నిర్మాణము చేయుదురు .
సుఖవంతమైన జీవనము ఏర్పడును .
పంచమ స్థాన చంద్ర స్థితి వలన సాధారణముగా
మొదట సంతతికి నష్టము ఏర్పడుట గానీ , లేక స్త్రీ సంతతి గానీ కలుగ వచ్చును , మంచి
ప్రయోజకులైన సంతాన ప్రాప్తి కల్గును.
ఆరవ ఇంట చంద్రుడు ఉండిన జాతకులకు గర్భ
సంభంధమైన అనారోగ్యము కల్గును . విద్యకు మధ్యలో ఆగి పోవచ్చు .తల్లికి అనారోగ్యము
తప్పదు.
మిగతా భావాలను గురించి తదుపరి శీర్షికలలో
................
No comments:
Post a Comment