2014-12-12

కుంభ రాశి

కుంభ రాశి : ఈ రాశికి శనీశ్వరుడు అధిపతి . ఇది వాయు  తత్వ రాశి.  మరియు స్థిర రాశి . ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని పద్దతులు ఉంటాయి .వీరు రహస్యములను గానీ ,వ్యక్తిగత విషయములను గానీ ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు .గుంభనంగా ఉంటారు , ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకొంటారు . పరిశుభ్రతను పాటిస్తారు . ఈ రాశిలో పుట్టిన కొందరు వైద్యులు గానూ , రసాయన శాస్త్రవేత్తలు గానూ రాణిస్తారు .

ప్రయాణములు చేయుట వీరికిష్టము. విహారయాత్రలు , కొత్త కొత్త ప్రదేశము లను సందర్శించడం అలవాటు. వీరు తమ మనోభావములను తమ జీవితములోని కష్ట , సుఖములను ఇతరులకు తెలియనీయరు . ఎంత భాధలు అనుభవించిననూ, మానసిక స్థైర్యాన్ని కోల్పోరు .. ఆనందముగా గడుపుటకు ఇష్ట పడతారు . వీరికి కొంత బిడియము ఉంటుంది . సంపాదన విషయములో స్థిర మైన ప్రణాళికతో ఉంటారు .

ఈ రాశి వారు నడి వయస్సు వరకు సాధారణ జీవితమును గడుపుతారు.నడివయస్సు నుండి ఆర్ధిక స్థిరత్వమును పొంద గలరు . వృద్ధి లోనికి రాగలరు .  ఆచార సంప్రదాయములను ఇష్ట పడరు . ప్రతి వారికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలని కోరుకొంటారు .ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతకాలని కట్టుబాట్లు, పాత ఆచారాలు మొదలగు వాటిని వ్యతిరేకిస్తారు .   ప్రపంచములో జరగబోయే సంఘటనలు ముందుగా ఊహించగల మేధాశక్తి వీరి సొంతము .ఈ రాశికి చెందిన కొందరు నూతన విషయములను కనిపెట్టి ప్రపంచమునకు అందివ్వగలరు .

 భావితరాలకు మార్గ దర్శకులు అవుతారు . తగవులు ఆడుకోవడం వీరికి ఇష్టం ఉండదు . ప్రశాంతతను కోరుకొంటారు . స్నేహితులు ఉంటారు . కానీ వీరికి ఒంటరిగా గడపడం అంటే ఇష్టం . పని చేయుటలో ఒక పద్ధతిని అవలంభిస్తారు. వీరి జీవితము క్రమ శిక్షణ కలిగి ఉంటుంది . సమయపాలన అనేది చాలా బాగుంటుంది . వీరి అలవాట్లు కూడా చాలా బాగుంటాయి . ప్రతి పనిని టైము ప్రకారము చేస్తారు . జీవిత భాగస్వామికి కూడా మంచి విలువనిస్తారు .తమ అభిప్రాయములను ఇతరులపై రుద్దరు .            .  .  


No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...