ఉదార గుణము కలవారు . దాన ధర్మములు
చేస్తారు . పదిమంది తమగురించి మంచిగా చెప్పుకోవాలని అనుకొంటారు . ద్వేషము , ఈర్ష్య
, అసూయ లాంటి మనస్సు వీరికుండదు . కపటము లేనివారు . అన్ని మతాల పట్ల సద్భావము
కలిగి ఉంటారు . ధనము సంపాదించుట కన్నా ఖర్చులు ఎక్కువ . కుటుంబ భాధ్యతలను అంతగా
పట్టించుకోరు . ‘’ మానవ సేవే మాధవ సేవ ‘’ అన్నట్లు ఎప్పుడు సేవా కార్యక్రమములలో ఎక్కువగా
పాల్గొంటారు .
అందరూ సమానమేననీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ
అను భావము వీరికి ఉండదు .
వీరు నమ్మకమైన వారు . వృత్తి , వ్యాపార ,
ఉద్యోగములలో భాద్యతగా పనిచేస్తారు . నిజాయితీ కలవారు .వేదాంతము , భక్తీ వీరిలో
ఎక్కువగా ఉంటుంది .ఆచార సంప్రదాయములకు విలువ ఇస్తారు . జ్ఞానము కలవారు . మంచి
చెడుల నెరిగి ప్రవర్తిస్తారు .సాయము చేయడములో ముందుంటారు . లోకములో అందరు మంచి
వారే అను భావముంటుంది . క్షమా గుణము కలవారు . ఎవరి వలనైనా అపకారము జరిగినచో వారి
పాపాన వారే పోతారని అనుకొంటారు .
వీరికి సామాజిక భాద్యత ఎక్కువ . సమాజము
గురించే ఎక్కువ ఆలోచిస్తారు .ఎదుటివారి సమస్యలను, కష్టములను ఓపికగా వింటారు . తమకు
తెలిసి నంతలో వారి సమస్యలకు పరిష్కారము చూపించుటకు ప్రయత్నిస్తారు . అవసరమైతే
వారికి ధన సహాయము చేయుటకు కూడా వెనుకాడరు . వీరికి ధనముపై మోజు తక్కువ .కీర్తి
ప్రతిష్టలు గురించి తాపత్రయ పడతారు .
No comments:
Post a Comment