2013-06-12

దశా పద్ధతి



మానవుని జీవన విశేషములను తెలుసుకొనుటకు మహర్షులు దశా పద్ధతిని అనుసరించారు.
దశా పద్ధతిలో కాల చక్ర దశ, యోగిని దశ , వింశోత్తరి దశా మొదలగు అనేక దశా పద్ధతులను ఉపయోగించి నప్పటికీ పరాశర మహర్షి చే చెప్పబడిన వింశోత్తరి దశా విధానమే అత్యంత ప్రాచుర్యం పొందినది .
ఈ వింశోత్తరి దశా విధానములో మానవుని పరమాయుర్ధాయము 12౦ సంవత్సరములుగా నిర్ణయం చేస్తూ గ్రహములకు దశా సంవత్సరములు తెల్పితిరి .

సూర్యుడు  6 సంవత్సరములు, చంద్రుడు   10 సంవత్సరములు , కుజుడు  7  సంవత్సరములు , రాహువు   18 సంవత్సరములు , గురుడు  16 సంవత్సరములు, శని  19  సంవత్సరములు, బుధుడు 17 సంవత్సరములు, కేతువు 7 సంవత్సరములు, శుక్రుడు 20 సంవత్సరములు
ఈ విధంగా తొమ్మిది గ్రహాల దశా సంవత్సరములు మొత్తం 12౦ సంవత్సరములు అవుతుంది .

ఉదా : 1 . 1 . 2010 శుక్రవారం మధ్యాహ్నము  ౦౩ . 25 ని.కు కాకినాడ లో ఒక అమ్మాయి పుట్టినది అనుకొందాము .  ఆ రోజు పునర్వసు నక్షత్రము ఉదయం 06 . 43 ని.కు ప్రారంభమై రాత్రి గం ౦౩ . 57  ని .లు వరకు ఉన్నది
ఈ అమ్మాయి పుట్టిన దశను ఈ విధముగా తెలుకోవచ్చు

పునర్వసు నక్షత్ర ప్రమాణము మొత్తం 21 గంటల 14 ని .లు ఉన్నది .జాతకురాలు జన్మించిన సమయమునకు పునర్వసు నక్షత్రము లో గడచిన సమయము 08 గం .ల 42 ని.లు పునర్వసు నక్షత్రములో మిగిలిన సమయము గం.లు 12 . ౩2 ని.లు ఇక్కడ పునర్వసు నక్షత్రమునకు గురుడు అధిపతి అగుచున్నాడు కావున ఈమె గురు మహర్దశ లో పుట్టింది అని తెలుసు కోవాలి  

దశా శేషం తెలుసు కోవడం నక్షత్ర ప్రమాణము మొత్తము నుండి జాతకులు జన్మించిన సమయమునకు నక్షత్రములో గడచిన సమయమునకు అధిపతియైన గ్రహము యొక్క దశా సంవత్సరములను లెక్కవేసి తీసి వేస్తె దశా శేషము వస్తుంది

ఈ అమ్మాయి గురు దశా సంవత్సరములు 16 జన్మించిన సమయమునకు గడచిన సంవత్సరములు 6సం 6 నెలలు 22 రోజులు పోగా 09 సంవత్సరముల 05 నెలలు 8 రోజులు  గురు మహర్దశ శేషము ఉన్నది .
 జన్మ తేది        01 .  01 . 2010
                    08 . 05 . 09     గురు దశా శేషం
                   ---------------
                   09 . 06 . 2019  వరకు
తదుపరి          ౦౦ . ౦౦ . 19     శని మహర్ద శ
                    ---------------
తదుపరి          09 . 06 . 20౩8  వరకు  ఈవిధముగా పైన చెప్పినట్లు ఒక దశ తరువాత మరియొక దశ ప్రారంభ మగును .   

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...