2013-05-31

గ్రహ స్థానములు

సూర్యునకు మేషరాశి  ఉచ్చ రాశి, దానికి ఎదురుగా ఉన్న తుల రాశి నీచ రాశి
చంద్రునకు  వృషభ రాశి ఉచ్చ రాశి  దానికి ఎదురుగా ఉన్న వృశ్చిక రాశి నీచ రాశి
కుజునకు మకర రాశి ఉచ్చ రాశి దానికి ఎదురుగా ఉన్న కర్కాటక రాశి నీచ రాశి
బుధు నకు కన్య రాశి ఉచ్చరాశి దానికి ఎదురుగా ఉన్న మీన రాశి నీచరాశి
గురునకు కర్కాటక  రాశి ఉచ్చరాశి దానికి ఎదురుగా ఉన్న మకర రాశి నీచ రాశి
శుక్రునకు మీన రాశి ఉచ్చరాశి దానికి ఎదురుగా ఉన్న కన్య రాశి నీచ రాశి
కుజునకు తులా రాశి ఉచ్చ రాశి దానికి ఎదురుగా ఉన్న మేష రాశి నీచ రాశి 

ఉచ్చ స్థానములలో ఉన్న గ్రహము మంచి ఫలితములు ఇచ్చునని . నీచ స్థానములో ఉన్న గ్రహములు చెడు ఫలితము లు కలిగించును .

జన్మ లగ్న నుండి కేంద్రము లలో అనగా { 1, 4, 7 , 10 }స్వక్షేత్రము , ఉచ్చ స్థానములో ఉన్న గ్రహముల వలన  పంచ మహా పురుష యోగములు ఏర్పడుచున్నవి.
ఈ యోగములు సూర్య చంద్రులను మినహాయించి కుజ , బుధ , గురు , శుక్ర , శని గ్రహముల వలన ఏర్పడును .
జన్మ లగ్నము నకు గానీ , జన్మ రాశి కి గానీ ఉచ్చ స్థానములో ఉన్న గ్రహములను బట్టి యోగములు కలుగును.
అట్టి యోగమున జన్మించిన వారు సూర్య చంద్రులు ఉన్నంత కాలము కీర్తిని పొందుతారని ఉన్నది .

హిందువులకు ఆరాధ్య దేవుడు , దైవాంశ స్వరూపుడు అయిన శ్రీ రామ చంద్రుడు మానవుడు గా పుట్టిన  సమయములో  ఈ పంచ మహాపురుషుల యోగము పట్టినదని మహర్షి వచనము .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...