మరి ఈ కుజ దోషము ను
గురించి మహర్షులు ఇంత లోతుగా ఎందుకు అధ్యయనము చేసి యున్నారు .
ఎందువలన అంటే కుజుడు దోష స్థానములో ఉన్నప్పటికీ
గురు గ్రహము యొక్క కలయిక గానీ , దృష్టి గానీ ఉన్నప్పుడు మరియు కుటుంబ స్థానము , కళత్ర స్థానము శుభప్రదము గా ఉన్నప్పుడు కుజుని దోష తీవ్రత తగ్గి దంపతులు సుఖ జీవనము
గడుపుతారని మహర్షుల చే చెప్ప బడినది .
కుజుడు ముఖ్యము గా సంసార జీవితము లో సమస్యలను సృష్టించును . అలా అని కుజుడే లేకపోతే మానవునకు సంసార వాంఛ ఉండదు .
ఉదా : పొయ్యి పై
ఒక పాత్రలో నీటిని పోసి మరగించి నపుడు ఆవిరి అవుతుంది .నీరు రూపాంతరము చెందింది .
మానవ శరీరములో కామమునకు శుక్రుడు ఆధిపత్యము వహించును . ఇక్కడ శరీరములో నిద్రాణమై ఉన్న కోరిక ను రగిల్చే వాడు కుజుడు . కుజుడు ప్రభావము వలన కోరిక కలిగి సంసార సుఖము ను అనుభవింతురు . తద్వారా జీవి ఉత్పత్తి జరుగుతుంది . అనగా పిల్లలు పుడతారు . ఈ విధముగా సృష్టి లో మానవుని ఉత్పత్తి జరుగుట కు మూల కారకుడు కుజుడు. .
కుజుడు మరియు
శుక్ర గ్రహములు సరియైన
స్థితి లో ఉండవలెను . అట్లు లేని యెడల కామ వాంఛ ఎక్కువగా ఉండును . ఒక్కొక్కప్పుడు ఈ విధమైన గ్రహ స్థితులు బాగుగా
లేనివారు వ్యభిచారులు , మరియు
దుష్ప్రవర్త న కలిగి ఉంటారు . అట్లు ఉండుట వలన కుటుంబ మర్యాద గంగ లో కలసి పోవును . భార్యా భర్త
మధ్య స్పర్ధలు ఏర్పడి దాంపత్యము ముక్కలగును
గురుడు బుద్ధికి
, జ్ఞానము నకు కారకుడు ,
ఈయన వైద్యుని తో సమానము , జబ్బు చేసిన మానవుని తిరిగి నయం చేసి ఆరోగ్య వంతుడిగా చేయగల
శక్తి వైద్యునకు ఏ విధంగా ఉంటుందో , అదే విధంగా కుజుడు వలన కలుగు దుష్ప్రవర్తన , దురాలోచనలను , దూరం చేసి మానవునకు వివేకాన్ని , బుద్ధిని , జ్ఞానాన్ని ప్రసాదించి సత్ప్రవర్తన తో నడచునట్లు చేయును .
No comments:
Post a Comment