2013-06-17

పుట్టినరోజు



పిల్లలు పుట్టిన సంవత్సరమునకు పుట్టిన రోజు జరుపుకొను ఆచారము ఉన్నది .. శాస్త్ర ప్రకారము అయితే పిల్లలు జన్మించిన నాటి తిధిని తెలుసుకొని తిధి ప్రకారము జరుపుకోవాలి.  కానీ ప్రస్తుత కాలములో ఇంగ్లీషు తేదీ ప్రకారము చేయుచున్నారు . అంతే  కాకుండా పుట్టినరోజు పండగను చాల ఆర్భాటముగా చేస్తున్నారు . 

ప్రతి సంవత్సరము పిల్లలు పుట్టిన రోజున మొదట దైవ దర్శనము చేయించాలి . శాస్త్రోక్తముగా అభిషేకములు , అర్చనలు చేయించాలి . ముఖ్యముగా శివాలయములో జరిపించాలి . ఎందుకంటే శివుడు మృత్యుంజయుడు కదా . పిల్లలకు బాలారిష్టములు , గ్రహ దోషములను తొలగించి దీర్గాయురారోగ్యములను ప్రసాదిస్తాడు . వీలయినంత మందికి అన్నదానము చేయాలి . ఈ విధముగా చేయుట వలన పిల్లలకు మంచి ఆరోగ్యము కలిగి సుఖంగా ఉంటారు . 

తదుపరి మీ మీ ఆర్ధిక స్తోమతలను బట్టి స్నేహితులను , బంధువులను , ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి హంగు , ఆర్భాటములతో కేక్ కటింగు ,మొదలగు  ఏర్పాట్లు చేసుకోవచ్చు .   

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...