2013-06-17

కేశఖండన



పిల్లలు పుట్టిన తరువాత ప్రతి ఒక్కరికి పుట్టు వెంట్రుకలు తీయుట ఆచారముగా ఉన్నది . దీనినే కేశఖండన అంటారు . ఈ కార్య క్రమము బిడ్డ జన్మించిన 6 7 8  10 వ నెలల యందు గానీ , ౩ వ సంవత్సరమునందు గానీ జరిపించాలి . అశ్విని , పుష్యమి , పునర్వసు , మృగశిర , స్వాతి , రేవతి , శ్రవణం , ధనిష్ట ,శతభిష నక్షత్రముల లోనూ సోమ . బుధ , గురు , శుక్ర వారముల యందు , విదియ , తదియ , పంచమి , సప్తమి , దశమి , త్రయోదశి  తిదుల యందు శుభ లగ్నముల లో ఉదయం 6 నుండి మధ్యాహ్నము 12 గంటల లోపల జరిపించాలి .

ఈ కార్యక్రమము జరిపించుటలో కొందరికి ప్రాంతీయ ఆచారములు ఉన్నవి . ఒక్కొక్క కుటుంబములో వారికి వారి ఇంటి ఇలవేల్పు అయిన దేవాలయములలో గానీ , నామకరణము చేసినపుడు పేరుకు సంబంధించిన దేవుని ఆలయములో గానీ పుట్టు వెంట్రుకలు తీయుట ఆచారముగా ఉన్నది .

చెవులు కుట్టుటకు
చెవులకు ఆభరణములు ధరించే పద్ధతి పూర్వకాలమునుండి ఆచారముగా వస్తుంది . ఆనాటి కాలములో పురుషులకు కూడా చెవులు కుట్టించే వారు . కాల క్రమేణా స్త్రీలకు  మాత్రమే చెవులు కుట్టించు చున్నారు. .
శ్రవణం , ఆరుద్ర , హస్త , చిత్త , మృగశిర , రేవతి , ఉత్తర, ఉత్తరాషాడ , ఉత్తరాబాద్ర , పునర్వసు , పుష్యమి , ధనిష్ఠ నక్షత్రములలోనూ ,శుభ గ్రహ రాసులలోనూ , శుభ గ్రహ వారముల లోనూ , శుభ తిధుల యందునూ చెవులు కుట్టించుట మంచిది . 

పంచ పర్వములు , రిక్త తిధులు ల లో చెవులు కుట్టించ కూడదు .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...